Batukamma sarees
-
30 రంగులు.. 240 డిజైన్లు.. కోటీ 18 లక్షల బతుకమ్మ చీరలు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు పంపిణీ చేసేందుకు కోటికి పైగా చీరలు సిద్ధమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ కోసం తెలంగాణ అవతరణ తర్వాత ప్రభుత్వమే మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా బతుకమ్మ చీరలను తీరొక్క రంగుల్లో సిద్ధం చేసి ఉంచినట్లు రాష్ట్ర చేనేత శాఖ తెలిపింది. సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల్ తదితర ప్రాంతాల్లో నేతన్నలతో నేయించిన చీరలను రాష్ట్రంలోని 33 జిల్లాల్లో మహిళలకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది. కాగా, చీరల కోసం ఈ ఏడాది రూ.340 కోట్లను వెచ్చించినట్లు తెలంగాణ హ్యాండ్లూమ్ శాఖ తెలిపింది. 30 రంగుల్లో, 240 పైచిలుకు వెరైటీ డిజైన్లతో పాటు 800 కలర్ కాంబినేషన్లతో తయారు చేయించి పంపిణీకి సిద్ధం చేసినట్లు పేర్కొంది. ఈ సంవత్సరం బతుకమ్మ చీరలు వెండి, బంగారు, జరీ అంచులతో చేయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ఒక కోటీ 18 లక్షల చీరలను పంపిణీ చేసేందుకు టెస్కో, తెలంగాణ హ్యాండ్లూమ్స్ శాఖ సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించాయి. ఇదీ చదవండి: దేశానికి కేసీఆర్ అనుభవం అవసరం.. ఉద్యమ నేతకే నా సపోర్ట్: మాజీ సీఎం కుమారస్వామి -
బతుకమ్మ చీరెల పంపిణీ, డీజైన్లను ప్రారంభించిన కేటీఆర్
-
‘ఓర్వలేకే ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు’
సాక్షి, సిద్ధిపేట: ఆర్థికమాంద్యం, బడ్జెట్ లోటు ఉన్నా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడా బెదరకుండా సంక్షేమాన్ని కొనసాగిస్తుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావు పేర్కొన్నారు. సోమవారం గజ్వేల్ ప్టటణంలో ఆడపడుచులకు హరీశ్ రావు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ రోజా శర్మ, జేసీ పద్మాకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. జిల్లాలోని 3,65,225 మంది ఆడపడుచులకు బతుకమ్మచీరల పంపిచేస్తున్నామన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఇంటింటికి వెళ్లి అర్హులైన వారికి చీరలు పంపిణీ చేయాలని ఆయన సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. గ్రామాలలో మంచినీళ్లకు ఇబ్బందులు లేకుండా మిషన్ భగీరథతో ఆడపడుచుల కనీళ్లు తుడిచిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికి కేసీఆర్ కిట్, కళ్యాల లక్ష్మి, ఆసరా పెన్షన్లకు ఎలాంటి ఆటంకం లేకుండా అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చేసి కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఓర్వలేక పోతున్నారని.. అందుకే ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని హరీష్ రావు మండి పడ్డారు. -
తీరొక్క కోక.. అందుకోండిక!
సాక్షి, హైదరాబాద్: తీరొక్క పూలతో బతుకమ్మలు.. తీరొక్క వన్నెలతో బతుకమ్మ చీరలు.. ఇక తెలంగాణ పల్లెలు కళకళలాడనున్నాయి. వందరకాల చీరల అందం.. ఆడపడుచుల కళ్లలో ఆనందం.. బతుకమ్మ చీరల పంపిణీ సోమవారం నుంచి షురూ కానుంది. ఈ మేరకు పరిశ్రమలు, ఐటీమంత్రి కె.తారకరామారావు నల్లగొండ జిల్లాకేంద్రంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. హుజూర్నగర్ ఉపఎన్నిక మూలంగా సూర్యాపేట జిల్లాలో ఎన్నికలకోడ్ అమల్లో ఉంది. ఫలితం వెల్లడైన తర్వాతే ఆ జిల్లాలో చీరలు పంపిణీ చేస్తారు. నియోజకవర్గాల పరిధిలో జరిగే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ ఏడాది 1.02 కోట్ల చీరలు పంపిణీ చేయాలనేది లక్ష్యం. ఇప్పటికే 75 లక్షల చీరలను జిల్లాలవారీ కోటాకు అనుగుణంగా సరఫరా చేశారు. 670 లక్షల మీటర్ల వస్త్రోత్పత్తి బతుకమ్మ చీరల తయారీలో భాగంగా 670 లక్షల మీటర్ల వస్త్రోత్పత్తి జరగాల్సి ఉండగా. ఈ నెల 30వ తేదీ నాటికి లక్ష్యాన్ని చేరుకునేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. చీరల నేత ద్వారా సిరిసిల్లలోని 26 వేల మరమగ్గాలపై ఆధారపడిన 16 వేల మంది కార్మికులకు లబ్ధి చేకూరుతోంది. ఈ ఏడాది బతుకమ్మ చీరల తయారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.313 కోట్లు కేటాయించింది. వంద రంగులు.. నిఫ్ట్ డిజైన్లు బతుకమ్మ చీరల రూపకల్పనలో చేనేత విభాగం ప్రత్యేక శ్రద్ధ చూపింది. నిఫ్ట్‌కు చెందిన నిపుణులు విభిన్న రంగుల్లో వంద రకాలైన జరీ అంచు చీరలను డిజైన్ చేశారు. యువతులు, మధ్యవయస్కుల కోసం ఆరు గజాలు, ఉత్తర తెలంగాణలో వృద్ధ మహిళలు ధరించే చీరలను తొమ్మిది గజాల పొడవు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. వార్డుస్థాయిలో బిల్ కలెక్టర్, వార్డు మహిళాసంఘం ప్రతినిధి, రేషన్ డీలర్ సభ్యులుగా ఉండి చీరలను అందజేస్తారు. 2017లో ప్రారంభమైన బతుకమ్మ చీరల పంపిణీలో భాగంగా గత రెండేళ్లలో 1.90 కోట్ల చీరలను పంపిణీ చేయగా ఇప్పటివరకు రూ.715 కోట్లు వెచ్చించారు. -
బతుకమ్మ చీరలొచ్చాయ్ !
సాక్షి, మహబూబ్‌నగర్: ఆడపడుచుల ఇష్టమైన పండుగ బతుకమ్మకు ముఖ్యమంత్రి కేసీఆర్ కానుకగా అందించే చీరలు జిల్లాకు చెరుకున్నాయి. తెల్లరేషన్‌కార్డు ఉండి 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు సీఎం బతుకమ్మ చీరను ప్రతియేటా అందిస్తున్నారు. జిల్లాలోని జిల్లాలో 2,98,134 మంది మహిళలకు బతుకమ్మ చీరలు అందించనున్నారు. ఇప్పటికే జిల్లాకు 1.28 వేల చీరలు చేరాయి. వీటిని అధికారులు జిల్లాలోని వివిధ గోదాంలో భద్రపరిచారు. మిగతావి వారం రోజుల్లో తీసుకరావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 28 నుంచి బతుకమ్మ వేడుకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వారం రోజుల ముందే చీరల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొనసాగుతున్న ఆనవాయితీ.. రాష్ట్ర ఆవిర్భావం నుంచి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టి ప్రతి ఏటా పంపిణీ కొనసాగిస్తున్నారు. అలాగే మైనారిటీలకు వారి పండగల సందర్భంగా గిఫ్ట్ ప్యాక్‌లు అందించింది. అప్పటి ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారకరామారావు 1983లో అధికారంలోకి వచ్చిన తర్వాత దారిద్య్రరేఖకు దిగువన జీవస్తున్న పేద వర్గాల కోసం జనతావస్త్రాల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టి అందరి అభిమానాన్ని చూరగొన్నారు. అప్పట్లో తెల్లరేషన్‌కార్డు ఉన్న పేదవారికి రూ. 22లకు చీర, రూ.18లకు పంచెలను పంపిణీ చేశారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా 18 సంవత్సరాల పైబడిన పేద మహిళందరికీ బతుకమ్మ పండుగను పురష్కరించుకొని ఉచితంగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతుంది. ఈ దఫా జిల్లాలో 2,88,134 మందికి చీరలను పంపిణీచేయడానికి ఎంపిక చేశారు. సివిల్‌సప్లయ్ శాఖలో రేషన్‌కార్డుల ద్వారా నమోదైన లబ్ధిదారుల సంఖ్యను పరిగణలోకి తీసుకొని అర్హులను గుర్తించారు. అయితే క్షేత్రస్థాయిలో ఇంకా ఎవరైనా నమోదు చేసుకోని అర్హులైన వారుంటే వారికి సైతం చీరలు అందించేందుకు కసరత్తు పూర్తి చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఒక చీర 5.5 మీటర్లు, జాకెట్ 80 సెంటీమీటర్ల చొప్పున చీరలు తయారుచేశారు. సెప్టెంబర్ 28 నుంచి బతుకమ్మ వేడుకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వారం రోజుల ముందే చీరల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తిచేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తయిన ప్రక్రియ జిల్లాలోని అన్ని మండలాల్లో 1,88,134 మంది మహిళలు, యువతులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించగా మొదటి విడతలో జిల్లాకు 1.28 లక్షల చీరలు వచ్చాయి. వీటిని జిల్లాలో ఉన్న చౌకధరల దుకాణాల దగ్గరలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా పంపిణీ చేయనున్నారు. ఆడపడచులకు చీరలు అందించడంతో పాటు నేతన్నలకు ఉపాధి కల్పించే ద్విముఖ వ్యూహంతో అమలుచేస్తున్న బతుకమ్మచీరల పంపిణీ కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. అర్హులందరికీ అందిస్తాం నారాయణపేట జిల్లాలో అర్హులుగా ఉన్న మహిళలందరికీ చీ రలు అందిస్తాం. మొదటి విడతలో 75 వేల చీరలు వచ్చాయ్. మిగతావి వారం రోజుల్లో రావచ్చు. కలెక్టర్ ఎస్.వెంకట్రావ్, ఎమ్మెల్యేలు ఎస్.రాజేందర్‌రెడ్డి, చిట్టెం రాంమోహన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డిలతో చర్చించి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. – గోవిందయ్య, జిల్లా జౌళిశాఖ అధికారి -
బతుకమ్మ చీరల పంపిణీని అడ్డుకోవద్దు’
సిరిసిల్ల: బతుకమ్మ చీరల పంపిణీని అడ్డుకోవద్దని కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ కోరా రు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గురువారం టీఆర్ఎస్ జెండా పండుగలో ఆయన మాట్లాడారు. సమైక్యరాష్ట్రంలో బతుకమ్మ పం డుగ వివక్షకు గురైందన్నారు. రాష్ట్ర ప్రభు త్వం ఆడబిడ్డలకు చీరను కానుకగా గతేడాది నుంచి అందిస్తోందని ఎంపీ వివరించారు. ఇది కొత్తగా ప్రారంభించిన పథకం కాదని, మే నెలలోనే బతుకమ్మ చీరలకు రూ.280 కోట్లు విడుదల చేశారని పేర్కొన్నారు. కేసీఆర్ కోరితే తాను ఢిల్లీకి వెళ్లి భారత ఎన్నికల సంఘాన్ని కలుస్తా నని తెలిపారు. బతుకమ్మ చీరల పంపిణీ నిలిపి వేతపై ఎన్నికల కమిషన్ పునరాలోచించా లని కోరారు. కోర్టుపక్షి కాంగ్రెస్ అభివృద్ధి పనులపై కేసులు వేయడమే కాకుండా చివరకు ఆడబిడ్డలకు పండుగ కానుకనూ రాజకీయం చేసి అడ్డుకోవాలని చూడటం బాధాకరమన్నారు. -
చీరలొచ్చాయ్!
నాగర్‌కర్నూల్ టౌన్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పండగ బతుకమ్మ. పల్లెల్లో గొప్పతనం, ప్రకృతిలోని అనేక పూలతో మమేకమైన ఈ పండగను పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా నిర్వహిస్తారు. ఆనందోత్సాహాల మధ్య బతుకమ్మను జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గతేడాది నుంచి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ నెల 9 నుంచి 18వ తేదీ వరకు పది రోజుల పాటు రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు జరగనున్న నేపథ్యంలో మహిళలకు చీరలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి జిల్లాలోని 558 రేషన్ దుకాణాల్లో 2,67,873 లబ్ధిదారులకు గానూ దాదాపు లక్షకు పైగా చీరలు జిల్లాకు చేరుకున్నాయి. మరో రెండు, మూడు రోజుల్లో మిగిలిన చీరలు వస్తాయని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. గతంలో ఇలా.. గతేడాది బతుకమ్మ చీరలను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని పౌరసరఫరాల శాఖ ద్వారా 18ఏళ్ల వయసు దాటిన వారందరి వివరాలను సేకరించింది. ఈ సారి కూడా జిల్లాలో రేషన్ దుకాణాల్లో ఉన్న లబ్ధిదారుల్లో 18ఏళ్లు నిండిన వారందరికీ చీరలు పంపిణీ చేయనుంది. అదేవిధంగా ఈసారి కొత్తగా రేషన్‌కార్డులు తీసుకున్న వారు, గత కార్డులలో ఉన్న వారికి 18ఏళ్లు నిండిన వారు కొత్తగా రావడంతో చీరల సంఖ్య మరింత పెరిగింది. పండగ సమయానికి ఎలాంటి హడావుడి లేకుండా పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. జిల్లాకు చేరిన లక్ష చీరలు బతుకమ్మ సందర్భంగా పంపిణీ చేసే చీరలను నాగర్‌కర్నూల్‌లోని మార్కెటింగ్ శాఖ గోడౌన్తోపాటు అచ్చంపేటలో ఉన్న మార్కెటింగ్ శాఖ గోడౌన్లలో భద్రపరిచారు. ఇప్పటి వరకు జిల్లాలో లక్షకు పైగా చీరలు చేరాయి. అయితే మహిళలకు నచ్చిన విధంగా డిజైన్, రంగులు ఉండాలనే ఉద్దేశంతో అధికారులు ప్రస్తుతం వచ్చిన చీరలపై అభిప్రాయాలు సేకరిస్తున్నారు. గతేడాది ఎదుర్కొన్న అనుభవాల దృష్ట్యా ఈసారి చేనేత కార్మికులతో ప్రత్యేకంగా చీరలను నేయించారు. తొమ్మిది రకాల డిజైన్లలో చీరలు తయారు చేశారు. జిల్లాకు వచ్చిన బతుకమ్మ చీరలు, వాటి రంగులు, నాణ్య త, డిజైన్లను అధికారులు ఇప్పటికే పరిశీలించారు. పంపిణీపై రాని స్పష్టమైన ఆదేశాలు బతుకమ్మ చీరలు జిల్లాకు చేరుకున్నప్పటికీ వాటి పంపిణీపై అధికారుల్లో సందిగ్ధత నెలకొంది. ఇప్పటి వరకు ప్రభుత్వం స్పష్టమైన తేదీని ప్రకటించకపోవడం, బతుకమ్మ పండగ ప్రారంభానికి మరో వారం రోజుల సమయం మాత్రమే ఉంది. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం మాడల్ ఎలక్షన్ కోడ్‌ను అమల్లోకి తీసుకురావడంతో ప్రభుత్వ పథకాలపై అధికారులు పునరాలోచిస్తున్నారు. బతుకమ్మ చీరల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించి అక్కడి నుంచి గ్రీన్‌సిగ్నల్ వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇంకా రావాల్సి ఉంది జిల్లాలో 2లక్షలకు పైగా బతుకమ్మ చీరల ల బ్ధిదారులు ఉన్నారు. అందులో ఇప్పటివరకు లక్షకు పైగా చీరలు వచ్చాయి. ఇంకా రావాల్సిన లక్ష చీరలు ఈ రెండు, మూడు రోజుల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. పంపిణీ తేదీపై ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు రాలేదు. తేదీ ప్రకటించగానే గ్రామాల వారీగా లబ్ధిదారుల సంఖ్య చూసుకుని పంపిణీ చేస్తాం. – మోహన్‌బాబు, డీఎస్ఓ -
బతుకమ్మ చీరలు వస్తున్నాయ్!
రేషన్ దుకాణాల సమీపంలో ఉన్న ప్రభుత్వ భవనాల్లో చీరల పంపిణీ చేపట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ బడులు, కమ్యూనిటీ హాళ్లు వేదికలుగా అందజేస్తారు. రేషన్ కార్డులో పేరుండటంతోపాటు ఏదేని గుర్తింపు కార్డు (ఆధార్/ఓటర్) తీసుకెళ్తే చీరలు పంపిణీ చేస్తారు. ఎంపీడీఓలు, సెర్ప్ ఏపీఓల ఆధ్వర్యంలో పంపిణీ ప్రక్రియ కొనసాగనుంది. గతేడాది విస్తృతంగా ప్రచారం చేసినా నాణ్యత లేదనే కారణంతో చాలామంది మహిళలు చీరలు తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో సుమారు లక్షకుపైగా చీరలు మిగిలిపోవడంతో వెనక్కి వెళ్లాయి. ఈ ఏడాదైనా నాణ్యత ఉంటుందా.. లేదా అని మహిళలు చర్చించుకుంటున్నారు. అసాక్షి, రంగారెడ్డి జిల్లా: బతుకమ్మ చీరలు త్వరలో జిల్లాకు రానున్నాయి. బతుకమ్మ పండుగ కానుకగా రాష్ట్ర ప్రభుత్వం ‘బతుకమ్మ చీరలు’ పంపిణీని గతేడాది ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఈ ఏడాది సైతం మహిళలకు చీరలు అందజేసేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 18 ఏళ్ల వయసు నిండి ఆహార భద్రత కార్డులో పేరున్న ప్రతి మహిళకు ఒకటి చొప్పున చీరను పంపిణీ చేయనున్నారు. 557 గ్రామ పంచాయతీలు, జీహెచ్ఎంసీ పరిధిలోని మూడు సర్కిళ్లు, మున్సిపాలిటీల్లో ఒకేసారి పంపిణీ చేపట్టే అవకాశం ఉంది. జిల్లా పరిధిలోని రేషన్ కార్డుల్లో పేరున్న 6.49 లక్షల మంది మహిళలకు బతుకమ్మ చీరలు త్వరలో అందనున్నాయి. ఈనెల 12 నుంచి 15 వరకు వీటిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వారం రోజుల్లో జిల్లాకు స్టాక్ వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. పంపిణీ చేసేంత వరకు వీటినా వ్యవసాయ మార్కెట్ కమిటీల గోదాముల్లో భద్రపరచనున్నారు. -
బతుకమ్మ చీరల పంపిణీపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ చీరల పంపిణీపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. శుక్రవారం కాంగ్రెస్ కోశాధికారి, ఏఐసీసీ సభ్యుడు గూడూరు నారాయణ రెడ్డి ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌కు లేఖ రాశారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ఆపద్ధర్మ ప్రభుత్వం చీరలు పంపిణీ చేయనుందని ఈ కార్యక్రమంలో మంత్రులు, టీఆర్ఎస్ పార్టీ నేతలు పాల్గొననున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆపద్ధర్మ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని టీఆర్ఎస్ నేతలు, మంత్రులు కాకుండా అధికారులే చేపట్టేలా ఈసీ పర్యవేక్షించాలని ఫిర్యాదులో కోరారు. చీరల పంపిణీ సమయంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటో లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. -
12 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా 95 లక్షల చీరలను పంపిణీ చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో బతుకమ్మ చీరల తయారీ పూర్తయిందని, అక్టోబర్ 12 నుంచి చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. గురువారం సీడీఎంఏ కార్యాలయంలో బతుకమ్మ చీరల ప్రదర్శన కార్యక్రమానికి కేటీఆర్ హాజరయ్యారు. అనంతరం చీరలను పరిశీలించి మహిళల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గతేడాది జరిగిన చిన్న అసంతృప్తులను సవరించుకుని రూ.280 కోట్లతో వేగంగా చీరల తయారీ కొనసాగించామని తెలిపారు. గతేడాది సమయాభావం వల్ల కొన్ని చీరలను సూరత్ నుంచి తెప్పించామని, కానీ ఈసారి అలా జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టామన్నారు. 80 రకాల రంగులతో చీరలను తయారు చేయించామని, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వయోవృద్ధ మహిళలు ధరించే 9 మీటర్ల పొడవు ఉండే 5లక్షల చీరలను ప్రత్యేకంగా తయారు చేయించామని పేర్కొన్నారు. ఇçప్పటివరకు ఉత్పత్తి అయిన 50 లక్షల చీరలను జిల్లాల వారీగా పంపిణీ చేయగా, మిగిలినవి అక్టోబర్ 10 నాటికి చేరతాయని తెలిపారు. 16 వేల మందికి ఉపాధి.. సిరిసిల్ల ప్రాంతంలోని చేనేత సామాజిక వర్గాల్లో్ల పేదరికం, ఆత్మహత్యలు నివారించే విధంగా సిరిసిల్ల పవర్లూమ్ క్లస్టర్లో 16 వేల మంది నేత కార్మికులకు పని కల్పించామని మంత్రి కేటీఆర్ తెలిపారు. దీని ద్వారా 6 నెలలుగా పది వేల కుటుంబాలు ఉపాధి పొందాయని చెప్పారు. మెప్మా, సెర్ప్ కింద స్వయం çసహాయక బృందాల్లోని మహిళా ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు, సలహాలు సంప్రదింపుల ద్వారా ఈ సారి చీరల తయారీ, డిజైన్లలో మార్పులు చేశామన్నారు. అనంతరం జౌళీశాఖ డైరెక్టర్ శైలజా రామయ్యర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది చీరల తయారీలో ఎలాంటి రాజీ లేకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించామని చెప్పారు. గడువులోగా చీరల పంపిణీ పూర్తయ్యేలా ఏర్పాటు చేశామని తెలిపారు. -
సెప్టెంబర్‌లోగా బతుకమ్మ చీరలు
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ చీరల ఉత్పత్తిని సెప్టెంబర్ చివరిలోగా పూర్తి చేయాలని పరిశ్రమలు, చేనేత, జౌళి శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ మేరకు 90 లక్షల చీరలను బతుకమ్మ పండుగకు వారం ముందే సరఫరా చేయాలని సిరిసిల్ల మాస్టర్ వీవర్లు, మ్యాక్స్ ప్రతినిధులకు సూచించారు. చీరల ఉత్పత్తి వేగాన్ని, లూమ్ల సంఖ్య పెంచి డబుల్ షిఫ్టుల్లో పనిచేయాలని కోరారు. బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంపై శనివారం ఇక్కడ సమీక్ష నిర్వహించారు. సిరిసిల్లలో ప్రస్తుతం పదివేల లూములపై చీరల నేత కొనసాగుతోందని అధికారులు మంత్రికి నివేదించారు. లక్ష్యం మేరకు ఉత్పత్తి సాధించేందుకు కనీసం 20 వేల లూములపై చీరల ఉత్పత్తి జరపాల్సి ఉందని, ఈ మేరకు త్వరలో ఉత్పత్తి ప్రక్రియను రెట్టింపు చేస్తామని సిరిసిల్ల మ్యాక్స్ ప్రతినిధులు తెలిపారు. నేతన్నల ఆదాయం పెంచడమే లక్ష్యం బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు చిరుకానుక ఇవ్వడంతోపాటు సిరిసిల్లలోని నేతన్నలకు, పవర్లూమ్ కార్మికులకు ఆదాయం, జీవన ప్రమాణాలను పెంచాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారని కేటీఆర్ పేర్కొన్నారు. ఎంతో నమ్మకంతో సిరిసిల్ల నేత కార్మికులకు ఇచ్చిన బతుకమ్మ చీరల ఆర్డర్‌ను గడువులోగా పూర్తి చేయాలని కోరారు. చీరల ఉత్పత్తి కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని టెక్స్టైల్ శాఖ కమిషనరేట్ అధికారులను ఆదేశించారు. వారంలో కనీసం 4 సార్లు సిరిసిల్లలో పర్యటించాలన్నారు. నేతన్నలకు బ్యాంకు, ముద్ర రుణాల మంజూరు, ఇతర అంశాలపై చర్చించేందుకు ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ నేతృత్వంలో త్వరలో బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. సిరిసిల్లలోని పవర్లూమ్ కార్మికులు తయారు చేస్తున్న బతుకమ్మ చీరల నాణ్యతను మంత్రి పరిశీలించారు. వచ్చేవారంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతీ ఇరానీని కలసి పవర్లూమ్ నవీకరణ పథకం అమలులోని సమస్యలు, సవాళ్లను వివరిస్తానని పేర్కొన్నారు. -
సిరిసిల్లకు సూరత్ బీములు
సిరిసిల్ల: పవర్లూమ్ కార్మికులకు ఉపాధి కల్పిం చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లను రాజన్న సిరిసిల్ల నేతన్నలకు ఇచ్చింది. కానీ కొందరు దీనిని గాడి తప్పిస్తున్నారు. గుజ రాత్‌లోని సూరత్ నుంచి బతుకమ్మ చీరల వస్త్రా న్ని ఉత్పత్తి చేసే బీములను సిరిసిల్లకు దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో వార్పిన్ కార్మికుల ఉపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తమవుతోంది. సూరత్ నుంచి సిరిసిల్లకు ఆదివారం 50 బీములు వ్యాన్‌లో వచ్చాయి. ఐదుగురు వస్త్రోత్పత్తిదారులు 10 చొప్పున జరీ అంచు చీరల బీములను దిగుమతి చేసుకున్నారు. దీనిపై వార్పిన్ కార్మికులు ఆందో ళన వ్యక్తంచేస్తున్నారు. తమ కూలీ పెంచాలని ఇటీవల వార్పిన్ కార్మికు లు సమ్మెకు దిగారు. అధికారుల హామీతో సమ్మె ను తాత్కాలికంగా విరమించారు. కార్మికుల సమ్మె సమస్యను అధిగమించేందుకు సూరత్ నుంచి బీములు తెప్పించామని వస్త్రోత్పత్తిదారు లు చెబుతున్నారు. సిరిసిల్లకు చెందిన ఓ రాజకీ య నేత ఈ విషయంలో కీలకంగా వ్యవహరిస్తు న్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. దీనిపై జౌళి శాఖ ఏడీ అశోక్‌రావును వివరణ కోరగా.. సూర త్ నుంచి బీములు వచ్చిన విషయం తన దృష్టికి వచ్చిందని, దీనిపై జౌళి శాఖ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చానని వారినుంచి వచ్చే ఆదేశం మేరకు ముందుకు వెళ్తామని తెలిపారు. -
కేసీఆర్ ఎముకలు కూడా వదలడం లేదు: డీకే
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావుపై గద్వాల కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రా పాలకులు తోలు మింగితే ఇప్పుడు కేసీఆర్ ఎముకలను కూడా వదలడం లేదని ఆమె విమర్శించారు. మంగళవారం డీకే అరుణ గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘చీరలు కాల్చారని ఆరోపిస్తూ మహిళల పై కేసులు పెట్టడం అమానుషం. మహిళలపై పెట్టిన కేసులను తక్షణమే విత్‌డ్రా చేయాలి. నాసిరకం బతుకమ్మ చీరలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. దానికి బదులు మహిళల అకౌంట్లలో డబ్బులు వేయాలి. ప్రజల సొమ్మును దోచుకుంటుంటే కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదు. రాష్ట్ర మహిళా లోకాన్ని అగౌరవ పరిచిన టీఆర్ఎస్కు ప్రజలే బుద్ధి చెప్తారు. కేసీఆర్ కుమార్తె, ఎంపీ కవిత ఈ చీరలే కట్టుకొని బతుకమ్మ ఆడుతుందా? ప్రతిపక్షాలను దూషించడం కాదు ముందు మీ తీరు మార్చుకోండి’ అని హితవు పలికారు. టీపీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి మాట్లాడుతూ.. నాసిరకమే కాకుండా తక్కువ సైజ్ చీరలు ఇచ్చి మహిళలను అగౌరవ పరిచారని, మహిళలకు ఎంత చీర కావాలో కూడా ప్రభుత్వ పెద్దలకు తెలియదా అని ప్రశ్నించారు.