'వజ్రాలు కొల్లగొట్టేందుకే వెళ్లగొడుతున్నారు' | TDP donot accept to move chenchu community from nalamala forest says revanth | Sakshi
Sakshi News home page

'వజ్రాలు కొల్లగొట్టేందుకే వెళ్లగొడుతున్నారు'

Published Fri, Apr 17 2015 4:02 PM | Last Updated on Sun, Sep 3 2017 12:25 AM

బుధవారం అచ్చంపేటలో టీడీపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే  రేవంత్ రెడ్డి

బుధవారం అచ్చంపేటలో టీడీపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి

అభయారణ్యం, అభివృద్ధి తదితర కారణాలు చెప్పి నల్లమల్ల అటవీ ప్రాంతం నుంచి చెంచులను వెళ్లగొట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. అక్కడి నేలలో విలువైన వజ్రాలున్నాయని, వాటిని కొల్లగొట్టేందుకే సీఎం కేసీఆర్ ఈ విధంగా ప్రయత్నాలు సాగిస్తున్నారని ఆరోపించారు.

 

శుక్రవారం అచ్చంపేట నియోజకవర్గ స్థాయి టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీలో సమర్థులైన నాయకులు లేరని, అందుకే టీడీపీ నుంచి ఎమ్మెల్యేలను లాక్కొని మంత్రిపదవులు కట్టబెట్టారని విమర్శించారు. సచివాలయం తలరింపుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 23న ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో మాజీ మంత్రి రాములు ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement