కల్తీ కల్లుకు బానిసైన మరో వ్యక్తి అది దొరక్క ప్రాణాలు కోల్పోయాడు. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మండలం కల్యాణి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బండారి పర్వయ్య (46) కల్తీ కల్లుకు బానిసయ్యాడు. అయితే, కొన్ని రోజులుగా కల్తీ కల్లు ఈ ప్రాంతంలో లభించకపోవడంతో పర్వయ్య రెండు రోజులుగా పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ బుధవారం ఉదయం మృతి చెందాడు. ఈ ప్రాంతంలో కల్తీ కల్లు మరణం నమోదు కావడం ఇదే ప్రథమం.
కల్తీ కల్లు లేక వ్యక్తి మృతి
Published Wed, Sep 23 2015 12:58 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement