పరిశీలన షురూ చేయండి
- క్రమబద్ధీకరణపై రెవెన్యూ అధికారులతో కలెక్టర్
- అభ్యంతరాలుంటే ప్రత్యేకంగా పేర్కొనాలని ఆదేశం
సాక్షి, రంగారెడ్డి జిల్లా : భూముల క్రమబద్ధీకరణలో భాగంగా జీఓ 59 కేట గిరీలో వచ్చిన దరఖాస్తుల పరిశీల నను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ రఘునందన్‌రావు రెవెన్యూ అధికారులను ఆదేశించారు. జీఓ 59, పట్టాల పంపిణీపై గురువారం కలెక్టరేట్‌లో ఆర్డీఓలు, పట్టణ ప్రాంత తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. జీఓ 59 కేటగిరీలో 11,744 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ వివరించారు. వీటికి సంబంధించి రూ. 68.92 కోట్లు ప్రభుత్వానికి డీడీల రూపంలో జమైనట్టు చెప్పారు.
ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పరి శీలన చేపట్టాలని, అభ్యంతరాలుంటే ప్రత్యేకంగా నమోదు చేయాలని, చెక్‌లిస్టులను తహసీల్దార్లందరికీ అందించినట్లు చెప్పారు. జీఓ 58కి సంబంధించి పట్టా సర్టిఫికెట్లపై సమీక్షిస్తూ.. ఇప్పటివరకు సర్టిఫికెట్ల పంపి ణీ పూర్తికాని మండలాల తహసీల్దార్లు కారణా లు పేర్కొంటూ నివేదికలివ్వాలన్నార ు. సమావేశంలో జేసీ రజత్‌కుమార్ సైనీ, డీఆ ర్వో ధర్నారెడ్డి, ఆర్డీఓలు సు రేష్, ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.