సిరిసిల్ల: పవర్‌లూమ్ కార్మికులకు ఉపాధి కల్పిం చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లను రాజన్న సిరిసిల్ల నేతన్నలకు ఇచ్చింది. కానీ కొందరు దీనిని గాడి తప్పిస్తున్నారు. గుజ రాత్‌లోని సూరత్ నుంచి బతుకమ్మ చీరల వస్త్రా న్ని ఉత్పత్తి చేసే బీములను సిరిసిల్లకు దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో వార్పిన్ కార్మికుల ఉపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తమవుతోంది. సూరత్ నుంచి సిరిసిల్లకు ఆదివారం 50 బీములు వ్యాన్‌లో వచ్చాయి.
ఐదుగురు వస్త్రోత్పత్తిదారులు 10 చొప్పున జరీ అంచు చీరల బీములను దిగుమతి చేసుకున్నారు. దీనిపై వార్పిన్ కార్మికులు ఆందో ళన వ్యక్తంచేస్తున్నారు. తమ కూలీ పెంచాలని ఇటీవల వార్పిన్ కార్మికు లు సమ్మెకు దిగారు. అధికారుల హామీతో సమ్మె ను తాత్కాలికంగా విరమించారు. కార్మికుల సమ్మె సమస్యను అధిగమించేందుకు సూరత్ నుంచి బీములు తెప్పించామని వస్త్రోత్పత్తిదారు లు చెబుతున్నారు.
సిరిసిల్లకు చెందిన ఓ రాజకీ య నేత ఈ విషయంలో కీలకంగా వ్యవహరిస్తు న్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. దీనిపై జౌళి శాఖ ఏడీ అశోక్‌రావును వివరణ కోరగా.. సూర త్ నుంచి బీములు వచ్చిన విషయం తన దృష్టికి వచ్చిందని, దీనిపై జౌళి శాఖ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చానని వారినుంచి వచ్చే ఆదేశం మేరకు ముందుకు వెళ్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment