
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా ట్యాంక్‌బండ్ వద్ద ఏర్పాటు చేయతలపెట్టిన నీరాస్టాల్‌తోపాటు తెలంగాణ వంటకాలతో ఒక ఫుడ్‌కోర్టును కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ వద్ద ఉన్న స్థలాన్ని సోమవారం ఆయన ఎక్సైజ్ కమిషనర్ సోమేశ్‌కుమార్, టూరిజం ఎండీ మనోహర్‌తో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు కులవృత్తులను పట్టించుకున్న పాపాన పోలేదని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే కుల వృత్తులను కాపాడేందుకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టామని తెలిపారు. అందులో భాగంగా గౌడ కులవృత్తిని ఆదుకోవడానికి నీరాను అందుబాటులోకి తెచ్చినట్టు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment