షోలాపూర్-రాయచూర్ లైను ద్వారా అదనపు విద్యుత్‌ను పొంది, కరెంటు కష్టాల నుంచి బయట పడదామనుకున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను తమిళనాడు అడ్డంగా ‘బుక్’ చేసింది.
షోలాపూర్-రాయచూర్’ను ముందే బుక్ చేసుకున్న పొరుగు రాష్ట్రం
సాక్షి, హైదరాబాద్: షోలాపూర్-రాయచూర్ లైను ద్వారా అదనపు విద్యుత్‌ను పొంది, కరెంటు కష్టాల నుంచి బయట పడదామనుకున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను తమిళనాడు అడ్డంగా ‘బుక్’ చేసింది. ఈ లైను ద్వారా సరఫరా అయ్యే సుమారు 1250 మెగావాట్ల విద్యుత్‌లో ఏకంగా 1000 ఎంవీని ఇప్పటికే ఆ రాష్ట్రం తన్నుకుపోయింది. ఇక ఇందులో మిగిలిన 250 మెగావాట్ల విద్యుత్ కోసం ఐదు దక్షిణాది రాష్ట్రాలు పోటీపడాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో తెలంగాణ, ఏపీలు మరి కొన్నేళ్లు విద్యుత్ కష్టాలు భరించాల్సిందేనన్న విషయం స్పష్టమైపోయింది.