అసలు నిల్వ ఎంత? | Sriram Sagar Project Water Storage Capacity Nizamabad | Sakshi
Sakshi News home page

అసలు నిల్వ ఎంత?

Published Mon, Aug 6 2018 2:29 PM | Last Updated on Wed, Oct 17 2018 6:10 PM

Sriram Sagar Project Water Storage Capacity Nizamabad - Sakshi

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో పేరుకుపోయిన పూడిక

బాల్కొండ : శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి 200 క్యూసెక్కుల నీటి కోసం ఓవైపు రైతాంగం పోరాటం కొనసాగిస్తుంటే, చుక్కనీటిని వదిలేందుకు కూడా సర్కారు ససేమీరా అంటోంది.. అయితే, అసలు జల వివాదానికి మూలమైన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యమెంత..? పేరుకుపోయిన పూడిక ఎంత? అనే దానిపై అనుమానాలెన్నో వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి 112 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించిన ఎస్సారెస్పీలో ప్రస్తుతం పెద్ద మొత్తంలో పూడిక పేరుకుపోయింది. 1994లో నిర్వహించిన సర్వే ప్రకారం 22 టీఎంసీల మేర పూడిక పేరుకుపోయినట్లు తేలింది. 

అప్పటి నుంచి ఇప్పటికీ అవే లెక్క ల ప్రకారమే నీటి నిల్వల గురించి చెబుతున్న అధికారులు.. 2014–2015లో నిర్వహించిన సర్వే నివేదికను మాత్రం బయట పెట్టడం లేదు. దీనిపై సర్కారు కూడా నోరు మెదపట్లేదు. ఎందుకంటే ఎస్పారెస్పీ నిల్వ సామర్థ్యం దారుణంగా పడిపోయిందని అప్పట్లో సర్వే నిర్వహించిన సంస్థ తన నివేదికలో వెల్లడించింది. ప్రాజెక్టు సామర్థ్యం 80 టీఎంసీలకు పడిపోయిందని స్పష్టం చేసింది. అయితే, ఈ నివేదికను ఇటు సర్కారు, అటు అధికారులు బయట పెట్టడం లేదు. పూడిక తొలగింపునకు చర్యలు చేపట్టడం లేదు. 

ఎందుకంత గోప్యత? 
శ్రీరాంసాగర్‌ తాజా నీటి నిల్వ సామర్థ్యంపై ఇటు ప్రభుత్వం, అటు అధికారులు ఎందుకు గోప్యత పాటిస్తున్నారనేది అంతు చిక్కని రహస్యంగా మా రింది. వాస్తవానికి 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు ముందుకు రాని ప్రభుత్వం.. పూ డికను పరిగణనలోకి తీసుకోకుండా ఎప్పుడో రెం డు దశాబ్దాల క్రితం నాటి లెక్కలు చెబుతుండడంౖ పె ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. ప్రాజెక్ట్‌లో ప్రస్తుత నీటి నిలువ సామర్థ్యం ఎం త... ప్రస్తుతం ఎంత నీరు నిల్వ ఉందని ప్రశ్నిస్తున్నారు. 90 టీఎంసీల సామర్థ్యం లెక్కల్లో ప్రస్తు తం 15.93 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే, ఆ లెక్కలు వాస్తమై తే ప్రాజెక్ట్‌లో తాగునీటి అవసరాలకు, డెడ్‌ స్టోరే జీకి పోను మిగిలిన నాలుగు టీఎంసీల్లో అర టీఎంసీ నీటిని వదిలి తమ పంటలను కాపాడాలని ఆయకట్టు రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. 

వాస్తవం వేరు.. 
అయితే, 2014 డిసెంబర్, 2015 జనవరిలో నిర్వ హించిన పూడిక సర్వేలో ప్రాజెక్ట్‌ నీటి నిల్వ సామ ర్థ్యం 80 టీఎంసీలకు పడిపోయిందని తేలింది. ఆ నివేదిక ప్రకారమైతే, ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 15.93 టీఎంసీల నీరు నిల్వ ఉండదు. అందుకనే, సర్కారు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేయ డం లేదని కాకతీయ కాలువ పరివాహ ప్రాంత రైతు లు చెబుతున్నారు. 1994లో ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్‌ రీచార్జి ల్యాబోరేటరీ (ఏపీఈఆర్‌ఎల్‌) నిర్వహించిన సర్వే నివేదిక ఆధారంగానే ప్రాజెక్ట్‌ నీటి నిల్వ సామర్థ్యాన్ని ప్రాజెక్ట్‌ అధికారులు 90 టీఎంసీలుగా పేర్కొంటున్నారు. అయితే, గత 24 ఏళ్లలో ప్రాజెక్ట్‌కు భారీ వరదలు వచ్చాయి.

వరదలతో పాటు పూడిక వచ్చి చేరింది. కానీ, అధికారులు రెం డు దశాబ్దాల క్రితం నాటి లెక్కలే చెబుతుండడం విశేషం. 1994లో సర్వే నిర్వహించిన అదే ఏపీఈఆర్‌ఎల్‌.. 2014లోనూ సర్వే నిర్వహించింది. భారీగా పూడిక చేరిందని, ప్రాజెక్ట్‌ నీటి నిల్వ సామర్థ్యం 80 టీఎంసీలకు పడి పోయిందని ఆ సంస్థ తన నివేదిక లో వెల్లడించింది. కానీ అధికారులు ఆ నివేదికను పరిగణనలోకి తీసుకోకుండా ఇప్పటికీ 90 టీఎంసీల సామర్థ్యంలోనే లెక్కలు చూపుతున్నారు. పూడిక ఎంతుందో బయట పెట్టకుండా నీటి నిల్వలపై కాకి లెక్కలు చూపుతున్నారని యకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. ఎస్సారెస్పీలో అసలు నిల్వ ఎంత ఉందో తేల్చాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

‘పూడిక’ లెక్కలు.. 
శ్రీరాంసాగర్‌కు పూడిక ముప్పు ముంచుకొస్తుంది. ఏటా ప్రాజెక్ట్‌లోకి భారీ వరదల వలన వచ్చే మట్టి తో ప్రాజెక్ట్‌లో భారీగా పూడిక పేరుకుపోతోంది. ఫలితంగా ప్రాజెక్ట్‌ నీటి సామర్థ్యం ఏటేటా తగ్గుతోంది. మొద ట్లో 112 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ప్రాజెక్ట్‌ నిల్వ సామర్థ్యం ప్రస్తుతం 80 టీఎంసీలకు పడిపో యింది. 1994లో ఏపీఈఆర్‌ఎల్‌ సంస్థ సర్వే ప్రకా రం ప్రాజెక్ట్‌లో 21.71 టీఎంసీల పూడిక చేరింది. తరువాత అదే సంస్థ 2006లో చేపట్టిన సర్వే ప్రకా రం ప్రాజెక్ట్‌ నీటి సామర్థ్యం 79.96 టీఎంసీలకు పడిపోయింది. కానీ ఆ సర్వే నమ్మశక్యంగా లేదని అధికారులు కొట్టిపారేశారు. 2008లో రీసర్వే కోసం ప్ర తిపాదనలు పంపించగా, 2014 డిసెంబర్‌లో రీసర్వే చేపట్టారు. ఆ సర్వే ప్రకారం ప్రాజెక్ట్‌ నీటి నిల్వ సామర్థ్యం 80 టీఎంసీలకు పడి పోయిందని తేలింది. ప్రాజెక్ట్‌లో పూడిక తొలిగించి ఆయకట్టును కాపాడాలని వేడుకుంటున్నారు.

ఎస్సారెస్పీలోకి స్పల్వ ఇన్‌ఫ్లో.. 
ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి స్థానిక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వలన స్వల్ప ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. 550 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని ప్రాజెక్ట్‌ అధికారులు తెలిపారు. ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 (90 టీఎంసీలు) అడుగులు కాగా, ఆదివారం సాయంత్రానికి 1062.10(16.06 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని పేర్కొన్నారు. 

బురదలోకి రివర్స్‌ స్లూయిజ్‌ గేట్లు 
ఎస్సారెస్పీలో పేరుకు పోయిన పూడికను వరదల ద్వారా తొలిగించేందుకు ప్రాజెక్ట్‌ నిర్మాణ సమయంలోనే ఆరు ఆరు రివర్స్‌ స్లూయిజ్‌ గేట్లను నిర్మించారు. కానీ, ప్రాజెక్ట్‌ నుంచి ఇన్నేళ్లు వందల టీఎంసీల నీరు గోదావరి పాలు చేసినా, ఏ రోజు కూడా ఈ గేట్లను ప్రాజెక్ట్‌ అధికారులు వినియోగించలేదు. రివర్స్‌ స్లూయిజ్‌ గేట్లు పూర్తిగా మట్టిలో కూరుకుపోయాయి. గేట్లను ఎత్తితే కిందకు దిగే పరిస్థితి లేకపోవడంతో అధికారులు అటు వైపు ఏనాడు కన్నెత్తి చూడలేదు. ఫలితంగా ఎస్సారెస్పీలో పూడిక భారీగా పేరుకు పోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement