రంగారెడ్డి (పూడూరు) : రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం మన్నెగూడలోని కేశవరెడ్డి పాఠశాలలో చదువుతున్న నవీన్(14) అనే విద్యార్థి అనుమానాస్పదస్థితిలో శనివారం రాత్రి మృతిచెందాడు. స్కూల్లో అపస్మారకస్థితిలో పడి ఉండటంతో నవీన్‌ను స్కూల్ యాజమాన్యం హైదరాబాద్‌లోని నీస్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తరలించే సమయంలో స్కూల్ యాజమాన్యం కనీసం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేదని, నవీన్ చనిపోయిన తర్వాత మార్చురీకి తరలించే సమయంలో సమాచారం ఇచ్చారని కుటుంబీకులు చెబుతున్నారు.
నవీన్‌ను టీచర్లు కొట్టడం వల్లే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం నవీన్ మృతదేహం వికారాబాద్ ప్రభుత్వాసుపత్రిలో ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అనుమానాస్పదస్థితిలో విద్యార్థి మృతి
Published Sun, Sep 6 2015 8:09 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
Advertisement
Advertisement