ముఖ్యమంత్రి... ఆత్మహత్యలే శరణ్యం!
హైదరాబాద్: జేఎన్టీయూ హైదరాబాద్ పై ఎలాంటి న్యాయపోరాటానికైనా సిద్ధమని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజిల యాజమాన్యం హెచ్చరించింది. 174 కాలేజి యాజమాన్యాల గొడును ముఖ్యమంత్రి కేసీఆర్ వినాలని ఓ ప్రకటనలో తెలిపారు. జేఎన్టీయూ అధికారులు ప్రభుత్వానికి తప్పుడు సమాచారమిచ్చారని ప్రైవేట్ కాలేజి యాజమాన్యాలు ఆరోపించాయి.
తప్పుడు సమాచారంతో ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించి.. కాలేజి అనుమతులను రద్దు చేశారని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేశాయి. సరైన సమాచారాన్ని సేకరించి.. రెండవ ఫేజ్ లో తమ కాలేజిలకు అనుమతులు ఇవ్వకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని ప్రైవేట్ కాలేజి యాజమాన్యాలు వెల్లడించాయి.