సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ చీరల పంపిణీపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. శుక్రవారం కాంగ్రెస్ కోశాధికారి, ఏఐసీసీ సభ్యుడు గూడూరు నారాయణ రెడ్డి ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌కు లేఖ రాశారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ఆపద్ధర్మ ప్రభుత్వం చీరలు పంపిణీ చేయనుందని ఈ కార్యక్రమంలో మంత్రులు, టీఆర్‌ఎస్ పార్టీ నేతలు పాల్గొననున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆపద్ధర్మ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని టీఆర్‌ఎస్ నేతలు, మంత్రులు కాకుండా అధికారులే చేపట్టేలా ఈసీ పర్యవేక్షించాలని ఫిర్యాదులో కోరారు. చీరల పంపిణీ సమయంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటో లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment