ఖానాపూర్ (ఆదిలాబాద్): ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం పెంబి అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ. 2 లక్షల విలువైన టేకు దుంగలను బుధవారం అర్థరాత్రి స్వాధీనం చేసుకున్నారు. ఎద్దులబండ్ల ద్వారా కలప తరలిపోతోందని సమాచారం అందుకున్న పెంబి అటవీ శాఖ అధికారులు.. పెంబి, ఖానాపూర్ పోలీసుల సాయంతో స్మగ్లర్లను నిలువరించారు. స్మగ్లర్లు పరారయ్యారు.
కాగా బండ్లపై ఉన్న 35 టేకు దుంగలను స్వాధీనం చేసుకుని, వాటిని పెంబి అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. ఈ దుంగలు సుమారు రూ. 2 లక్షలు విలువ చేస్తాయని అటవీ అధికారులు తెలిపారు.