కేసీఆర్‌ది నిజాం పాలన: తమ్మినేని | Tammineni comments on Kcr government | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ది నిజాం పాలన: తమ్మినేని

Published Sat, Mar 11 2017 2:48 AM | Last Updated on Mon, Aug 13 2018 8:12 PM

కేసీఆర్‌ది నిజాం పాలన: తమ్మినేని - Sakshi

కేసీఆర్‌ది నిజాం పాలన: తమ్మినేని

కట్టంగూర్‌: కేసీఆర్‌ పాలన నిజాం సర్కారును తలపిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మహా జన పాదయాత్ర శుక్రవారం నల్లగొండ జిల్లా కట్టం గూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రజలు సంతో షంగా ఉండాలంటే మంచి పాలన అందించాలన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తుంటే విమర్శలు చేస్తున్నారని, ఇది తగదని అన్నారు. టీఆర్‌ఎస్‌ ఎన్నికల సమయంలో దళితులకు, గిరిజనులకు మూడు ఎకరాల సాగు భూమిని ఇస్తానని చెప్పి ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్‌లో జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు.

ప్రజా రవాణా వ్యవస్థను పటిష్టం చేయాలి
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రజారవాణా వ్యవస్థను పటిష్టం చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని తమ్మినేని  విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. ఆర్టీసీని ఆదుకునేందుకు ప్రతి ఏడాది రూ. వెయ్యికోట్ల గ్రాంట్‌ను బడ్జెట్‌లో కేటాయించాలని కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement