వేధింపులతో ఎస్సారెస్పీ ఈఈ ఆత్మహత్య
కరీంనగర్ క్రైం: ఉన్నతాధికారుల వేధింపులు భరించలేక ఎస్పారెస్పీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఈఈ) ఆత్మహత్య చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన చక్రాల సాయిలు(53) కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్‌లోని ఎస్సారెస్పీ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కొంతకాలంగా వీరి కుటుంబం హైదరాబాద్‌లోని హబ్సిగూడలో నివాసముంటున్నారు.
విధుల కోసం సుల్తానాబాద్ కార్యాలయానికి వచ్చినప్పుడు కరీంనగర్‌లో ఉండేందుకు మంకమ్మతోటలో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి నేరుగా మంకమ్మతోటలోని గదికి వచ్చిన సారుులు ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారమందించారు. ఉన్నతాధికారి ఒకరు వేధింపులకు గురి చేస్తున్నాడని సాయిలు తమతో చెప్పుకుని బాధపడ్డాడని భార్య పేర్కొంటోంది.