
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయంలో నష్టాలతో ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల కలెక్టర్ల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 27 జిల్లాల్లోని 457 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రభుత్వం తెలిపింది. ఒక్కో కుటుంబానికి రూ.6 లక్షల చొప్పున మొత్తం రూ.27.42 కోట్లను విడుదల చేసింది.
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందజేసేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ(రిలీఫ్) కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 80 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో 47, సిద్దిపేట జిల్లాలో 45 మంది రైతులు బలన్మరణానికి పాల్పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment