పండుగలకు పలు ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: క్రిస్మస్, న్యూఈయర్, సంక్రాంతి పర్వదినాల సందర్భంగా వివిధ రూట్లలో ప్రయాణికుల రద్ధీని దృష్టిలో ఉంచుకుని 54 ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్-విజయవాడ (07757/07758) ప్రత్యేక రైలు ఈ నెల 4, 11, 18, 25, జనవరి 1, 8, 15, 22, 29 తేదీల్లో ఉదయం 5.30కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 10.45కు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అవే తేదీలలోనే సాయంత్రం 5.30కు విజయవాడ నుంచి బయలుదేరి రాత్రి 10.50కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. నాందేడ్-తిరుపతి (07607/07608) రైలు ఈ నెల 6, 13, 20, 27, జనవరి 3, 10, 17, 24, 31 తేదీలలో సాయంత్రం 6.45కు నాందేడ్ నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో ఈ నెల 7, 14, 21, 28 తేదీలలో జనవరి 4, 11, 18, 25 తేదీలలో మధ్యాహ్నం 3.45కు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.30కు నాందేడ్ చేరుకుంటుంది. కాచిగూడ-టాటానగర్ (07438/07439) ప్రత్యేక రైలు జనవరి 2, 9, 16, 23, 30, ఫిబ్రవరి 6, 13, 20, 27 తేదీలలో మధ్యాహ్నం ఒంటిగంటకు కాచిగూడ నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 7.45కు టాటానగర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో జనవరి 3, 10, 17, 24, 31, ఫిబ్రవరి 7, 14, 21, 28 తేదీలలో రాత్రి 10.50కి టాటానగర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.