సీతా ఫలాల కోసమని వెళ్లిన ముగ్గురు విద్యార్థులను చెరువు మింగేసింది. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈఘటన వివరాల్లోకి వెళితే.. నవీపేట మండలం అబ్బాపూర్(బి) గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు చెరువులోకి దిగి మృత్యువాతపడ్డారు. గ్రామానికి చెందిన ఈర్నాల మధుకృష్ణ(14), గంధం సతీష్(15), గంధం అశోక్(15) గ్రామ శివారులోని గుట్టకు సీతాఫలాల కోసం శుక్రవారం సాయంత్రం వెళ్లారు.
అయితే గ్రామ శివారులోని రుద్రం చెరువు ఒడ్డున విద్యార్థుల దుస్తులను అటుగా వెళ్లిన వారు గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు గ్రామానికి చేరుకుని చెరువులో గాలింపు చేపట్టగా రాత్రి అశోక్ మృతదేహం దొరికింది. చీకటి కావడంతో గాలింపు నిలిపేశారు. శనివారం ఉదయం మిగతా వారి మృతదేహాలను వెలికి తీశారు.