బంగారు తెలంగాణను నిర్మిద్దాం | Tamilisai Soundararajan First Speech About Telangana People | Sakshi
Sakshi News home page

బంగారు తెలంగాణను నిర్మిద్దాం

Published Tue, Sep 10 2019 3:15 AM | Last Updated on Tue, Sep 10 2019 3:15 AM

Tamilisai Soundararajan First Speech About Telangana People - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర కొత్త గవర్నర్‌ తమిళిసై.. బంగారు తెలంగాణకు సై అన్నారు. రాష్ట్రాభివృద్ధి ప్రయత్నాల్లో భాగస్వామినవుతానని అన్నారు. గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తమిళిసై సౌందరరాజన్‌ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సందేశం ఇచ్చా రు. ఈ మేరకు ఆదివారం ఓ లేఖ విడుదల చేశా రు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం బలమై న పునాదులు వేసుకున్న తెలంగాణ రాష్ట్రం దేశం ముంగిట ఒక మోడల్‌ రాష్ట్రంగా సగర్వంగా నిలబడిందన్నారు. రాష్ట్రంలో అమలువుతున్న వివిధ కార్యక్రమాలు, అర్థిక పురోభివృద్ధి, ప్రాజెక్టులు తదితర అంశాలను తన సందేశంలో ప్రస్తావించారు.

గవర్నర్‌ సందేశం ఆమె మాటల్లో.. ‘తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు.. ప్రియమైన యువ తెలంగాణ ప్రజలారా..! గణేశ్‌ ఉత్సవాల తోపాటు త్వరలో జరిగే బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం సమర్థ నాయకు డు సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో జరుగుతున్న ప్రయత్నాల్లో నేను భాగస్వామిగా మారడం సంతోషంగా ఉంది. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం కో సం స్థిరమైన, ఆరోగ్యకరమైన, బలమైన ఆర్థిక విధానాలతో తెలంగాణ రాష్ట్రం ముందుకు సాగు తున్న తీరు నన్ను ఆకట్టుకుంటోంది. అన్ని మతాల కు చెందిన అన్ని పండుగలకు సమ ప్రాధాన్యతని స్తూ.. అందరి మనోభావాలను గౌరవిస్తోంది. గం గాజమునా తెహజీబ్‌ను చిత్తశుద్ధితో పరిరక్షిస్తోంది. 

మానవ నిర్మిత అద్భుతం కాళేశ్వరం 
మానవ నిర్మిత అద్భుతం కాళేశ్వరం ప్రాజెక్టు పనులు రికార్డు స్థాయిలో పూర్తి చేయడం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించడంతోపాటు, వ్యవసాయానికి గోదావరి జలాల తరలింపు సాధ్యమవుతుంది. సముద్రంలో వృథాగా కలిసే 575 టీఎంసీ ల నీటిని అదనంగా పొలాలకు మళ్లించడంతోపాటు తాగునీరు, విద్యుత్‌ ఉత్పత్తికి కూడా ఉపయోగపడుతుంది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఎంతో సంతోషం కలిగిస్తున్నది. పారిశ్రామిక, మౌలిక సౌకర్యాలు, పాలన రంగాల్లో ఐటీ, సాంకేతికతను వినియోగిస్తున్న తీరు బాగుంది. చేనేత, గీత కార్మికుల వంటి వృత్తి పనివారల సంక్షేమాన్ని గుర్తుంచుకోవడం హర్షణీయం. గతంలో రూ.52 వేల కోట్ల మేర ఉన్న ఐటీ ఎగుమతులను రూ.1.10 లక్షల కోట్లకు చేర్చడం ద్వారా ఐటీ రంగంలో తెలంగాణ అద్భుత పురోగతి సాధించింది. మెట్రో నగరంగా ఉన్న హైదరాబాద్‌ విశ్వనగరంగా ఎదుగుతోంది. ఇక్కడి శాంతిభద్రతలు దేశంలోని ఇతర నగరాలకు కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తున్నాయి.  

బంగారు తెలంగాణ కోసం బలమైన పునాదులు 
పవిత్రమైన యజ్ఞ యాగాదులను నిర్వహించడంతోపాటు రాష్ట్ర పునర్మిర్మాణం, పునరుజ్జీవనం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం బలమైన పునాదులు వేసుకున్న తెలంగాణ ఈ రోజు దేశం ముంగిట ఒక నమూనా రాష్ట్రంగా సగర్వంగా తలెత్తి నిలబడింది. అన్ని రకాలైన రాజకీయ, సామాజిక విభేదాలను పక్కన పెట్టి.. దృఢమైన దేశాన్ని నిర్మించడంలో భాగంగా దృఢమైన రాష్ట్రంగా నా ప్రభుత్వాన్ని తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నా.. జైహింద్‌.. జై తెలంగాణ’అంటూ గవర్నర్‌ తన సందేశాన్ని ముగించారు.

సంస్కరణలో ప్రభుత్వ చొరవ భేష్‌ 
2018–19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం 14.84 రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిని సాధించడం ద్వారా రాష్ట్ర సంపదలో ఎంతో వృద్ధి కనిపించింది. 2014లో రూ.4 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర సం పద ప్రస్తుతం రూ.8.66 లక్షల కోట్లకు చేరుకున్న ట్లు తెలిసింది. సుపరిపాలనలో భాగంగా అధికా ర వికేంద్రీకరణ కోసం అనేక పాలనాసంస్కర ణలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ ప్రశంసనీయం. ప్రభుత్వపాలన, సంక్షేమ ఫలాలను గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రజల ముంగిటకు చేరేందుకు ఎలాంటి అవరోధాలు లేకుండా ఈ విధమైన సంస్కరణలు దోహదం చే స్తాయి.

గ్రామాల అభివృద్ధిలో 30 రోజుల ప్రణాళిక అమలే గీటురాయిగా నిలువబోతున్నది. పారిశుధ్యం, హరితహారం, విద్యుత్‌ ఉత్పత్తి, రైతుబం ధు, రైతుబీమా, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీర థ వంటి విశిష్ట కార్యక్రమాలు అమలవుతున్నా యి. ఎస్సీలు, ఎస్టీలు, వెనుకబడిన తరగతులు, మైనార్టీల ఆకాంక్షలు నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభు త్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. ఆరోగ్యశ్రీ, కంటివెలుగు వంటి కార్యక్రమాల అమల్లో దేశం లోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement