![Take Action Against The Victims - Sakshi](/styles/webp/s3/article_images/2018/03/28/sp.jpg.webp?itok=diCof38V)
ఎస్పీతో మాట్లాడుతున్న రమాదేవి
నిర్మల్‌రూరల్ : జిల్లా కేంద్రంలో శ్రీరామనవమి శోభాయాత్రలో చోటు చేసుకున్న అల్లర్లపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు మంగళవారం ఇన్‌చార్జి ఎస్పీ విష్ణు ఎస్ వారియర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు రమాదేవి మాట్లాడుతూ.. భక్తులు, పోలీసులపై పథకం ప్రకారం దాడి చేశారని ఆరోపించారు. దాడిలో గాయపడిన వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదన్నారు. వెంటనే వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు రావుల రాంనాథ్, డాక్టర్ మల్లికార్జున్‌రెడ్డి, వొడిసెల శ్రీనివాస్, వేణు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment