ఉన్నతాధికారులతో స్పీకర్ భేటీ
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పలు సూచనలు
హైదరాబాద్: శాసన సభ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో స్పీకర్ ఎస్.మధుసూదనాచారి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ సమావేశానికి మండలి చైర్మన్ స్వామిగౌడ్, సీఎస్ ఎస్.పి.సింగ్ హాజరయ్యారు. బడ్జెట్ సమావేశాలకు సంబంధించి అధికారులకు స్పీకర్ పలు సూచనలు చేశారు.
గత సమావేశాలకు సంబంధించి జీరో అవర్, ప్రత్యేక ప్రస్తావనలు, వాటికి ఇవ్వాల్సిన సమాధానాలను వెంటనే శాసనసభ సచివాలయా నికి పంపించాలని ఆదేశించారు. శుక్రవారం మొదలు కానున్న బడ్జెట్ సమావేశాల్లో సభ్యులు అడిగే ప్రశ్నలు, ఇతర నిబంధలనకు సంబంధించిన సమాచారం వెంటనే శాసన సభ సచివాలయానికి పంపించాలని సూచించారు. సమావేశాల సందర్భంగా భద్రత, తదితర అంశాలపై కూడా చర్చించారు. మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, శాసనసభ డిప్యూటీస్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.