ఎమ్మెల్సీ అభ్యర్థి ఖరారు | state techers association elected for candidate for MLC election | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ అభ్యర్థి ఖరారు

Published Thu, Oct 27 2016 3:19 AM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM

state techers association elected for candidate for MLC election

సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి త్వరలో రానున్న ఎన్నికల్లో తమ సంఘాల తరపున ఏవీఎన్ రెడ్డిని నిలబెడుతున్నట్లు ఎస్టీయూ, టీఎస్‌టీయూ ప్రకటించాయి. తమతోపాటు టీజీసీటీ ఏ కూడా మద్దతు ప్రకటించిందని వెల్లడించాయి. బుధవారం హైదరాబాద్‌లోని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) భవన్‌లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై సమావేశం జరిగింది.

ఉపాధ్యాయ, ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా ఏవీఎన్‌రెడ్డిని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబెడుతునట్లు ఎస్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భుజంగరావు, సందానందగౌడ్, టీఎస్‌టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కిష్టయ్య, అబ్దుల్లా ప్రకటించారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) కూడా తమ అభ్యర్థిని ప్రకటించింది. ఉపాధ్యాయునిగా ఉన్న భూపతిరెడ్డిని టీపీయూఎస్ అభ్యర్థిగా నిలబెడుతున్నట్లు టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సాయిరెడ్డి, వెంకటరావు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement