ఆర్‌వీఎం మెడికల్‌ కాలేజీపై వేటు | Suspension on RVM Medical college | Sakshi
Sakshi News home page

ఆర్‌వీఎం మెడికల్‌ కాలేజీపై వేటు

Published Sun, Aug 13 2017 2:52 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

Suspension on RVM Medical college

  • 2017–18, 2018–19 అడ్మిషన్లు వద్దు
  • కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయం
  • సాక్షి, హైదరాబాద్‌: ఆర్‌వీఎం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడి కల్‌ సైన్సెస్‌పై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వేటు వేసింది. ఆర్‌వీఎం వైద్య కాలేజీలో వరుసగా రెండేళ్లు వైద్య విద్య ప్రవేశాలు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. 2017–18, 2018–19 సంవత్సరాల్లో విద్యా ర్థులకు ప్రవేశం కల్పించవద్దని నిర్ణయం తీసుకుంది. భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అండర్‌ సెక్రటరీ డీవీకే రావు ఈ మేరకు ఆగస్టు 10న ఉత్త ర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల ప్రతులను ఆర్‌వీఎం చారిట బుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌కు పంపారు. ప్రవేశాల రద్దు ఉత్త ర్వుల ప్రతులను భారత వైద్య మండలికి, జాతీయ వైద్య విద్య అదనపు డైరెక్టర్‌ జనరల్‌కు, తెలంగాణ వైద్య శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శికి, కాళోజీ  హెల్త్‌ వర్సిటీ, ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీకి, తెలంగాణ వైద్య విద్య సంచాలకుడికి పంపారు.

    ఉమ్మడి మెదక్‌ జిల్లా ములుగు మండలంలోని ఆర్‌వీఎం చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఆర్‌వీఎం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(వైద్య కళాశాల)ను కొత్తగా ఏర్పాటు చేశారు. 2016–17 విద్యా సంత్సరంలో ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల ప్రవేశాల కోసం భారత వైద్య మండలి (ఎంసీఐ)కి ఈ సంస్థ దరఖాస్తు చేసుకుంది. 2016 జనవరిలో ఎంసీఐ బృందం ఆర్‌వీఎం కళాశాల లోని ఏర్పాట్లను పరిశీలించింది. అదే నెలలో కాలేజీ లోని లోపాలపై సమగ్ర నివేదికను రూపొందించింది. 33 అంశాలలో లోపాలను పేర్కొంది. 2016–17లో ప్రవే శాలకు అనుమతి ఇవ్వవద్దని ప్రతిపాదించింది. ఆరోగ్య శాఖ ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలి పింది. అనంతరం ఆర్‌వీఎం చారిటబుల్‌ చేసిన విజ్ఞప్తి మేరకు షరతులతో 150 మంది విద్యార్థులను చేర్చు కునేందుకు అనుమతి ఇచ్చింది.

    ఎంసీఐ పేర్కొన్న లోపాలను వెంటనే సరిదిద్దుకోవాలని షరతు విధిం చింది. 2017–18 ప్రవేశాల అనుమతుల జారీ ప్రక్రి యలో భాగంగా 2016 నవంబర్‌లో ఎంసీఐ మళ్లీ తని ఖీలు నిర్వహించింది. వైద్య కాలేజీ నిర్వహణలో తప్ప నిసరిగా ఉండాల్సిన వసతులలో 27 అంశాల్లో లోపాలు ఉన్నట్లు గుర్తించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించింది. వైద్య విద్యకు అవస రమైన అంశాలు లేనందున 2017–18, 2018–19 విద్యా సంవత్సరాల్లో కొత్తగా ప్రవేశాలు కల్పించవ ద్దని ప్రతిపాదించింది. అనంతరం కాలేజీ యాజమా న్యం వాదనను ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌(డీజీహెచ్‌ఎస్‌) స్వీకరించింది. 27 అంశాల్లోని లోపాలను పేర్కొంటూ ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపింది. బోధన సిబ్బంది, వసతులు, వైద్య కాలేజీ నిర్వహణలో లోపాలు ఉన్నాయని పేర్కొంది. భారత వైద్య మండలి, డీజీహెచ్‌ఎస్‌ నివేదికల ఆధారంగా ఆర్‌వీఎం కాలేజీకి రెండేళ్లపాటు ప్రవేశాలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 2017 మే 31న నిర్ణయం తీసుకుంది.

    ఈ నిర్ణయంపై అభ్యంతరం తెలుపుతూ కాలేజీ యాజమాన్యం సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేసింది. లోపాలపై కాలేజీ యాజమాన్యం వాదనను వినేందుకు మరోసారి అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖను ఆదేశిస్తూ ఆగస్టు 1న ఉత్తర్వులు జారీ చేసింది. పది రోజులలో ఈ పక్రియ పూర్తి చేయాలని సూచించింది. ఆగస్టు 4న ఆరోగ్య మంత్రిత్వ శాఖ కమిటీ.. కాలేజీ యాజమాన్యానికి మరో అవకాశం ఇచ్చింది. కాలేజీ సమర్పించిన తాజా రికార్డులు... లిఖితపూర్వక, మౌఖిక వాదనలను తీసుకుంది. బోధన సిబ్బంది, ఆరోగ్య చికిత్స అంశాలపై ఇచ్చిన నివేదికలు నకిలీవని తేల్చింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం సరైనదేనని కమిటీ పేర్కొంది. అన్ని అంశాల ఆధారంగా ఆర్‌వీఎం కాలేజీలో రెండేళ్లపాటు అడ్మిషన్లను డిబార్‌ చేస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రి ఉత్తర్వులు జారీ చేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement