బిల్ట్‌ కష్టాలు | special story for built industry | Sakshi
Sakshi News home page

బిల్ట్‌ కష్టాలు

Published Tue, Sep 26 2017 1:12 PM | Last Updated on Tue, Sep 26 2017 1:13 PM

special story for built industry

జయశంకర్‌ జిల్లా మంగపేట మండలం కమలాపురంలోని బిల్ట్‌ పరిశ్రమ

మూడున్నరేళ్ల క్రితం మూతపడిన కాగితపు గుజ్జు పరిశ్రమ
ఖాయిలా పడిన పరిశ్రమలను పునరుద్ధరించే ప్రక్రియలో భాగంగా పారిశ్రామిక ప్రోత్సాహక విధానం కింద రాష్ట్ర ప్రభుత్వం బిల్ట్‌ పునరుద్ధరణకు నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి 2015 డిసెంబరు 14న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం 25 శాతం టారిఫ్‌కే మూడు మెగావాట్ల కరెంటును సరఫరా చేస్తారు.   సాధారణ ధర కంటే తక్కువకు బిల్ట్‌కు కరెంటును ఇవ్వడం వల్ల సబ్సిడీ గరిష్టంగా రూ.9 కోట్లు ఉంటుంది. కాగితపు గుజ్జుకు ముడి సరుకుగా వినియోగించే జామాయిల్, వెదురు కలపను రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ  సబ్సిడీపై సరఫరా చేస్తుంది.

వరంగల్‌ నుంచి అలువాల సదాశివుడు/ధర్మపురి శ్రీనివాస్‌ :
బల్లాపూర్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (బిల్ట్‌) కాగితపు గుజ్జు పరిశ్రమ పునరుద్ధరణ ప్రక్రియ అంతు లేని కథగా కొనసాగుతోంది. ఈ పరిశ్రమ పునరుద్ధరణ  కోసం రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ప్రకటించి ఏడాదిన్నర గడిచినా ఇంత వరకు బిల్ట్‌ పరిశ్రమ తెరుచుకోలేదు. ప్రభుత్వ పరంగా ఆశించిన చొరవ లేకపోవడంతో బిల్ట్‌ యాజమాన్యం స్పందిండంలేదు. దీంతో ఈ పరిశ్రమపై ఆధారపడిన తొమ్మిది వేల కుటుంబాల పరిస్థితి దయనీయంగా తయారైంది.

ఎవరూ పట్టించుకోకనే..
విద్యుత్, ముడి సరుకులకు సంబంధించి గరిష్ట సబ్సిడీ రూ.30 కోట్లు మించకుండా ఏడేళ్లపాటు కొనసాగుతుందని ప్రభుత్వం ఆ ఉత్తర్వులో పేర్కొంది. 2015 డిసెంబ రులో ఈ జీఓ వెలువడగా మూడు నెలల్లో బిల్ట్‌ను పునరుద్ధరించాల్సి ఉంది. ప్రభు త్వ ఉత్తర్వులపై స్పందించిన బిల్ట్‌ యాజ మాన్యం ఒకేసారి ప్రభుత్వంతో  చర్చలు జరిపి చేతులు దులుపుకుంది. పరిశ్రమ పునరుద్ధరణ జరగాలంటే.. పెండింగ్‌ వేతనాలు, అలవెన్సులు, ఇతర సౌకర్యా ల విషయంలో కోత విధించక తప్పదని యాజమాన్యం స్పష్టం చేయగా.. కార్మికు లు అంగీకరించారు. కానీ ప్రభుత్వం, బిల్ట్‌ వైపు నుంచి ఎవరూ ముందుకు రాలే దు. దీంతో పునరుద్ధరణ అటకెక్కింది.

మూడున్నరేళ్లుగా ఆందోళన
మూడున్నరేళ్లుగా బిల్ట్‌ ఉద్యోగులు,∙కార్మికులు ఆందోళన చేస్తున్నా ఇటు ప్రభుత్వం వైపు నుంచి గానీ అటు బిల్ట్‌ యాజమాన్యం వైపు నుంచి గానీ స్పందన రావడం లేదు.

ప్రారంభం నుంచి మూసివేత వరకు..
జయశంకర్‌ జిల్లా మంగపేట మండలం కమలాపురంలో 1975లో ఆంధ్రప్రదేశ్‌ పారి శ్రామిక అభివృద్ధి సంస్థ (ఏపీఐఐసీ) ఆధ్వ ర్యంలో ఆంధ్రప్రదేశ్‌ రేయాన్స్‌ పేరుతో ఈ పరిశ్రమ ఏర్పాటైంది. 1981లో ఈ పరిశ్రమ లో ఉత్పత్తి మొదలైంది. అనంతరం దీన్ని బల్లాపూర్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (బిల్ట్‌) యాజమాన్యం కొనుగోలు చేసింది. ఈ పరి శ్రమలో ఉత్పత్తి అయిన కాగితపు గుజ్జును గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ కొనుగోలు చేస్తుండేది. బిల్ట్‌ కంటే బహిరంగ మార్కెట్‌ లో కాగితపు గుజ్జు తక్కువ ధరకు లభిస్తుం డడంతో 2014 ఏప్రిల్‌లో గ్రాసిమ్‌ సంస్థ కాగితపు గుజ్జు కొనుగోలును నిలిపివేసిం ది. మార్కెట్‌ లేకపోవడంతో 2014 ఏప్రిల్‌ 6వ తేదీన బిల్ట్‌ యాజమాన్యం పరిశ్రమలో కార్యకలాపాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో దీనిపై  ఆధారపడిన ఉద్యోగులు, కార్మికులకు ఉపాధి కరువైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement