రంగారెడ్డి:జిల్లాలోని మోహినాబాద్ స్వైన్ ఫ్లూ బారిన పడ్డ ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. మహ్మద్ ఆసీఫ్ కు స్వైన్ ఫ్లూ సోకడంతో శనివారం మృతి చెందాడు. ఈ మరణం స్థానిక ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది.
తాజాగా స్వైన్ ఫ్లూ వ్యాపించి ఒక వ్యక్తి మృతి చెందడంతో ప్రజలు వణికిపోతున్నారు. తమకు సోకుతుందమోనని భావించిన వారు ఇళ్లకు తాళాలు వేసి వేరే గ్రామానికి తరలిపోతున్నారు.