నిజామాబాద్ అర్బన్ : ఉపాధ్యాయుల బదిలీ లు, పోస్టుల బదలాయింపు పక్రియలో నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. సవరణ మార్గదర్శకాల కోసం ఇటు ఉపాధ్యయులు, అటు విద్యాశాఖ ఎదురుచూస్తోంది. ఏడు రోజులు దాటినా బది లీల పక్రియ ముందుకు సాగకపోవటం, ఉన్నతాధికారుల ఆదేశాలు రాకపోవటంతో నిబంధనలు ఎలా ఉంటాయి, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలా వద్దా అన్నది సందిగ్ధంగా మారింది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. బదిలీకి అర్హులైనవారు దా దాపు సగం మంది దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనలలో ఉంటాయేమోననియని మరి కొంతమంది ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికి రెండున్నర వేల మంది ఉపాధ్యాయులు బదిలీలకు అర్హులుగా ఉ న్నారు. వీరు ప్రస్తుతం ఆయోమయం పరిస్థితి ఎదుర్కుంటున్నారు. ఇటు ఖాళీల జాబితాను రూపొం దించటంలోనూ విద్యాశాఖ చిక్కులు ఎదుర్కొంటో ంది. రేషైనలైజేషన్ ప్రక్రియ ఉండటంతో ఉండటం తో ఎలా చేయాలన్నది ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలో ఉపాధ్యయులు కూడా పాఠశాలలకు సక్రమంగా వెళ్లటం లేదు.
2013 బదిలీ టీచర్ల అయోమయం
2013లో 187 మంది టీచర్లకు బదిలీలు జరిగాయి. వీరు నేటి వరకు రిలీవ్ కాలేదు. మొదట జీఓ 11 ప్రకారం వీరిని ముందుగా రిలీవ్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. కానీ, నేటి వరకు అది అమలు కాలేదు. ప్రస్తుతం వీరు దరఖాస్తు చేసుకోవాలా వద్దా అనే సందిగ్ధంలో పడ్డారు. 2013లో బదిలీ అయిన స్థానం నేటికీ ఖాళీగా ఉంటే, ప్ర స్తుతం వీరిని రిలీవ్ చేసి అదే స్థానం కేటాయిం చాల్సి ఉంటుంది. అలా కాక రేషైనలైజేషన్ ప్రకారం చేస్తే వీరికి అయిదు పాయింట్లు కేటాయించి బదిలీలో కౌన్సెలింగ్ ద్వారా నియమిస్తారు. దీనితో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. రేషైనలైజేషన్‌లో టీచర్లకు 10 పాయింట్లు కేటాయించి ముందుగానే బదిలీ చేస్తున్నారు. అనంతరం 2013 టీచర్లను బదిలీ చేస్తే, వారికి స్థానాలు దక్కకుండా పోయే అవకాశాలున్నాయి.
షెడ్యూలులో మార్పులు ఇలా
ఈ నెల 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది
ఈ నెల 29న కేటగిరీవారిగా ఖాళీల జాబితాను ప్రకటిస్తారు
జూలై 1, 2 తేదీలలో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తుల హార్డు హర్డు కాపీల స్వీకరణ, పరిశీలన, పాయింట్ల కేటాయింపు
జూలై 3న బదిలీకి అర్హులైన టీచర్ల జాబితా ప్రకటన. పాయింట్ల కేటాయింపుతో పదోన్నతులు, రేషనలైజేషన్ జాబితా
జూలై 4, 5 తేదీలలో సీనియార్టీ జాబితా ప్రకారం అప్పీళ్ల స్వీకరణ
జూలై 6న బదిలీలు, పదోన్నతులు సీనియార్టీ తుది జాబిత విడుదల
జూలై 7న ప్రధానోపాధ్యాయుల బదిలీలు
జూలై 8న స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు
జూలై 9, 10, 11 తేదీలలో స్కూల్ అసిస్టెంట్లకు బదిలీలు
జూలై 12న ఎస్‌జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు
జూలై 13 నుంచి 16 వరకు ఎస్‌జీటీలకు బదిలీలు ఉంటాయి.
తక్షణమే మార్గదర్శకాలను విడుదల చేయాలి
ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం తక్షణమే మార్గదర్శకాలను విడుదల చేయాలి. టీచర్లు రోజుల తరబడి ఆందోళనగా ఎదురుచూస్తున్నారు. షెడ్యూల్ ప్రకటించినప్పటికీ, విధి విధానాలు అందుబాటులో లేకపోవటం ఆందోళన కలిగి స్తోంది. తొందరగా ఈ నిరీక్షణకు తెర వేయూలి.
- లక్ష్మారెడ్డి, పీఆర్‌టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు
ఇంకెన్ని రోజులు?
Published Sun, Jun 28 2015 1:25 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement