Lands Regulation
-
అసైన్డ్ భూములను ఏం చేద్దాం?
అన్యాక్రాంతమైన భూములపై సర్కారు తర్జనభర్జన - రాష్ట్రంలో 98 వేల ఎకరాలు పరాధీనం - పరిశీలనలో గుర్తించిన టాస్క్‌ఫోర్స్ కమిటీ - క్రమబద్ధీకరించాలన్న దిశగా ప్రభుత్వ యోచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసైన్డ్ భూముల అన్యాక్రాంతంపై ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే వాటిని చట్టం ప్రకారం తిరిగి స్వాధీనం చేసుకోవాలా లేక చట్టాలను సవరించి పొజిషన్లో ఉన్నవారికే క్రమబద్ధీకరించాలా అని తర్జనభర్జన పడుతోంది. 98 వేల ఎకరాలు పరాధీనం రాష్ట్రంలో ఇప్పటివరకు అసైన్ చేసిన భూముల్లో సుమారు 98 వేల ఎకరాల మేర పరాధీనమైనట్టు తేలింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 22 లక్షల ఎకరాలకు పైగా భూములను పేదలకు అసైన్ చేశారు. కానీ అందులో 14.28 లక్షల ఎకరాలను మాత్రమే పంపిణీ చేశారు. ఈ 14 లక్షల పైచిలుకు ఎకరాల్లో 98 వేల ఎకరాలకుపైగా అన్యాక్రాంతమయ్యాయని.. ఒకరికి అసైన్ చేస్తే ఇతరులెవరో అనుభవిస్తున్నారని వెల్లడైంది. సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్.కె.సిన్హా నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీ.. జిల్లా కలెక్టర్ల నుంచి సమాచారం తీసుకుని ప్రభుత్వానికి నివేదించినట్టు తెలుస్తోంది. పలు ఇబ్బందులు కూడా..! పీవోటీ చట్టం ప్రకారం అసైన్డ్ భూమి అన్యాక్రాంతమైతే దానిని ప్రభుత్వం బేషరతుగా స్వాధీనం చేసుకోవచ్చు. అయితే ఇందులో కొన్ని సమస్యలు ఉన్నాయని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. రిజిస్ట్రేషన్ పత్రాలు సహా పక్కా సాక్ష్యాలు లేకుండా ఆ భూములను స్వాధీనం చేసుకోవడం కుదరదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంటే అసైన్ భూమిలో ఎవరున్నా.. ఆ భూమి ఎవరి పేరు మీద రిజిస్టరై ఉంది, ఆ వ్యక్తి అనుభవంలో ఉన్నాడా? అనే దానిపై రెవెన్యూ యంత్రాం గం సాక్ష్యాలను సేకరించాల్సి ఉంటుంది. కానీ అలా చేస్తే జాప్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలోని 77 వేల ఎకరాల్లో పీవోటీ ఉల్లంఘనలు కనిపిస్తుంటే ఇప్పటివరకు 4,135 కేసులు నమోదు చేసి.. 3,705 ఎకరాలను స్వాధీనం చేసుకోగలిగారు. క్రమబద్ధీకరిస్తే భారీగా ఆదాయం ఈ అంశంలో ప్రభుత్వం వద్దకు మరో ప్రతిపాదన వచ్చింది. ఎలాగూ ప్రభుత్వ భూములక్రమబద్ధీకరణ ఎప్పటి నుంచో కొనసాగుతున్నందునా ... అసైన్డ్ భూములనూ క్రమబద్ధీకరించాలని, తద్వారా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందని సూచనలు అందాయి. దీనికి ప్రభుత్వం అంగీకరిస్తే.. పీవోటీ చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది. ఇక క్రమబద్ధీకరిస్తే.. మార్కెట్ విలువలో ఎంత శాతం వరకు రుసుము కింద తీసుకోవాలనే దానిపైనా చర్చలు జరుగుతున్నాయి. అన్యాక్రాంతమైన భూమి ఉన్న ప్రాంతాన్ని బట్టి ఈ రుసుములో మార్పులు చేయాలని... ఎన్నేళ్లుగా ఆ భూమి అనుభవిస్తున్నారు, ఆ భూమిలో ఏం చేస్తున్నారన్న అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని.. భారీ జరిమానాతో క్రమబద్ధీకరించుకునే అవకాశం ఇవ్వవచ్చని రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇంకా తేలలేదు. వేల కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతమైన అసైన్డ్ భూముల విలువ వేల కోట్ల రూపాయలు ఉంటుందని అం చనా. రంగారెడ్డి జిల్లాలో వేల ఎకరాలకుపైగా ఇతరుల చేతుల్లో ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్ నివేది కలో తేలింది. ఈ జిల్లాలో ఇప్పటివరకు 87,064 వేల ఎకరాల మేర అసైన్ చేయగా.. 9,885 ఎకరాల్లో మాత్రమే అసలైన పట్టాదారులు ఉన్నారు. మిగతా 77,179 ఎకరాల్లో పీవోటీ చట్టం ఉల్లంఘనలు ఉన్నట్లు అంచనా. ఇందులో కనీసం 20 వేలకుపైగా ఎకరాల్లో ఇతరులు పాగా వేశారని చెబుతున్నారు. ముఖ్యంగా సరూర్‌నగర్, బాలాపూర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, షాద్‌నగర్, చేవెళ్ల, శంషాబాద్, ఇబ్రహీంపట్నం, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మేడ్చల్ లాంటి డిమాండ్ ఉన్న చోట్ల పెద్ద ఎత్తున ఈ భూములు చేతులు మారినట్టు అధికారులు గుర్తించారు. అన్యాక్రాంతమైన భూములు 98 వేల ఎకరాలు పీవోటీ చట్టం ఉల్లంఘన 77 వేల ఎకరాలు పీవోటీ ఉల్లంఘనులపై నమోదైన కేసులు 4,135 స్వాధీనం చేసుకున్నవి 3,705 ఎకరాలు -
రెవెన్యూలో గాడి తప్పిన పాలన
⇒ భూపరిపాలన ప్రధాన కమిషనర్ పోస్టు ఆర్నెల్లుగా ఖాళీ ⇒ ప్రభుత్వ పథకాల అమలుపై సిబ్బందికి దిశానిర్దేశం కరువు ⇒ ఏళ్లు గడుస్తున్నా ముగియని క్రమబద్ధీకరణ ప్రక్రియ సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ శాఖలో పాలన గాడి తప్పింది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు యంత్రాంగానికి దిశానిర్దేశం చేయాల్సిన పెద్దదిక్కు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. రెవెన్యూ విభాగంలోనే ఎంతో కీలకమైన భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) పోస్టు గత ఆరు నెలలుగా ఖాళీగానే దర్శనమిస్తోంది. ప్రభుత్వం.. గత రెండున్నరేళ్లుగా ఈ పోస్టు భర్తీ పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. దీంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడేనన్న చందంగా తయారైంది. దీంతో రెండేళ్ల కిత్రం ప్రభుత్వం ప్రారంభించిన భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ (జీవో 59) కథ నేటికీ కంచికి చేరలేదు. మరోవైపు లక్షల సంఖ్యలో వచ్చిన సాదా బైనామాల క్రమబద్ధీకరణ దరఖాస్తులకు మోక్షం కలగడం లేదు.కంచికి చేరని క్రమబద్ధీకరణ కథ అన్యాక్రాంతమైన ప్రభుత్వ స్థలాల్లో నివాసముంటున్న వారికి ఆయా భూములను క్రమబద్ధీకరిచేందుకు 2014 డిసెంబరులో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అల్పాదాయ వర్గాలకు 125 గజాలలోపు స్థలాలను ఉచిత కేటగిరీలో, ఉన్నత వర్గాలకు చెల్లింపు కేటగిరీలో ఆయా స్థలాలను క్రమబద్ధీకరించాలని ఉత్తర్వులలో పేర్కొంది. ఈ ప్రక్రియ అంతటినీ మూడు నెలల్లోగా పూర్తి చేయాల్సి ఉండగా, రెండేళ్లు దాటినా చెల్లింపు కేటగిరీ దరఖాస్తులకు పూర్తిగా మోక్షం కలగలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పలుమార్లు గడువును పొడిగించినా, క్రమబద్ధీకరణ ప్రక్రియ కోసం ఏర్పాటు చేసిన ఆన్లైన్ వ్యవస్థ సరిగా పనిచేయక క్షేత్రస్థాయి సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 వేల దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని, పెద్దనోట్ల రద్దు ప్రభావంతో దరఖాస్తు దారులు సకాలంలో సొమ్ము చెల్లించలేకపోయారని పలు జిల్లాల కలెక్టర్లు చెబుతున్నారు. మరో ఆరు నెలల పాటు గడువు పెంచాలని కొందరు జిల్లా కలెక్టర్లు నెలరోజుల క్రితమే ప్రభుత్వానికి లేఖ రాసినా ఉన్నతాధికారుల నుంచి స్పందన లేదు. మరోవైపు తాము పూర్తిస్థాయిలో సొమ్ము చెల్లించినప్పటికీ, తమ స్థలాలను క్రమబద్ధీకరణ చేయకపోవడం పట్ల దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. సాదాబైనామాలకూ కలగని మోక్షం గ్రామీణ ప్రాంతాల్లో పేద రైతులు తెల్లకాగితాలపై రాసుకున్న భూముల క్రయ విక్రయాలను (సాదా బైనామా) కూడా క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం 2016 జూన్‌లో ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 11.16 లక్షల దరఖాస్తులు అందగా.. ఇప్పటివరకు క్రమబద్ధీకరణకు ఆదేశాలిచ్చింది మాత్రం 34 వేల మంది రైతులకే కావడం గమనార్హం. మొత్తం దరఖాస్తుల్లో 2.93 లక్షల దరఖాస్తులను వివిధ కారణాలతో అధికారులు తిరస్కరించినప్పటికీ, ఇంకా ఆరున్నర లక్షలమంది దరఖాస్తు దారులకు సాదా బైనామాలను ప్రభుత్వం ఎప్పుడు క్రమబద్ధీకరిస్తుందో అర్ధంకాని పరిస్థితి నెలకొంది. మరోవైపు హైదరాబాద్, వరంగల్ నగరాల పరిధిలోని కొన్ని మండలాలలో సాదా బైనామాల క్రమబద్ధీకరణను తొలుత నిషేధించిన ప్రభుత్వం, ఆపై నిషేధాన్ని సడలిస్తూ గత డిసెంబరులో జీవో నెంబరు 294 జారీచేసింది. అయితే కొన్ని మండలాల్లో సాదా బైనామాల క్రమబద్ధీకరణపై నిషేధాన్ని ప్రభుత్వం సడలించినా, ఆయా మండలాలలో క్రమబద్ధీకరణకు కొత్తగా దరఖాస్తులను స్వీకరించేందుకు సీసీఎల్ఏ ఆదేశాలు జారీ చేయలేదు. దీంతో దరఖాస్తు చేసుకుందామనుకున్న రైతులు నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. కొత్త జిల్లాల్లో భర్తీ కాని పోస్టులు మరోవైపు కొత్త జిల్లాలతో కొత్తగా 125 మండలాలు, 25 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆయా పోస్టులలో పూర్తిస్థాయి తహసీల్దార్లను, ఆర్డీవోలను నియమించలేదు. మరోవైపు భూమి రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే నిమిత్తం క్షేత్రస్థాయిలో రెవెన్యూ యంత్రాంగం కోసం సీసీఎల్ఏ అధికారులు రూ. 5 కోట్లతో కొనుగోలు చేసిన టాబ్లెట్ పీసీలు, గత రెండు నెలలుగా మూలనపడి పాడవుతున్నాయి. -
సాదాబైనామా ఉంటేనే క్రమబద్ధీకరణ
- దరఖాస్తుల పరిశీలనపై స్పష్టతనిచ్చిన సీసీఎల్ఏ - దరఖాస్తులను 4 కేటగిరీలుగా విభజించాలని ఆదేశాలు - 1,2 కేటగిరీలను వెంటనే పరిశీలించాలని సూచన సాక్షి, హైదరాబాద్: సాదాబైనామా పత్రాలను జతచేసిన దరఖాస్తులను మాత్రమే భూముల క్రమబద్ధీకరణకు పరిగణనలోకి తీసుకోవాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ) రేమండ్ పీటర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. తెల్లకాగితాలపై రాసుకున్న వ్యవసాయ భూముల కొనుగోలు ఒప్పందాలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అధికారుల అంచనాకు మించి 11 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. అయితే సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల్లో కొన్ని అంశాల్లో స్పష్టత లేకపోవడంతో, పత్రాలు లేకుండా భూమి సాగులో ఉన్నవారు, సాదాబైనామా కాకుండా ఇతర డాక్యుమెంట్లు ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఈ తరహా దరఖాస్తులే అధికంగా ఉండడంతో పరిశీలన లో పాటించాల్సిన నిబంధనల విషయంలో తగిన మార్గదర్శకాలు ఇవ్వాలని తహసీల్దార్లు మొరపెట్టుకున్నారు. ఈ మేరకు సీసీఎల్ఏ తాజాగా సర్క్యులర్ జారీచేశారు. సాదాబైనామా క్రమబద్ధీకరణ ప్రక్రియ కేవలం గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు సంబంధించిన అంశం మాత్రమేనని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, ఎంతోమంది పట్టణ ప్రాంతాల్లో సాదాబైనామాతో కొనుగోలు చేసిన ఇళ్లు, స్థలాలు, ప్రభుత్వ సీలింగ్ భూములను క్రమబద్ధీకరించాలని దరఖాస్తు పెట్టుకున్నట్లు అధికారుల ప్రాథమిక పరిశీలనలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో అలాంటి దరఖాస్తులను పూర్తిగా పక్కన పెట్టాలని సీసీఎల్ఏ సూచించారు. వ్యవసాయ భూముల్లోనూ నాలుగు కేటగిరీలు.. పట్టణ ప్రాంతాలు, ఇళ్లు, స్థలాల సంగతి పక్కనపెడితే, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూములకు సంబంధించిన దరఖాస్తుల్లోనూ బోలెడు సమస్యలు ఉత్పన్నమయ్యాయి. సాదాబైనామా అంటే.. తెల్లకాగితం లేదా మరేదైనా కాగితంపై రాసుకున్న రిజిస్ట్రేషన్ కాని పత్రంగా ఉత్తర్వుల్లో పేర్కొనగా, ఎంతోమంది తప్పుగా అర్థం చేసుకున్నారని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. కొంతమంది సాదాబైనామాలు లేకుండా అన్నదమ్ముల మధ్య జరిగిన ఆస్తి పంపకాలు, పెద్దవాళ్లు పిల్లల పేరిట రాసిన వీలునామాలు.. తదితర పత్రాలు సమర్పించినట్లు వారు తెలిపారు. ఈ నేపథ్యంలోనే గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను కూడా నాలుగు కేటగిరీలుగా విభజించాలని రెవెన్యూ అధికారులకు సీసీఎల్ఏ సూచించారు. యూఎల్సీ స్థలాలను స్వాధీనం చేసుకుంటాం: సీసీఎల్ఏ క్రమబద్ధీకరణకు అవకాశం ఇచ్చినా దరఖాస్తు చేసుకోని వారి నుంచి యూఎల్సీ ఖాళీస్థలాలను స్వాధీనం చేసుకుంటామని భూపరిపాలన ప్రధాన కమిషనర్ రేమండ్ పీటర్ పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చినట్లు ఆయన తెలిపారు. యూఎల్సీ ఖాళీస్థలాల క్రమబద్ధీకరణకు ఈ నెల 25తో గడువు ముగిసిందని, ఇకపై గడువు పొడిగించే ప్రసక్తి లేదని చెప్పారు. ఆ నాలుగు.. ►సాదాబైనామా కలిగి ఉండి, రెవెన్యూ రికార్డుల్లో పేరు నమోదైన రైతే ప్రస్తుతం సాగులో ఉండడం. ►సాదాబైనామా ఉన్న రైతు పేరు రెవెన్యూ రికార్డుల్లో నమోదు కాకున్నా, సాగులో ఉన్నట్లు రుజువు ఉండడం. ►సాదాబైనామా లేకుండా రెవెన్యూ రికార్డుల్లో పేరు నమోదైన రైతు సాగులో ఉండడం. ►సాదాబైనామా లేకుండా రెవెన్యూ రికార్డుల్లో పేరు నమోదు కాకుండా సాగులో ఉన్న రైతు. నాలుగు కేటగిరీల్లో దరఖాస్తులను విభజిం చాక, తొలిదశలో 1,2 కేటగిరీలకు సంబంధించి న దరఖాస్తులను వెంటనే పరిశీలన ప్రారంభిం చాలని సీసీఎల్ఏ అధికారులను ఆదేశించారు. మిగిలిన 3,4 కేటగిరీల కిందకు వచ్చే దరఖాస్తుల క్రమబద్ధీకరణ విషయమై త్వరలోనే మరింత స్పష్టత ఇవ్వనున్నట్లు సీసీఎల్ఏ తెలిపారు. -
క్రమబద్ధీకరణ 15 శాతమే!
♦ భూముల క్రమబద్ధీకరణకు ఆన్లైన్ సమస్యలు ♦ దరఖాస్తుల్లో 15 శాతానికి మించని రిజిస్ట్రేషన్లు ♦ కొంచెం నివాసం, మరికొంత వాణిజ్య ప్రాంతంతో సమస్యలు ♦ అధికారుల మధ్య సమన్వయ లోపమే కారణమని ఆరోపణలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. వివిధ దశల్లో ఆన్లైన్ సమస్యలు చుట్టుముడుతుండడంతో క్షేత్రస్థాయిలో సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. ఏడాది క్రితమే సొమ్ము చెల్లించినా భూములను రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ భూముల్లో నివాసాలేర్పరచుకున్న మధ్య, ఉన్నత వర్గాలకు నిర్దేశిత ధర చెల్లిస్తే ఆయా భూములను క్రమబద్ధీక రించాలని ప్రభుత్వం జీవో 59లో పేర్కొన్న సంగతి తెలిసిందే. 2014 డిసెంబర్లో ఈ జీవో జారీ కాగా, రాష్ట్రవ్యాప్తంగా 28,248 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రభుత్వానికి వచ్చిన దరఖాస్తుల్లో ఇప్పటివరకు అధికారులు క్రమబద్ధీకరించినవి 15 శాతం లోపే కావడం గమనార్హం. చెల్లింపు కేటగిరీలో క్రమబద్ధీకరణ నిమిత్తం భూపరిపాలన అధికారులు కొనుగోలు చేసిన సాఫ్ట్‌వేర్‌లో రోజుకోరకమైన సమస్యలు తలెత్తుండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. సాఫ్ట్‌వేర్‌ను అందించిన సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, క్రమబద్ధీకరణ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న అధికారుల మధ్య సమన్వయం కొరవడడంతో అంతా గందరగోళంగా తయారైందని క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది వాపోతున్నారు. కమర్షియల్‌తో కిరికిరి..! ప్రభుత్వ భూముల్లో నివాసాలేర్పరచుకున్న వారికి ఆయా భూములను రెసిడెన్షియల్ కేటగిరీ కింద రిజిస్ట్రేషన్ బేసిక్ వాల్యూలో 25శాతం, వాణిజ్య కేటగిరీలోనైతే పూర్తి సొమ్ము చెల్లిస్తే ఆయా భూములను క్రమబద్ధీకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, నగర, పట్టణ ప్రాంతాల్లో ఎంతోమంది ఆర్థికంగా కలసివస్తుందని తమ ఇంటి ఆవరణల్లోనే గదుల(దుకాణాల)ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సదరు ఇల్లు వాణిజ్య కేటగిరీనా, రెసిడెన్షియల్ కేటగిరీనా అన్న అంశాన్ని అధికారులు తేల్చుకోలేకపోతున్నారు. కొంత ప్రదేశం నివాస ప్రాంతంగానూ, మరికొంత ప్రదేశం వాణిజ్య ప్రాంతంగానూ చూపేందుకు సాఫ్ట్‌వేర్‌లో వెసులుబాటు లేకపోవడంతో పరిస్థితి జఠిలంగా మారింది. ఇటువంటి జాగాలను వాణిజ్య కేటగిరీ కిందనే పరిగణించాలని ఇటీవల సీసీఎల్ఏ స్పష్టం చేయడంతో అంత సొమ్ము తాము చెల్లించలేమంటూ లబ్ధిదారులు చేతులెత్తేస్తున్నారు. కమర్షియల్ కిరికిరి ఇలా ఉంటే.. పూర్తిస్థాయిలో నివాస ప్రాంతాల్లోనూ అధికారుల సమన్వయ లోపం కారణంగా కొన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు జరగడం లేదని అంటున్నారు. అంతేకాక రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా పత్రాల జారీలో పలు సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. రూ.లక్షలు పోసి కొనుగోలు చేస్తున్నా, సరైన విధంగా పత్రాలను ఇవ్వకపోవడం పట్ల లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సబ్ రిజి స్ట్రార్ల పేచీ.. ఇదిలా ఉండగా హైదరాబాద్‌తో పాటు కొన్ని జిల్లాల్లో జీవో 59 ప్రకారం స్టాంప్ డ్యూటీ మినహాయింపుపై జిల్లా కలెక్టర్ల నుంచి తమకు ఎటువంటి సమాచారం లేదంటూ. రిజిస్ట్రేషన్లు చేసేందుకు సబ్ రిజిస్ట్రార్లు ససేమిరా అంటున్నారు. అలాగే క్షేత్రస్థాయిలో సాఫ్ట్వేర్ సమస్యల పరిష్కారం పట్ల సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అధికారులు శ్రద్ధ చూపడం లేదని, ఫిర్యాదు చేసినా భూపరిపాలన అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమబద్ధీకరణ ప్రక్రియంతా ఒక డిప్యూటీ కలెక్టర్ కేంద్రంగానే నడుస్తుండడం, ఆమెకు వాస్తవ పరిస్థితులపై అవగాహన లేకపోవడంవల్లే మొత్తం ప్రక్రియ అస్తవ్యస్తంగా తయారైందని కొందరు ఆర్డీవోలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలాఖరుతో క్రమబద్ధీకరణ ప్రక్రియకు గడువు ముగియనున్నందున ఇప్పటికైనా సీసీఎల్ఏ స్పందించి ఆన్లైన్లో ఏర్పడుతున్న సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని, చిన్నచిన్న దుకాణాలున్న నివాసాలకు కమర్షియల్ కేటగిరీ వర్తింపజేయడంపై పునఃపరిశీలించాలని తహసీల్దార్లు,లబ్ధిదారులు కోరుతున్నారు. -
రిజిస్ట్రేషన్లలో గందరగోళం
సాక్షి, హైదరాబాద్: చెల్లింపు కేటగిరీలో భూముల క్రమబద్ధీకరణ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గందరగోళంగా మారింది. శాఖల మధ్య సమన్వయం కొరవడింది. రిజిస్ట్రేషన్ల నిమిత్తం అవసరమైన కన్వేయన్స్ డీడ్లను మాన్యువల్‌గానే జారీ చేయాలని ప్రభుత్వం గత నెల 27న ఆదేశాలు జారీ చేసినా, భూపరిపాలన విభాగం అధికారులు మాత్రం ససేమిరా అంటున్నారు. తాము కొనుగోలు చేసిన సాఫ్ట్వేర్ ద్వారా ఆన్లైన్లో జారీ అయిన కన్వేయన్స్ డీడ్లనే రిజిస్ట్రేషన్లకు వినియోగించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను, తహసీల్దార్లను సీసీఎల్ఏ తాజాగా ఆదేశించినట్లు తెలిసింది. ఒకే అంశంపై సర్కారు ఒకరకంగా, సీసీఎల్ఏ మరో విధంగా ఆదేశాలివ్వడంతో ఏ ఆదేశాలను అమలు చేయాలో పాలుపోక జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు తల పట్టుకుంటున్నారు. కన్వేయన్స్ డీడ్‌లోని వివరాలను అవసరమైనట్లు మార్పు చేసేందుకు సీసీఎల్ఏ అవకాశం ఇవ్వకపోవడంతో ఆన్లైన్ ప్రక్రియ ద్వారా మరింత జాప్యం జరుగుతోందని వాపోతున్నారు. జీవో 59 కింద కన్వీయన్స్ డీడ్లను రిజిస్ట్రేషన్ చేసే విషయమై తమ శాఖ ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన నిబంధనలు ఏవీ అందలేదని సబ్ రిజిస్ట్రార్లు చెబుతున్నారు. కబ్జా అయిన ప్రభుత్వస్థలాలను తిరిగి స్వాధీనం చేసుకోలేని పరిస్థితుల్లో ఆయా స్థలాలను క్రమబద్ధీకరించాలని 2014 డిసెంబరులోనే సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాదిన్నర కిందే చెల్లింపు కేటగిరీ కింద 50వేల దరఖాస్తులు సర్కారుకు వచ్చినా నేటికీ ఒక్క దరఖాస్తుకు మోక్షం కలిగించలేదంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. -
గడువు పెంచినా స్పందన కరువు
♦ చెల్లింపు కేటగిరీ క్రమబద్ధీకరణలో ♦ మొదలు కాని రిజిస్ట్రేషన్లు సాక్షి, హైదరాబాద్: చెల్లింపు కేటగిరీలో భూముల క్రమబద్ధీకరణకు మే 31 దాకా ప్రభుత్వం గడువు పెంచినా పెద్దగా స్పందన కని పించడంలేదు. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులుగా ఎంపికైనవారికి నిర్దేశిత సొమ్ము చెల్లించాల్సిందిగా రెవెన్యూ అధికారులు నోటీసులిచ్చినా లబ్ధిదారులెవరూ ముందుకు రాని పరిస్థితి. పూర్తిస్థాయిలో సొమ్ము చెల్లించిన వారికి కూడా ఆయా స్థలాలను ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో వాయిదాల పద్ధతిలో సొమ్ము చెల్లించే వారూ వెనుకంజ వేస్తున్నారు. క్రమబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తుల్లో అధిక భాగం వివిధ కారణాలు చూపుతూ అధికారులు పక్కన బెట్టడం కూడా మరో కారణం. వాస్తవానికి చెల్లింపు కేటగిరీలో భూముల క్రమబద్ధీకరణకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 48,915 దరఖాస్తులు అందగా, అం దులో 17,891 దరఖాస్తులనే అధికారులు క్లియర్ చేశారు. చెల్లింపు కేటగిరీలో భూముల క్రమబద్ధీకరణ చేసే విషయమై ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించినప్పటికీ క్షేత్రస్థాయి లో తహసీల్దార్లు, ఆర్డీవోలు రకరకాల సాకులు చూపుతూ ఈ ప్రక్రియను ముందుకు సాగనివ్వడం లేదన్న ఆరోపణలున్నాయి. బేసిక్ వాల్యూ తగ్గించాలని డిమాండ్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో భూముల మార్కెట్ ధర కన్నా సబ్రిజిస్ట్రార్లు చెబుతున్న బేసిక్వాల్యూ ఎక్కువగా ఉందని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇంటి ఆవరణలో బతుకుదెరువు కోసం టీ స్టాల్, చిన్న దుకాణం పెట్టుకున్నా కమర్షియల్ కేటగిరీగా పరిగణిస్తున్నారంటున్నారు. దీనిపై లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లు, సీసీఎల్ఏ కార్యాలయాల్లో అప్పీల్ చేసుకుంటున్నారు. -
మరోసారి గడువు పొడిగింపుపై సందిగ్ధత
భూముల క్రమబద్ధీకరణకు ముగిసిన గడువు సాక్షి, హైదరాబాద్ : భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియకు సోమవారంతో గడువు ముగిసినందున మరోసారి గడువును పొడిగిస్తారా..? లేదా అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. చెల్లింపు కేటగిరీలో క్రమబద్ధీకరణ ఉత్తర్వులు (జీవో 59) జారీచేసి 14 నెలలైనప్పటికీ ఒక్క లబ్ధిదారుడికి కూడా నేటివరకు భూమి రిజిస్ట్రేషన్ జరగలేదు. రాష్ట్రవ్యాప్తంగా అందిన సుమారు 49 వేల దరఖాస్తుల్లో 18 వేల దరఖాస్తులు అర్హమైనవిగా క్రమబద్ధీకరణ కమిటీలు సిఫారసు చేయగా, మిగిలిన 31వేల దరఖాస్తులను పరిష్కరించేందుకు పలు అంశాలపై ఉన్నతాధికారుల నుంచి స్పష్టత(క్లారిఫికేషన్) కోరాయి. గడువులోగా రిజిస్ట్రేషన్లు చేసేందుకు అవకాశం ఇవ్వకపోగా, కోరిన స్పష్టత ఇవ్వడంలోనూ భూపరిపాలన విభాగం వైఫల్యం కనిపిస్తోంది. ఒకేసారి మొత్తం సొమ్ము చెల్లించిన వారి సంగతి అలా ఉంచితే.. వాయిదాల పద్ధతిలో సొమ్ము చెల్లిస్తున్న వారి నుంచి ఇకపై సొమ్ము స్వీకరించాలా, వద్దా అని క్షేత్రస్థాయి అధికారుల నుంచి సందేహం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే.. వివిధ జిల్లాల్లో రెవెన్యూ అధికారులు ఎక్కువశాతం మంది ఇటీవల జరిగిన ఎన్నికల ప్రక్రియల్లో పాల్గొన్న కారణంగా భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయలేకపోయామని, ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు మరో మూడు నెలల గడువు కావాలని, భూపరిపాలన ప్రధాన కమిషనర్ సోమవారం ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిసింది. ఈ విషయమై రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్మీనాను సాక్షి వివరణ కోరగా... ఇప్పటికే పలుమార్లు గడువును పొడిగించామని, ఇకపై పొడిగించే అవకాశం లేనట్లేనని అన్నారు. ఒకవేళ గడువును పొడిగించాల్సిన పరిస్థితి ఉంటే ముఖ్యమంత్రి స్థాయిలోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని రెవెన్యూ సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. -
క్రమబద్ధీకరణ కథ అడ్డం తిరిగింది!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల క్రమబద్ధీకరణ కథ అడ్డం తిరిగింది. ప్రభుత్వ ఉత్తర్వుల అమలుకు అధికారులే మోకాలడ్డుతున్నారు. ఫలితంగా ఖజానాకు భారీగా గండిపడే ప్రమాదమేర్పడింది. చెల్లింపు కేటగిరీలో భూక్రమబద్ధీకరణకు రాష్ట్రవ్యాప్తంగా 48,915 దరఖాస్తులు రాగా, అందులో కేవలం 17,891 దరఖాస్తులకే మోక్షం లభించింది. సుమారు 31 వేల దరఖాస్తులను వివిధ కారణాలను చూపుతూ అధికారులు పక్కన పెట్టారు. వాస్తవానికి కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను వెనక్కి తీసుకునేందుకు వీలుకాని పరిస్థితుల్లో వాటిని క్రమబద్ధీకరించాలని సర్కారు భావించింది. ఈ మేరకు 2014 డిసెంబరులోనే ఉత్తర్వులు (జీవో 58, 59) ఇచ్చింది. వీటి ప్రకారం అల్పాదాయ వర్గాలకు ఉచితంగా, మధ్యతరగతి, ఆపై వర్గాలకు నిర్దేశిత సొమ్ము (బేసిక్ విలువలో 25 శాతం) చెల్లిస్తే.. ఆయా భూములను క్రమబద్ధీకరించాల్సి ఉంది. చెల్లింపు కేటగిరీలో క్రమబద్ధీకరణపై సర్కారు ఉదారంగా వ్యవహరించినప్పటికీ క్షేత్రస్థాయిలో తహశీల్దార్లు, ఆర్డీవోలు రకరకాల సాకులు చూపుతూ ఈ ప్రక్రియను ముందుకు సాగనివ ్వడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సోమవారంతో క్రమబద్ధీకరణకు, లబ్ధిదారు సొమ్ము చెల్లించేందుకు గడువు ముగియనుంది. అధికారులే అడ్డుకుంటున్నారు.. సర్కారు ఉదారంగా ఇచ్చిన ఉత్తర్వులను సరిగా అర్థం చేసుకోలేకపోయిన అధికారులు అధికశాతం దరఖాస్తులను రకరకాల కొర్రీలు పెట్టి పక్కన పడేశారు. దరఖాస్తుదారుకు ఆధార్ కార్డులేదని, ఒకే కుటుంబం నుంచి రెండేసి దరఖాస్తులు వచ్చాయని వేల సంఖ్యలో దరఖాస్తులను పట్టించుకోలేదు. అలాగే, ఏదేని నిర్మాణం ఉన్న ప్రభుత్వ భూమిని తప్పనిసరిగా క్రమబద్ధీకరించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో క్రమబద్ధీకరణ కమిటీలకు చైర్మన్లుగా ఉన్న కొందరు ఆర్డీవోలు ఆ నిబంధనను పెడచెవిన పెట్టారు. నిర్మాణం విస్తీర్ణం కంటే ఖాళీ స్థలం ఎక్కువగా ఉందని, స్పష్టత కోసం ఉన్నతాధికారులకు లేఖలు రాశామని ఆర్డీవోలు చెబుతున్నారు. వీరు రాసిన కొన్ని లేఖలు ఆయా జిల్లాల కలెక ్టరేట్లోనూ, మరికొన్ని సీసీఎల్ఏ కార్యాలయంలోనూ పెండింగ్‌లో ఉన్నాయంటున్నారు. ఉత్తర్వులు వచ్చి ఏడాది దాటాకా ఇప్పుడు క్లారిఫికేషన్ అడగడమేంటని లబ్ధిదారులు వాపోతున్నారు. లబ్ధిదారులకు మేలు జరగడం ఇష్టం లేకే కిందిస్థాయి అధికారులు ఇలా చేస్తున్నారని అంటున్నారు. దీంతో సర్కారు ఆదాయానికి భారీగా గండిపడింది. చెల్లింపు కేటగిరీలో భూక్ర మబద్ధీకరణ ద్వారా రూ.వెయ్యి కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనావేసింది. నిర్దేశించిన సొమ్మంతా ఒకేసారి చెల్లించిన వారికి మొత్తం సొమ్ములో 5 శాతం రాయితీనీ కల్పించింది. ఒకేసారి చెల్లించలేని వర్గాలకు సులభ వాయిదాల్లో చెల్లించే సదుపాయం కల్పించింది. చివరి వాయిదా కట్టాల్సిన వారికి పలుమార్లు గడువునూ పొడిగించింది. చెల్లింపు కేటగిరీలో ఇప్పటివరకు అందిన సొమ్ము రూ. 243.78 కోట్లే కావడం గమనార్హం. ఆర్డీవోలు ఏమంటున్నారంటే.. ధరఖాస్తుల్లో అభ్యంతరకరమైన భూములకు సంబంధించినవి చాలా ఉన్నాయని, ఈ విషయంలో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించమన్నా ఆ తరువాత తమకు చిక్కులు తప్పవని క్రమబద్ధీకరణ కమిటీలకు చైర్మన్లుగా వ్యవహరిస్తున్న ఆర్డీవోలు అంటున్నారు. ఒకే వ్యక్తి పేరిట ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే.. రెండు దరఖాస్తులను ఆమోదించేందుకు సీసీఎల్ఏ రూపొందించిన ఆన్లైన్ వ్యవస్థ అంగీకరించడం లేదంటున్నారు. అలాగే, క్రమబద్ధీకరణకు ఆధార్ నంబరు తప్పనిసరి కాదని ప్రభుత్వం చెబుతున్నా, అది లేనిదే ఆన్లైన్లో దరఖాస్తు రిజిస్టర్ కావడం లేదని చెబుతున్నారు. నిర్మాణ విస్తీర్ణం కన్నా ఖాళీ ప్రదేశం ఎక్కువ ఉన్నా క్రమబద్ధీకరించాల్సిందేనని, అయితే భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయేమోననే సందేహంతోనే ఉన్నతాధికారులకు లేఖలు రాశామంటున్నారు. -
క్రమబద్ధీకరణకూ బయోమెట్రిక్
♦ అధికారుల వేలిముద్రతోనే సవరణలు, రిజిస్ట్రేషన్లకు ఆమోదం ♦ రేపట్నుంచి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో జీవో 59 రిజిస్ట్రేషన్లు ♦ నెలాఖరుకల్లా అన్ని జిల్లాల్లోనూ చెల్లింపు కేటగిరీలో క్రమబద్ధీకరణ ♦ అవకతవక లు జరిగితే తహసీల్దార్లు, ఆర్డీవోలదే బాధ్యత సీసీఎల్ఏ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: చెల్లింపు కేటగిరీలో భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ తుది అంకానికి చేరింది. జీవో 59 కింద దరఖాస్తుదారులు కోరిన భూములను వారి పేరిట రిజిస్ట్రేషన్ చేసేందుకు అవసరమైన కన్వేయన్స్ డీడ్‌ను రెవెన్యూశాఖ ఇప్పటికే ఆమోదించింది. అయితే, క్రమబద్ధీకరణ రిజిస్ట్రేషన్లలో అవకతవకలు జరగకుండా నియంత్రించేందుకు భూపరిపాలన విభాగం (సీసీఎల్ఏ) సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. మొత్తం ప్రక్రియలో ఆయా మండలాల తహసీల్దార్లను, రెవెన్యూ డివిజన్ల అధికారు(ఆర్డీవో)లను జవాబుదారీ చేసే ఉద్దేశంతో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టింది. నిబంధనల ప్రకారం అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వం నిర్దేశించిన సొమ్ము పూర్తిగా చెల్లించినట్లయితే.. ఆయా భూముల రిజిస్ట్రేషన్ నిమిత్తం కన్వేయన్స్ డీడ్ జారీచేయాల్సి ఉంటుంది. అయితే, సదరు మండల తహసీల్దారు తన డిజిటల్ సిగ్నేచర్తోపాటు బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రనూ ఇస్తేనే ఆ డీడ్ జారీ అవుతుంది. అప్పుడే సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది ఆయా భూములను లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్ చేస్తారు. తొలివిడతలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని అన్ని మండల రెవెన్యూ, రెవెన్యూ డివిజన్ కార్యాలయాలకు బయోమెట్రిక్ యంత్రాలను సీసీఎల్ఏ అధికారులు సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వం ఆమోదించిన కన్వేయన్స్ డీడ్ నమూనాను ఆన్లైన్లో పెట్టినందున, మంగళవారం నుంచి క్రమబద్ధీకరణ రిజిస్ట్రేషన్లను ప్రారంభించాలని తహసీల్దార్లు, ఆర్డీవోలకు సీసీఎల్ఏ నుంచి ఆదేశాలందాయి. నెలాఖరుకల్లా అన్ని జిల్లాల్లోనూ చెల్లింపు కేటగిరీలో క్రమబద్ధీకరణ చేపట్టనున్నారు. వీడని సాంకేతిక సమస్యలు ఉన్నతాధికారుల స్థాయిలో ఎప్పటికప్పుడు ఆన్లైన్ విధానాన్ని అప్డేట్ చేస్తుంటే.. క్షేత్రస్థాయిలో ఇందుకు భిన్నంగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. జీవో 59 (చెల్లింపు కేటగిరీ) కింద దరఖాస్తు చేసుకుంటే జీవో 58 నిబంధనలను సాఫ్ట్వేర్ వర్తింపజేస్తోంది. ఎలాగంటే, రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల డివిజన్లోని ఒక మండలంలో జీవో 59 కింద 160 గజాల స్థలాన్ని క్రమబద్ధీకరించాలని ఒక వ్యక్తి దరఖాస్తు చేశాడు. సదరు స్థలాన్ని పరిశీలించిన అధికారులు విస్తీర్ణం 149 గజాలే ఉందని తేల్చారు. 149 గజాలకు ప్రభుత్వం నిర్దేశించిన సొమ్ము చెల్లించాలంటూ అధికారులు నోటీసులు సిద్ధం చేయగా, కేవలం 30 గజాలకు మాత్రమే సొమ్ము చెల్లించాలని అందులో ముద్రితమైంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ సాంకేతిక ఇబ్బందులతో క్షేత్రస్థాయి సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. సదరు నోటీసుల్లోని తప్పులను సరిదిద్దేందుకూ ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని తహసీల్దార్లు కోరుతున్నారు. వేలిముద్ర వేస్తేనే ఆమోదం చెల్లింపు కేటగిరీలో క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తులో పేర్కొన్న వివరాలకు, పరిశీలనలో వెల్లడైన వివరాలకు పొంతన లేకపోవడంతో పలు అంశాలను సవరించాల్సిన అవసరమేర్పడింది. దరఖాస్తుదారు పేరు, చిరునామా, భూమి విస్తీర్ణం, హద్దులు, చెల్లించిన నగదు.. ఇలా పలు వివరాలను సరిదిద్దేందుకు ఒకట్రెండుమార్లు ఉన్నతాధికారులు అవకాశమిచ్చినా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సవరణ ప్రక్రియ పూర్తిగా జరగలేదు. ఎక్కువసార్లు సవరణకు అవకాశమిస్తే అవకతవకలు జరుగుతాయని భావించిన సీసీఎల్ఏ.. కొద్దిరోజులుగా వెబ్‌సైట్‌ను కూడా నిలుపుదల చేసింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా అధికారుల నుంచి విజ్ఞాపనలు వెల్లువెత్తడంతో తాజాగా సవరణలకు అవకాశ మివ్వాలని నిర్ణయించింది. బయోమెట్రిక్ ద్వారా వేలిముద్ర వేస్తేనే సదరు సవరణలకు ఆమోదం పొందేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. -
పరిశీలన షురూ చేయండి
- క్రమబద్ధీకరణపై రెవెన్యూ అధికారులతో కలెక్టర్ - అభ్యంతరాలుంటే ప్రత్యేకంగా పేర్కొనాలని ఆదేశం సాక్షి, రంగారెడ్డి జిల్లా : భూముల క్రమబద్ధీకరణలో భాగంగా జీఓ 59 కేట గిరీలో వచ్చిన దరఖాస్తుల పరిశీల నను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ రఘునందన్‌రావు రెవెన్యూ అధికారులను ఆదేశించారు. జీఓ 59, పట్టాల పంపిణీపై గురువారం కలెక్టరేట్లో ఆర్డీఓలు, పట్టణ ప్రాంత తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. జీఓ 59 కేటగిరీలో 11,744 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ వివరించారు. వీటికి సంబంధించి రూ. 68.92 కోట్లు ప్రభుత్వానికి డీడీల రూపంలో జమైనట్టు చెప్పారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పరి శీలన చేపట్టాలని, అభ్యంతరాలుంటే ప్రత్యేకంగా నమోదు చేయాలని, చెక్లిస్టులను తహసీల్దార్లందరికీ అందించినట్లు చెప్పారు. జీఓ 58కి సంబంధించి పట్టా సర్టిఫికెట్లపై సమీక్షిస్తూ.. ఇప్పటివరకు సర్టిఫికెట్ల పంపి ణీ పూర్తికాని మండలాల తహసీల్దార్లు కారణా లు పేర్కొంటూ నివేదికలివ్వాలన్నార ు. సమావేశంలో జేసీ రజత్‌కుమార్ సైనీ, డీఆ ర్వో ధర్నారెడ్డి, ఆర్డీఓలు సు రేష్, ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
సర్కారీ జాగా.. అక్రమార్కుల పాగా!
వివిధ సంస్థలకు కట్టబెట్టిన సర్కారీ స్థలాల్లో వెలసిన కట్టడాల క్రమబద్ధీకరణపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. పారిశ్రామిక, అటవీ, విద్యా, నీటిపారుదల తదితర శాఖలకు బదలాయించిన స్థలాల్లో చాలాచోట్ల నిర్మాణాలు పుట్టుకొచ్చాయి. ఈ ఆక్రమణదారులంతా జీఓ 58 కింద తమ నిర్మాణాలను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. వీలున్నంత వరకు స్థలాల క్రమబద్ధీకరణపై ఉదారంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు స్పష్టం చేయడంతో.. చెరువులు, శ్మశానవాటిక, లేఅవుట్లలో ఖాళీ స్థలాలు, శిఖం భూములను కూడా రెగ్యులరైజ్చేసే కోణంలో రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. ⇒ టీఐఐసీ, అటవీ స్థలాల క్రమబద్ధీకరణ ⇒ జంట జిల్లాల్లో 13 వేల దరఖాస్తుల పరిశీలన ⇒ ఆమోదానికి అత్యున్నతస్థాయి కమిటీ ⇒ శిఖం భూములపై ఆచీతూచీ అడుగు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: భూముల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం మరింత పట్టువిడుపుగా వ్యవహరించనుంది. వివిధ సంస్థలకు బదలాయించిన స్థలాల్లో వెలిసిన నిర్మాణాలను కూడా ఆయా శాఖల సమ్మతితో క్రమబద్ధీకరించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలి స్తోంది. ఫలితంగా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో 13,417 దరఖాస్తులకు మోక్షం కలిగించే అంశంపై భూపరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నేతృత్వంలోని కమిటీ కుస్తీ పడుతోంది. ఇందులో రంగారెడ్డి జిల్లా పరిధిలో 6,692 దరఖాస్తులు, హైదరాబాద్ జిల్లా పరిధిలో 6,725 దరఖాస్తులు ఉన్నాయి. పారిశ్రామిక, ప్రజావసరాల కోసం ఆయా శాఖలకు ప్రభుత్వం స్థలాలను కేటాయియించింది. ఈ స్థలాల వినియోగంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, కొన్నిచోట్ల అవసరానికి మించి స్థలం కట్టబెట్టడంతో ఆ జాగాలను పరిరక్షించడంలో ఆయా శాఖలు చేతులెత్తేశాయి. ఫలితంగా ఈ స్థలాలు కాస్తా బస్తీలుగా అవతరించాయి. ఈ బస్తీదారులంతా ఇప్పుడు ఉచితకేటగిరీ (58 జీఓ) కింద తమ ఇళ్లను ఉచితంగా క్రమబద్ధీకరించాలని ప్రభుతానికి అర్జీలు పెట్టుకున్నారు. ఉదాహరణకు.. బాలానగర్ మండలం అల్లావుద్దీన్ కుట్టి కాలనీ స్థలాన్ని గతంలో టీఐఐసీకి బదలాయించారు. దశాబ్ధాల క్రితమే పారిశ్రామిక అవసరాల కోసం ఈ భూమని టీఐఐసీకి కేటాయించారు. అయితే, ఈ స్థలసేకరణలో ఆ సంస్థ నిర్లిప్తంగా వ్యవహరించింది. దీనికితోడు అప్పటికే ఆ ప్రాంతంలో కాలనీ ఉండడంతో వారిని ఖాళీ చేయించే సాహసం చే యలేకపోయింది. ఈ క్రమంలోనే అల్లావుద్దీన్ కుట్టీలో నివసిస్తున్న 355 మంది తమ ఇళ్లను రెగ్యులరైజ్ చేయమని రెవెన్యూ యంత్రాంగానికి దరఖాస్తు చేసుకున్నారు. ఎలాగూ ఈ స్థలాన్ని వెనక్కి తీసుకోవడం సాధ్యంకాదు కనుక.. టీఐఐసీ సమ్మతితో ఈ స్థలాలను క్రమబద్ధీకరించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇలా ప్రతి శాఖ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని స్థలాల క్రమబద్ధీకరణకు ముందడుగు వేయాలని భావిస్తోంది. శిఖం స్థలాలకు వెనుకడుగు! శిఖం భూముల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం వెనుకడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ స్థలాల క్రమబద్ధీకరణ జోలికి వెళితే న్యాయపరమైన చిక్కులు తప్పవని స్పష్టం కావడంతో పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఒకప్పుడు ఉన్న చెరువులు నగరీకరణ నేపథ్యంలో కనుమరుగు కావడాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. వరదనీటి ప్రవాహం, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని శిఖం/ఎఫ్టీఎల్లో వెలిసిన నిర్మాణాలపై నిర్ణయం తీసుకోవాలని భావించింది. ఇందులోభాగంగా జిల్లాలో దాదాపు 8,887 దరఖాస్తులకు మోక్షం కలిగించే దిశగా ఆలోచించింది. శిఖం భూములపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, పలు సందర్భాల్లో న్యాయస్థానాలు స్పష్టం చేసిన అభిప్రాయాలను గమనంలోకి తీసుకున్న సర్కారు.. వీటిని పక్కనపెట్టడమే మేలనే అభిప్రాయానికి వచ్చినట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది. -
పట్టాల పంపిణీ ఇప్పట్లో లేనట్టే!
కంచికి చేరని క్రమబద్ధీకరణ కథ ⇒ అభ్యంతర భూములపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం ⇒ చేతులెత్తేసిన రెవెన్యూ యంత్రాంగం ⇒ నైరాశ్యంలో లక్షలమంది దరఖాస్తుదారులు ⇒ జూన్ 2న పట్టాలు పంపిణీ చేయాలని యోచన? సాక్షి, హైదరాబాద్: భూముల క్రమబద్ధీకరణ కథ ఇప్పట్లో కంచికి చేరేలా కనిపించడం లేదు. ప్రభుత్వానికి అందిన 3.66 లక్షల దరఖాస్తుల్లో అభ్యంతర కరమైన భూములకు చెందినవే అధికంగా ఉండడం ఈ ప్రక్రియకు ప్రధాన ఆటంకంగా మారింది. నిరభ్యంతరకరమైన భూములనే క్రమబద్ధీకరిస్తామని ఉత్తర్వుల్లో స్పష్టం చేసిన ప్రభుత్వం.. ఇప్పటి కిప్పుడు అభ్యంతరకరమైన భూములను కూడా నిరభ్యంతరకర కేటగిరీకి మార్చాలని రెవెన్యూ అధికారులపై ఒత్తిడి పెంచినట్లు సమాచారం. అయితే.. దీనికి అనుగుణంగా ప్రభుత్వం నుం చి ఎటువంటి ఉత్తర్వులు రాకపోవడంతో.. తామేమీ చేయలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారు. పాలకులు, అధికారుల మధ్య జరుగుతున్న ప్రచ్ఛ న్నపోరుతో క్రమబద్ధీకరణ ప్రక్రియ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. పోనీ.. అభ్యంతరం లేని భూములకు చెందిన పేదలకైనా పట్టాలు ఎప్పుడు పంపిణీ చేస్తారనేది ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టం చేయట్లేదు. ముందుగా పట్టాల పంపిణీ జగ్జీవన్‌రామ్ జయంతి రోజున చేస్తారని, ఆ తర్వాత బీఆర్ అంబేద్కర్ జయంతి రోజున చేస్తారని ప్రకటనలు వెలువడినా, చివరికి అవన్నీ వట్టిదేనని తేలింది. దీంతో క్రమబద్ధీకరణ పక్రియ ద్వారా లక్షలాది మంది పేదలకు పట్టాలు పంపిణీ చేసి, ప్రజల మెప్పు పొందాలనుకున్న ప్రభుత్వ పెద్దల ఆశలకు గండిపడింది. ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రకారం ఈ నెలాఖరు కల్లా భూముల క్రమబద్ధీకరణ తంతు సంపూర్ణంగా ముగియాల్సి ఉంది. అయితే.. ఉచిత క్రమబద్ధీకరణ ఇంకా కొలిక్కి రాకపోవడం, చెల్లింపు కేటగిరీ దరఖాస్తుల పరిశీలన ఇంకా ప్రారంభం కాకపోవడం గమనార్హం. అభ్యంతరకరమైనవే అధికం.. క్రమబద్ధీకరణ ప్రక్రియకు రాష్ట్రవ్యాప్తంగా 3,66,150 దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. వీటిలో ఉచిత కేటగిరీ కింద 3,36,869 దరఖాస్తులు రాగా, చెల్లింపు కేటగిరీలో కేవలం 29,281 దరఖాస్తులే వచ్చాయి. క్రమబద్ధీకరణ ప్రక్రియలో ముందుగా ఉచిత కేటగిరీలో దరఖాస్తులను పరిశీలించి మార్చి నుంచే పట్టాలను పంపిణీ చేయాలని సర్కారు సంకల్పించింది. అయితే.. క్రమబద్దీకరణకు వచ్చిన దరఖాస్తుల్లో కనీసం 30 శాతం మందికైనా పట్టాలను ఇవ్వలేని పరిస్థితులు ఎదురు కావడం సర్కారును సైతం షాక్‌కు గురిచేసింది. మొత్తం దరఖాస్తుల్లో అభ్యంతరం లేని భూములకు చెందినవి కేవలం 95,034 మాత్రమే ఉన్నాయని అధికారులు తేల్చారు. అభ్యంతరకర భూములకు చెందిన దరఖాస్తుల్లో అధికంగా కేంద్ర ప్రభుత్వ, రైల్వే మిలటరీ.. తదితర సంస్థల భూములకు చెందినవి 93,770 దరఖాస్తులు ఉన్నట్లు నిర్ధారించారు. అభ్యంతరాలన్నీ తొలగే వరకూ నిరీక్షణే... అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే.. ఇప్పటికే పట్టా ఉన్నవి, మున్సిపల్ భూములు, దేవాలయ/దర్గా భూములు, మురుగు కాలువలు, రహదారుల వెంబడి, శ్మశానవాటికల, శిఖం భూములు, కోర్టు కేసుల్లో ఉన్నవి, హౌసింగ్‌బోర్డు, జీపీడబ్ల్యూడీ, నిజాం నవాబువి, నాన్ ఐఎస్ఎఫ్, విద్యాశాఖ, దేవాదాయశాఖ.. తదితర 21 రకాల అభ్యంతరకరమైన భూములకు చెందిన దరఖాస్తులు సుమారు లక్ష వరకు ఉన్నట్లు తెలిసింది. రాష్ట్ర పరిధిలోని అభ్యంతరకర భూముల్లోని ఆక్రమణలను క్రమబద్ధీకరించాలన్నా.. ప్రభుత్వం వేరుగా ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. ఇప్పటికే క్రమబద్ధీకరణ అంశంపై హైకోర్టులో కేసు నడుస్తున్నందున ప్రభుత్వం మరోసారి మార్గదర్శకాలను సవరిస్తూ వేరొక ఉత్తర్వులు ఇచ్చే అవకాశం లేకపోయిందని రెవెన్యూ వర్గాలంటున్నాయి. అభ్యంతరాలన్నీ తొలగిపోతే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న పట్టాలను పంపిణీ చేయాలని సర్కారు యోచిస్తున్నట్లు తెలిసింది. అందాక లక్షలాది మంది దరఖాస్తుదారులకు నిరీక్షణ తప్పదేమో మరి. -
సగానికిమోక్షం లేనట్లే!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తుల్లో సగానికి కూడా మోక్షం కలిగే అవకాశం కనిపించడంలేదు. జీఓ 58 కేటగిరీ కింద జిల్లావ్యాప్తంగా వచ్చిన 1,52,249 దరఖాస్తులను పరిశీ లించిన రెవెన్యూ యంత్రాంగం.. ప్రాథమిక స్థాయిలోనే 56,449 అర్జీలను పక్కనపెట్టగా, తాజాగా మరో 11,194 దరఖాస్తులను అనర్హమైనవిగా తేల్చింది. దీన్నిబట్టి చూస్తే సగం దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 125 గజాల ప్రభుత్వ ఆక్రమిత స్థలాల్లో నివసిస్తున్న పేదల ఇళ్లను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం భావించింది. అయితే, వీటిలో చాలావరకు నిబంధనలకు అనుగుణంగాలేవని పరిశీలన దశలోనే గుర్తించింది. శిఖం, నాలా, కోర్టు కేసులు, భూదాన్, వక్ఫ్, దేవాదాయ భూముల్లో వెలిసిన నిర్మాణాలను క్రమబద్ధీకరించకూడదనే నియమావళిని పరిగణనలోకి తీసుకున్న రెవెన్యూ అధికారులు 56వేల దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టి.. అభ్యంతరంలేని మిగతా దరఖాస్తులను వడపోశారు. ఈ మేరకు 61 ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను నిర్వహిస్తున్నారు. దీంతో ఇప్పటివరకు 37,127 దరఖాస్తులను పరిశీలించిన యంత్రాంగం.. దీంట్లో 25,933 సవ్యంగా ఉన్నట్లు తేల్చింది. సగటున 52.74 శాతం పరిశీలన క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిశీలన విచారణను తలపిస్తుందని, ఈ ప్రక్రియ తలనొప్పిగా మారిందని రెవెన్యూ టీంలు వాపోతున్నాయి. అంతేకాకుండా ఈనెల 20లోపు పరిశీలన పర్వాన్ని పూర్తిచేయాలని, ఆ తర్వాత ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేయడం కూడా అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో ప్రతి టీం దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయాలని రాష్ట్ర సర్కారు ఆదేశించింది. అర్హుల జాబితా రూపకల్పనకు సంబంధించిన చెక్ మెమో చాంతాడంతా ఉండడంతో బృందాలపై పనిభారం పెరిగింది. గతంతో పోలిస్తే అర్జీల పరిశీలన ప్రక్రియను చకచకా పూర్తి చేస్తున్నప్పటికీ, మూడో వంతు కూడా కొలిక్కిరాకపోవడం అధికారులను కలవరపరుస్తోంది. కాగా, ప్రతి బృందం రోజుకు సగటున 52.74 శాత ం దరఖాస్తులను పరిశీలిస్తున్నట్లు లెక్క తేల్చారు. దరఖాస్తుల వడపోతలో వెనుకబడిన మేడ్చల్, బాలానగర్, శంషాబాద్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి మండలాల అధికారులను కూడా స్పీడ్ పెంచమని ఆదేశించారు.