
'తలసాని రాజకీయ అవకాశవాది'
- మంత్రి తలసాని నివాసాన్ని ముట్టడించిన టీఎన్‌ఎస్‌ఎఫ్
హైదరాబాద్ సిటీ: వెస్ట్‌మారేడ్‌పల్లిలోని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ నివాసాన్ని టీఎన్‌ఎస్‌ఎఫ్ కార్యకర్తలు శుక్రవారం ముట్టడించారు. చీపుర్లు, చెప్పులు చేతపట్టుకుని‘ రాజకీయ అవకాశవాది తలసాని ఖబడ్దార్’, అంటూ నినాదాలు చేశారు. టీడీపీ నుంచి గెలిచిన తలసాని ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని 10 మంది కార్యకర్తలను అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.