బోనాల ముహూర్తం ఖరారు | Telangana Bonala Jathara starts This Month | Sakshi
Sakshi News home page

బోనాల ముహూర్తం ఖరారు

Published Mon, Jun 5 2017 6:11 PM | Last Updated on Mon, Oct 1 2018 6:33 PM

బోనాల ముహూర్తం ఖరారు - Sakshi

బోనాల ముహూర్తం ఖరారు

హైదరాబాద్‌: తెలంగాణ పండుగ బోనాల జాతరకు ముహూర్తం ఖరారయింది.సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పండుగ తేదిలను నిర్ణయించారు. ఈ జాతర జూన్‌ 25న ప్రాంభమై జూలై 23న ముగుస్తుంది. సంప్రదాయబద్ధంగా గోల్కొండ బోనాలు లంగర్‌ హౌజ్‌ దగ్గర తొట్టెల ఊరేగింపుతో పండుగ మొదలవుతుంది.దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు స్థానికులు పాల్గొనే ఈ ఊరేగింపు ఆలయ పూజారి ఇంటి వరకు సాగుతుంది.

పోతురాజుల వీరంగాలు, శివసత్తుల సిగాలు, డప్పు దరువులతో సాగే తొట్టెల ఊరేగింపు ఆలయ పూజారి ఇంటికి చేరిన తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించి, అక్కడి నుంచి కోటలోకి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకుపోతారు. గోల్కొండ కోటలోని ఎల్లమ్మ (మహంకాళి) ఆలయంలో తొలిపూజను ఆలయ పూజారులు నిర్వహించి బోనం సమర్పించడంతో తెలంగాణలో బోనాల జాతర ఆరంభమవుతుంది. తొలి బోనంతో జూన్ 25న మొదలైన గోల్కొండ బోనాలు జూలై 23 బోనంతో జాతర ముగుస్తుంది. ఇక సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర జూలై 9, 10 తేదీల్లో జరుగునుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement