
కొంతమంది కుట్రలు చేస్తున్నారు: కేసీఆర్
హైదరాబాద్: మురికికూపంలా మారిన హుస్సేన్ సాగర్ ను ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. విగ్రహాల నిమజ్జనం వల్ల కాలుష్యం పెరుగుతుంది కాబట్టి ప్రత్యామ్నాయంగా వినాయకసాగర్ నిర్మించాలని భావిస్తున్నట్టు చెప్పారు. హుస్సేన్ సాగర్ చుట్టూ ఆకాశ హర్మ్యాలను నిర్మించడం వల్ల హైదరాబాద్ కు ప్రత్యేక గుర్తింపు వస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
మెట్రోరైలు ప్రాజెక్టు ముందుకు పోకుండా కొంతమంది కుట్రలు చేస్తున్నారని, తప్పుడు ప్రచారానికి దిగుతున్నారని ఆరోపించారు. అన్నింటినీ అధిగమించి మెట్రోరైలు ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు.