bonala jathara
-
ఎడిసన్ లో ఘనంగా MATA బోనాల జాతర
-
జగిత్యాల జిల్లా: 70వేల మందితో అంగరంగ వైభవంగా మల్లన్నకు బోనాలు (ఫోటోలు)
-
సాక పెట్టి సాగంగ... మొక్కులు తీరంగ
హైదరాబాద్: తెలతెలవారంగా... జనమంతా తరలంగా... సాక పెట్టి సాగంగా... మొక్కులు తీరంగా... డప్పుల దరువేయంగా... బొట్టుపెట్టి బోనమెత్తగా.. భక్తజనం హోరెత్తగా... లష్కర్ పోటెత్తగా... అమ్మా.. బైలెల్లినాదో..! మహంకాళి తల్లి బైలెల్లినాదో..! సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఆదివారం వైభవంగా సాగింది. లక్షలాదిమంది భక్తులు అమ్మవారికి బోనాలు, సాక సమర్పించి సల్లంగ చూడాలని మొక్కుకున్నారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచి భక్తులు అమ్మావారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. సాధారణ భక్తుల నుంచి ప్రముఖుల వరకు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రాన్ని సల్లంగా చూడాలని మొక్కుకున్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, హైకోర్టు న్యాయమూర్తి అమర్నాథ్ గౌడ్, ఎంపీలు రేవంత్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, బీబీ పాటిల్, ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, రాంచందర్‌రావు, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి తదితరులు హాజరై అమ్మవారికి ప్రత్యేకపూజలు చేశారు. అమ్మవారి వద్ద హారతి తీసుకుంటున్న సీఎం కేసీఆర్. చిత్రంలో మంత్రులు ఇంద్రకరణ్, తలసాని ఓల్డ్‌దాస్ మండి నుంచి ఒక వాహనంలో బంగారు బోనంసహా 1008 బోనాలను మాజీ ఎంపీ కవిత, పలువురు భక్తులు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. భక్తుల బోనాలు.. పోతురాజుల విన్యాసాలు... సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలన్నీ పండుగ వాతావరణం నెలకొంది. భక్తుల రద్దీకి తోడు వీఐపీల తాకిడి పెరగడంతో సాధారణ భక్తులు తీవ్ర ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ రద్దీని నియంత్రిస్తూ రాకపోకలపై భక్తులకు మార్గనిర్దేశం చేయాల్సిన పోలీసులు, ఇతర విభాగాల అధికారులు వీఐపీల సేవలో తరించిపోయారు. భక్తులు గంటల తరబడి క్యూలైన్లో నిలబడాల్సి రావడం, మంచినీరు, మూత్రశాలలు లేకపోవడంతో మహిళలు, చిన్నపిల్లలు ఇబ్బంది పడాల్సి వచ్చింది. తొలిపూజ చేసిన మంత్రి తలసాని అమ్మవారి బోనాల జాతరలో భాగంగా ఆదివారం ఉదయం 4 గంటలకు మంత్రి తలసాని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆయన సతీమణి అమ్మవారికి బోనం సమర్పించారు. అటు తర్వాత మంత్రి తొలిపూజ చేశారు. అనంతరం సాధారణ భక్తులకు అమ్మవారి దర్శనానికి అవకాశం కల్పించారు. మంత్రితోపాటు కార్పొరేటర్ అత్తెల్లి అరుణగౌడ్, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ సురిటి కృష్ణ కుటుంబసభ్యులు ఉన్నారు. తెల్లవారుజాము నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. -
లండన్‌లో ఘనంగా ‘బోనాల జాతర’ వేడుకలు
లండన్: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు యూకే నలుమూలల నుంచి సుమారు 800 మందికి పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. స్వదేశం లో జరుపుకున్నట్టు సాంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపు, పోతురాజు ఆటలు ప్రవాస బిడ్డలనే కాకుండా స్థానికులని కూడా ముగ్దుల్ని చేసింది. ఎన్నో సంవత్సరాలుగా లండన్‌లో బోనాల జాతర జరుపుతున్నప్పటికీ మొదటి సారి పోతురాజు బోనాలు ఊరేగింపులో పాల్గొని వేడుకలకు నూతన శోభని తీసుకొచ్చాయి. పోతురాజు వేషదారని ధరించిన శ్రీ జై రెడ్డి గారు ప్రత్యేకించి అమెరికా నుంచి లండన్ వచ్చి బోనాలకు పోతురాజు ఉండాలనే ఆలోచనతో టాక్ సంస్థ నిర్వహిస్తున్న బోనాల వేడుకల్లో పాల్గొని వారి కృషిని ప్రోత్సహించడాన్ని, ప్రవాసులే కాక హాజరైన ముఖ్య అతిధులు సైతం ప్రశంసించి సత్కరించారు. ఈ వేడుకలకు స్థానిక ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమ మల్హోత్రా, రూత్ కాడ్బరి, ఇండియన్ హైకమిషన్ ప్రతినిథి ప్రేమ్ జీత్ హౌన్సలౌ, డిప్యూటీ మేయర్ రాగ్విందర్ సిద్దు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బోనాల ఊరేగింపు తరువాత, కార్యక్రమాన్ని ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సంస్థ కార్యదర్శి రత్నాకర్ కడుదుల స్వాగతోపన్యాసం చేసి కార్యక్రమానికి వక్తగా వ్యవహరించారు. భారత సంతతికి చెందిన స్థానిక ఎంపీ వీరేంద్ర శర్మ మాట్లాడుతూ, యూకే లో నివసిస్తున్న తెలంగాణ ఎన్నారైలంతా సమాజ సేవలో ఎంతో క్రియాశీలకంగా పాల్గొంటారని, వీరి స్ఫూర్తి చాలా గొప్పదని తెలిపారు. విదేశాల్లో ఉన్నపటికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని ప్రపంచానికి చాటి చెప్తున్న తీరు చాలా గొప్పగా ఉంది. లండన్ వీధుల్లో బోనాల తొట్టెల ఊరేగింపు చూసి చాలా గర్వపడుతున్నానని, టాక్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. స్థానికంగా ఎటువంటి సహాయం కావాలన్న నన్ను సంప్రదించవచ్చని, లండన్ నగరం భిన్న సంస్కృతుల ప్రజలు నివసించే నగరమని, మనమంతా ఐకమత్యంగా ఉండి పరస్పర సంప్రదాయాలని సంస్కృతిని గౌరవించుకుంటూ ముందుకు వెళ్లాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతిని గమనిస్తున్నామని, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో దేశానికే ఆదర్శంగా, వారి ప్రతి పథకం వినూత్నంగా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఉన్నాయని, ప్రజలంతా అమ్మవారి ఆశీస్సులతో సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. మరో అతిథి ఎంపీ సీమా మల్హోత్రా మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర పండుగ "బోనాల" వేడుకల్ని ఎంతో ఘనంగా నిర్వహించడం, సంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, ముఖ్యంగా లండన్ వీధుల్లో నిర్వహించిన తొట్టెల ఊరేగింపు లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అమ్మవారికి బోనం సమర్పించడానికి పెద్ద ఎత్తున మహిళలు బోనం నెత్తిన ఎత్తుకొని లండన్ వీధుల్లో రావడం చూస్తుంటే, ఒక మహిళగా ఎంతో గర్వంగా అనిపించిందన్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతి ఒక్కరికి తెలిసేలా టాక్ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు ఎందరికో ఆదర్శంగా ఉన్నాయని తెలిపారు. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయడానికి చేస్తున్న కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసి అభినందించారు. ఇండియన్ హై కమిషన్ ప్రతినిధి ప్రేమ్ జీత్ మాట్లాడుతూ బోనాలు వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, తెలంగాణా సంస్కృతి ని ప్రపంచానికి చాటిచెప్తున్న తీరుని ప్రశంసించారు. ఒకవైపు వ్యక్తిగతంగా ఇక్కడున్న వారంతా రోజు వారి పనుల్లో బిజీగా ఉన్నపట్టికి, బాధ్యత గల తెలంగాణా బిడ్డలుగా ఆనాడు ఉద్యమంలో నేడు పునర్నిర్మాణంలో పోషిస్తున్న పాత్ర ఎందరికో ఆదర్శంగా ఉందని తెలిపారు. టాక్ సంస్థ ఇటు జాతీయ పండుగలు, రాష్ట్ర పండుగలు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ భారత జాతి గౌరవాన్ని విదేశీ గడ్డపై ముందుకు తీసుకెళ్తున్న తీరు ఎందరికో స్ఫూర్తినిస్తోందని, భారత హై కమిషన్ అన్ని సందర్భాల్లో టాక్ సంస్థకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. ఎంపీ రూత్ క్యాడ్బరి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఏదో కారణాల వల్ల రాలేక పోయాను. ఇప్పుడు ఈ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని, ఇంత గొప్ప సాంస్కృతిక వేడుకల్లో ఇంతకు ముందు పాల్గొనలేక పోయినందుకు బాధపడుతున్నానని తెలిపారు. కుటుంబ సమేతంగా అంతా కలిసి ఇలా వేడుకలు చేసుకొని రాబోయే తరాలకి తెలియజెప్పడం ఎంతో స్ఫూర్తినిస్తుందని, ముఖ్యంగా మహిళలంతా ముందుండి ఈ వేడుకల్ని నిర్వహించడం సాటి మహిళగా గర్వంగా ఉందని తెలిపారు. బ్రిటన్ అన్ని వర్గాల ప్రజలను, సంస్కృతుల్ని ఆదరించే గొప్ప దేశమని మనమంతా ఐక్యంగా ఉండాలని తెలిపారు. సంస్థ అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది మాట్లాడుతూ టాక్ సంస్థ ద్వారా జరుపుతున్న బోనాల వేడుకలకు విచ్చేసిన అతిథులకు, స్థానిక ప్రవాసులకు కృతఙ్ఞతలు తెలిపారు. ఆడబిడ్డలందరూ బోనాలతో లండన్ వీధుల్లో ఊరేగింపుచేయడం ఉత్సాహాన్ని నింపిందని అన్నారు. టాక్ చేస్తున్న కార్యక్రమాల గురించి అలాగే భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల గురించి సభకు వివరించారు. టాక్ సంస్థని, అలాగే బోనాల జాతర వేడుకల పోస్టర్ని ఆవిష్కరించడమే కాకుండా అన్ని సందర్భాల్లో సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్న నిజామాబాద్ మాజీ ఎంపీ కవితకి కృతఙ్ఞతలు తెలిపారు. టాక్, ఎన్నారై టి.ఆర్.యస్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ, తెలంగాణా ప్రజలందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. లండన్‌లో తెలంగాణ రాష్ట్ర పండుగను ఇంత ఘనంగా నిర్వహించుకోవడం గర్వంగా ఉందని, ఒక నాడు పండుగలంటే కేవలం సంక్రాంతి, ఉగాది మాత్రమేనని ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పడ్డాక బోనాలు - బతుకమ్మ వేడుకల్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎన్నారైలలో ఇంతటి స్ఫూర్తి నింపి, ముఖ్యంగా టాక్ సంస్థని ప్రోత్సహిస్తున్న మాజీ ఎంపీ కవిత గారికి కృతఙ్ఞతలు తెలిపారు. అమెరికా నుంచి వచ్చి పోతురాజు వేషదారణలో వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన జై రెడ్డి గారికి కృతఙ్ఞతలు తెలిపారు. టాక్ సంస్థ, తెలంగాణా ప్రజల కోసం, ప్రపంచంలో ఉన్నతెలంగాణా బిడ్డల కోసం చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించి, ఇందులో బాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమపథకాల గురించి, బంగారు తెలంగాణలో ఎన్నారైల పాత్ర గురించి అందరికీ గుర్తు చేశారు. అలాగే ఇది బోనాల వేడుకైనప్పటికీ, బాధ్యత గల తెలంగాణ బిడ్డలుగా మనందరం చేనేతకు చేయూతనివ్వాల్సిన అవసరం ఉందన్నారు. మన మాజీ రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారు పిలుపునిచ్చినట్టు మనంతా కూడా ఒక రోజు చేనేత దుస్తులు ధరించి వారిని ప్రోత్సహించాలని కోరారు. ప్రముఖ నృత్య కళాకారిణి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత, రాగసుధా వింజమూరి చేసిన మహా శక్తి నృత్యం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బోనం చేసి వేడుకల్లో పాల్గొన్న మహిళలందరిని ప్రత్యేకంగా సత్కరించి, బహుమతులందజేశారు. సంప్రదాయ తెలంగాణా వంటకాలతో పండగ భోజనం సొంత ఇంటిని తలిపించిందని హాజరైన వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమ మల్హోత్రా , రూత్ కాడ్బరి , ఇండియన్ హైకమిషన్ ప్రతినిథి ప్రేమ్ జీత్ మరియు హౌన్సలౌ డిప్యూటీ మేయర్ రాగ్విందర్ సిద్దులను సత్కరించి జ్ఞాపికను అందచేశారు. తెలంగాణ చిన్నారులు, కమిటీ మహిళా విభాగం ఎగ్జిక్యూటివ్ సభ్యులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. అలాగే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని సంస్థ ఎగ్జిక్యూటివ్ టీం జ్ఞాపిక లతో ప్రశంసించారు. టాక్ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన బోనాల జాతర ఇంతటి విజయం సాధించడం సంతోషంగా ఉందని కమిటీ సభ్యులు తెలిపారు. ఇతర ఎన్నారై సంఘాలు జాగృతి యూకే, తాల్, యుక్తా, రీడింగ్ బతుకమ్మ జాతర, హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్ (HYFY), జీయర్ ట్రస్ట్(జెట్), ఎన్నారై టి.ఆర్.ఎస్ యూకే ప్రతినిధులు వేడుకలకు హాజరైన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది, టాక్ అడ్వైషరీ చైర్మన్ గోపాల్ మేకల, ఉపాధ్యక్షులు స్వాతి బుడగం, అడ్వైషరీ వైస్ చైర్మన్ మట్టారెడ్డి సభ్యులు, నవీన్ రెడ్డి, రత్నాకర్ కడుదుల , శ్రీధర్ రావు, శ్రీకాంత్ జెల్ల, సత్య పింగిళి, సత్య చిలుముల, సత్యం కంది, హరి నవపేట్, సుప్రజ, శుషుమ్న రెడ్డి, వీర ప్రవీణ్ కుమార్, సురేష్ బుడగం, క్రాంతి, మమతా జక్కి, శ్రీ శ్రావ్య, శైలజ, శ్వేతా మహేందర్, శ్రీ లక్ష్మి, శ్రీనివాస్, భరత్, రాజేష్ వాకా, వెంకీ, రవికిరణ్, గణేష్, మధుసూదన్ రెడ్డి, మల్ రెడ్డి, రాజేష్ వర్మ, రాకేష్ పటేల్, రంజిత్, రవి రతినేని, వంశీ పొన్నం, నరేందర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
అమ్మవారి బోనం అపురూపం
హైదరాబాద్: 203 ఏళ్ల ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆలయ చరిత్రలో మరో చారిత్రక ఘట్టం. ఈ నెల 29, 30 తేదీల్లో జరగనున్న అమ్మవారి బోనాల జాతరలో సమర్పించేందు కు బంగారు బోనాన్ని తయారుచేయిస్తున్నారు. బోనం తయారీ టెండర్‌ను దక్కించుకున్న మా నేపల్లి జువెలర్స్ ఇప్పటికే 94 శాతం పనులను పూర్తి చేసింది. అమ్మవారికి చేయించిన బంగారు బోనం ఎంతో అద్భుతంగా ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. బుధవారం మానేపల్లి జూవెలర్స్‌లో బోనం తయారీ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అమ్మవారికి వినియోగించకుండా ఉన్న నగలను కరిగించి బోనం తయారు చేయాలని ఆలోచించి.. దాన్ని దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, కమిషనర్ దృష్టికి తీసుకుని వెళ్లామని చెప్పారు. వారు వెంటనే దీనికి ఒప్పుకుని ఉత్తర్వులిచ్చారన్నారు. ఈ నెల 29వ తేదీన ఉదయం 8.30 గంటలకు ఎక్సైజ్ మంత్రి పద్మారావు బంగారు బోనాన్ని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకర ణ్‌రెడ్డికి అందచేస్తారని తెలిపారు. నిజామా బాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు ఇంద్రకరణ్‌రెడ్డి అందిస్తారని, అక్కడి నుంచి 2 వేల మంది లలితాపారాయణ సత్సంగ్ సభ్యులు, మహిళల ఆధ్వర్యంలో బోనాలతో అమ్మవారి దేవాలయానికి ర్యాలీగా బయలుదేరుతారని చెప్పారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా బంగారు బోనం అమ్మవారికి సమర్పించనున్నామని వివరించారు. బోన భాగ్యం అన్ని ఆభరణాల మాదిరిగా కార్ఖానాల్లో కాకుండా అమ్మవారి సన్నిధిలోనే బంగారు బోనం తయారు చేస్తున్నారు. ఎవరికైనా తెలిస్తే పనులకు ఆటంకం కలగడంతోపాటు నియమనిష్టలకు భంగం కలుగుతుందనే ఉద్దేశంతో గోప్యంగా ఉంచారు. - దేవాలయానికి చెందిన 3 కిలోల 80 గ్రాముల బంగారాన్ని కరిగించి ఈ బోనం తయారు చేస్తున్నారు. అమ్మవారి బోనం, దానిపై కలశ చెంబు, దీప ప్రమిద ఉంటుంది. - ఈ నెల 15న బోనం తయారీ పని మొదలైంది. 10 మంది నియమనిష్టలతో దీన్ని తయారుచేస్తున్నారు. - ఈ బోనంపై దేవాలయంలోని గర్భగుడిలో ఉండే మహంకాళి, మాణిక్యాలమ్మల మాదిరే బొమ్మలను తీర్చిదిద్దారు. ఈ బోనంపై 280 వజ్రాలను పొదిగి మరింత అందంగా తీర్చిదిద్దుతున్నారు. - బంగారు ఆభరణాల తయారీకి యంత్రాలను వాడతారు. అమ్మవారి బోనం కావడంతో దీన్ని మొత్తం చేతిపనితోనే తయారు చేస్తున్నారు. రసాయనాలను వాడడంలేదు. కోట్ల వ్యాపారంలో లేని సంతృప్తి ఈ బోనాల్లో అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తున్నారని తెలిసి ప్రపంచవ్యాప్తంగా దీని కోసం ఆసక్తిగా భక్తులు ఎదురు చూస్తున్నారు. అమ్మవారి భక్తులమైన మా కుటుంబానికి ఈ బంగారు బోనం తయారు చేసే పనులు దక్కడం అమ్మవారి కృపతోనే సాధ్యమైంది. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. కోట్ల రూపాయల వ్యాపారంలో లేని సంతృప్తి ఈ బోనం తయారీలో మా కుటుంబానికి దక్కింది. – మానేపల్లి మురళీకృష్ణ -
కోటంత బోనం.. కొండంత జనం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బోనాల జాతర ఆదివారం గోల్కొండ కోటలోని జగదాంబిక ఆలయంలో ప్రారంభం కానుంది. దీనికోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గోల్కొండ కోట, అమ్మవారి ఆలయం, పరిసర ప్రాంతాలను అధికారులు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. భారీసంఖ్యలో తరలిరానున్న భక్తుల కోసం అన్ని సదుపాయాలను సిద్ధం చేశారు. వందల ఏళ్లుగా నగరప్రజలు ఎంతో ఘనంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. కరువు, కాటకాలు, అంటువ్యాధుల నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ ప్రజలు భక్తిప్రపత్తులతో శక్తి స్వరూపిణి అయిన మహంకాళికి సమర్పించే ప్రసాదమే బోనం. నేటి(ఆదివారం) నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు ప్రతి ఆది, గురువారాల్లో అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తారు. ఈ 15వ తేదీనే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతర సన్నాహాలు మొదలవుతాయి. ఇందులో భాగంగా ఆదివారం నుంచి ఘటం ఎదుర్కోలు నిర్వహిస్తారు. ఉజ్జయిని మహంకాళి ముఖాకృతి, ఆభరణాలు, వస్త్రాలను ఘటంపై ఉంచి ప్రధాన ప్రాంతాల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. అనంతరం ఈ నెల 29న మహంకాళి బోనాలు, 30న రంగం భవిష్యవాణి కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే లాల్‌దర్వాజ సింహవాహిని బోనాల పండుగ జరుగుతుంది. బోనాల ఉత్సవాల దృష్ట్యా గోల్కొండ కోటలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ప్రధాన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మొదటిరోజు సుమారు లక్షన్నర మంది భక్తులు తరలివచ్చే అవకాశముంది. అధికార లాంఛనాలతో ఉత్సవాలు... ఆదివారం ఉదయం గోల్కొండ బోనాల పండుగ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు లంగర్‌హౌస్ వద్ద తొట్టెల ఊరేగింపు మొదలవుతుంది. ఇక్కడ ఏర్పాటు చేసే స్వాగ తవేదిక వద్దకు మంత్రులు తలసాని, ఇంద్రకరణ్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి వచ్చి అమ్మవార్లకు పట్టువస్త్రాలు, అధికార లాంఛనాలు సమర్పిస్తారు. బోనా ల ఊరేగింపు సందర్భంగా నిర్వí హించే ప్రతిఘట్టం భక్తిపూరితంగా, భావోద్వేగభరితంగా ఉంటుంది. పోత రాజుల నృత్యాలు, బ్యాండుమేళాలు, భక్తకోటి కోలాహలం, తొట్టెల ఊరేగింపు కనులపండువగా సాగిపోతాయి. గో ల్కొండ కోటపైకి అమ్మవారి ఊరేగింపు కాలినడకన చేరుకోవడంతో అక్కడ పెద్ద జాతరను తలపిస్తుంది. సువిశాలమైన గోల్కొండ కోట భక్తులతో కిటకిటలాడుతుంది. నగీనాబాగ్ నుంచి భక్తరామదాసు బందీఖానా మీదుగా అమ్మవార్ల ఆలయానికి మెట్లపై వెళ్లే మార్గంలో బారులు తీరిన భక్తులను చూసేందుకు రెండు కళ్లు చాలవు. తెలంగాణ భవన్లో బోనాల సంబరాలు సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం, లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారి ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్లో బోనాల ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 16 నుంచి మూడు రోజలు పాటు తెలంగాణ సంప్రదాయాలు, సంస్కృతులు దేశవ్యాప్తంగా తెలిసేలా ఉత్సవాలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ మాజీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ శనివారం తెలిపారు. జూలై 16న ఫొటో ఎగ్జిబిషన్, 17న ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకు అమ్మవారి ఘటాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి భవన్లో ప్రతిష్టించడం, రాత్రి బోనాల విశిష్టతను తెలుపుతూ తెలుగు వర్సిటీ వైస్‌చాన్స్‌లర్ సత్యనారాయణ అధ్యక్షతన కవి సమ్మేళనం, 18న అమ్మవారికి బంగారు బోనం, పట్టువస్త్రాల సమర్పణ కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ ఉత్సవాల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఎంపీ కవిత పాల్గొనే అవకాశం ఉందన్నారు. -
విలక్షణం.. బంజారాల జీవనం
సందర్భం : రేపు గిరిజనుల బోనాల జాతర ‘బంజారా’ ఈ పేరు వినగానే విభిన్నమైన వస్త్రధారణతో ప్రత్యేక దినాలలో కనపడే స్త్రీలు, ఆజానుబాహులైన పురుషులు కళ్ల ముందు కదలాడతారు. అసమాన వీరపరాక్రమాలకు ప్రతీకలైన రాజపుత్రులకు వీరు వారసులంటే ఎవరూ నమ్మకపోవచ్చు. కానీ ఇది అక్షర సత్యం. కాలగర్భంలో కలిసిపోకుండా ఇంకా అక్కడక్కడా నిలిచిన సజీవ సాక్ష్యాధారాలు వారి వీరగాథలను చెబుతున్నాయి. మాతృభూమి సంరక్షణకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా ఆర్పించిన రాజపుత్రల వంశస్తులకు చెందిన వారే ఈ బంజారాలని ఇటీవల చారిత్రాత్మక పరిశోధనల ద్వారా నిగ్గు తేలింది. వీరి వంశాల వెనుక గణనీయమైన చరిత్ర, భిన్నమైన ఆచార వ్యవహారాలను చరిత్ర పరిశోధకులు నిరూపించారు. వీరిలో సంచార జాతులుగా జీవిస్తున్నవారిని ‘గోర్వట్’లని, ఇతరులను ‘కోర్వట్’లని అంటుంటారు. వీరు ఆటపాటలతో ఆరాధించుకునే బోనాల జాతర ఈ నెల 4న జిల్లా కేంద్రం అనంతపురం సందడిగా జరుగనుంది. - అనంతపురం కల్చరల్ వంద మందిలో ఉన్నా బంజారాలను గుర్తించేలా చేసేది వారి వస్త్రధారణ. వారి సంప్రదాయ దుస్తులు భిన్నంగా ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఆభరణాలు, గుడ్డలు కలబోసి ధరించే ఈ దుస్తులు చాలా బరువుగా ఉంటాయి. వెండి, బంగారు, కంచు ఇత్తడి లోహాలతోపాటు ఏనుగు దంతాలతో చేసిన గాజులను మోచేతి వరకు ధరిస్తారు. తలపై నుంచి ధరించే వస్త్రం (ఛాంటియా) అంచుకు పావలా బిళ్లలు, అద్దాలు పొదగబడి ఉంటాయి. కాళ్లకు ధరించే కడియాలు వారు నడుస్తున్నపుడు చేసే వింత శబ్ధాలు వినసొంపుగా ఉంటాయి. సంప్రదాయ దుస్తుల్లో తమకే సొంతమైన పాటలకు వారు చేసే నృత్యం (పేరిమారన్) మైమరపిస్తుంది. ఉత్సవాల సమయంలో హోదాలను మరచి అందరూ లయబద్ధంగా నృత్యం చేయడం విశేషం. లిపి లేకున్నా వీరు ఎక్కడ జీవిస్తే ఆ భాషలోనే లంబాడీ పదాలతో అద్భుతైన గీతాలను వీరు రచించుకున్నారు. శారీరక శ్రమలో వీరిని మించిన వారు లేరు. వివాహ వ్యవస్థలో మార్పు ఒకప్పుడు బంజారాల వివాహ వ్యవస్థ భిన్నంగా ఉండేది. ఆడపిల్లలకే కట్నకానుకలిచ్చి పెళ్లిళ్లు చేసుకునే వారు. నెల రోజుల పాటు వైభవంగా వేడుకలు జరిపేవారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు రెండు మూడు రోజులకు పరిమితమయ్యాయి. అలాగే విడాకుల విషయంలో కూడా నసాబ్ (పంచాయితీ) చేసి పెద్దల సమక్షంలో దంపతులు విడిపోతారు. కాలక్రమంలో హిందూ వివాహ వ్యవస్థనే అనుసరిస్తున్నారు. రేపు జాతర మహోత్సవం అనంతపురం నగరంలోని నాయక్‌నగర్‌లో కొలువైన బంజారాల ప్రాచీన ఆలయంలో ‘సీతలాయ్యాడి బోనాల పండుగ’ను ఈ నెల 4న అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ప్రతి ఏటా ఆషాడమాసం ఆరుద్ర కార్తెలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి పొద్దు పోయే వరకూ ఆలయంలోని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు ఉంటాయి. సంప్రదాయ రీతిలో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకోనున్నారు. బంజారా పూజారులు నాయకుల కులదైవమైన మారెమ్మ తల్లి ప్రతిరూపాలుగా పిలవబడే పెద్దమ్మ, కాంకాళి, మరియమ్మ, సుంకలమ్మ, నాన్‌బాయి, హింగిలా భవానీ, మత్రాళీ తదితర అక్కమ్మ దేవతలను సర్వంగ సుందరంగా అలంకరించి ప్రతిష్టించిన అనంతరం చిన్నా, పెద్ద తారతమ్యం లేకుండా మహిళలు, వృద్ధులు సంప్రదాయ నృత్యంలో మునిగి తేలుతారు. తమ సంస్కృతిని మరచిపోకుండా చేసుకునే పండుగలకు నిదర్శనమే సీతాలయ్యాది ఉత్సవమని నిర్వాహకులు శంకరశివరావు తెలిపారు. మా దుస్తులను మేమే చేసుకుంటాం మా సంప్రదాయ దుస్తులను మేమే తయారు చేసుకుంటాం. ఇప్పటి వారి కోసం హంపి ప్రాంతంలో, మన జిల్లాలోని ఉరవకొండ వెంకటాపురం పెద్ద తండాలో వీటిని తయారు చేస్తున్నారు. ఇప్పటికీ మా అమ్మమ్మలు, నానమ్మలు ప్రకృతి పరమైన వస్తువులతో దుస్తులను తయారు చేసుకుంటున్నారు. పెళ్లిలో వక్కాకు శాస్త్రం సమయంలో, దేవతలకు నైవేద్యం పెట్టే సమయంలో డాంకో అనే వస్త్రం తప్పని సరిగా ఉంటుంది. – శిల్పా బాయి, యూనివర్శిటీ విద్యార్థిని, అనంతపురం తండాలలో నివసించడం సబబే పూర్వం రాజ్యాలకు కాపాల ఉండడం, పశు సంపద, అటవీ సంపదను కాపాడుకోవడం చేసేవాళ్లం కాబట్టి ఊళ్లకు దూరంగా తండాలలో నివసించేవారు. మా వేష భాషల పట్ల మేము పూర్తి సంతృప్తిగా ఉన్నాం. భిన్నమైన ఆచార వ్యవహారాలే మమ్మల్ని ప్రత్యేకంగా చూపెడుతున్నాయి. – శంకర శివరావు రాథోడ్, టీచర్, అనంతపురం మేమంతా నాయకులమే రాణాప్రతాప్‌సింగ్, పృథ్వీరాజ్ చౌహాన్ మా వంశాలకు మూల పురుషులు. లంబాడీలని, సుగాలీలని, బంజరాలని పిలవబడే గిరిజనులు అన్ని ప్రధాన ప్రాంతాల్లోనూ ఉన్నారు. టిప్పుసుల్తాన్ రాజ్యమేలే రోజుల్లో సర్వసైన్యాధ్యక్షులకు, మహావీరులకు ‘నాయక్’ అని బిరుదులిచ్చి సత్కరించేవారు. కాలక్రమంలో ఆ వీరులంతా చెదిరిపోయి బంజారాలుగా దేశ సంచారులుగా ఉండిపోయినా ‘నాయక్’ అనే పదాన్ని మా పేరులోనే ఉంచేసుకున్నాం. – కృష్ణానాయక్ రాథోడ్, అనంతపురం -
బోనాల ముహూర్తం ఖరారు
హైదరాబాద్: తెలంగాణ పండుగ బోనాల జాతరకు ముహూర్తం ఖరారయింది.సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పండుగ తేదిలను నిర్ణయించారు. ఈ జాతర జూన్ 25న ప్రాంభమై జూలై 23న ముగుస్తుంది. సంప్రదాయబద్ధంగా గోల్కొండ బోనాలు లంగర్ హౌజ్ దగ్గర తొట్టెల ఊరేగింపుతో పండుగ మొదలవుతుంది.దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు స్థానికులు పాల్గొనే ఈ ఊరేగింపు ఆలయ పూజారి ఇంటి వరకు సాగుతుంది. పోతురాజుల వీరంగాలు, శివసత్తుల సిగాలు, డప్పు దరువులతో సాగే తొట్టెల ఊరేగింపు ఆలయ పూజారి ఇంటికి చేరిన తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించి, అక్కడి నుంచి కోటలోకి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకుపోతారు. గోల్కొండ కోటలోని ఎల్లమ్మ (మహంకాళి) ఆలయంలో తొలిపూజను ఆలయ పూజారులు నిర్వహించి బోనం సమర్పించడంతో తెలంగాణలో బోనాల జాతర ఆరంభమవుతుంది. తొలి బోనంతో జూన్ 25న మొదలైన గోల్కొండ బోనాలు జూలై 23 బోనంతో జాతర ముగుస్తుంది. ఇక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర జూలై 9, 10 తేదీల్లో జరుగునుంది. -
దుర్గమ్మకు బోనాలు
ధర్మవరం : పంటలు బాగా పండి.. ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలని మహిళలు దుర్గమ్మకు బోనాలు సమర్పించారు. పట్టణంలోని దిగువగేరి, దుర్గానగర్, సత్యసాయినగర్ కాలనీల వాసులు స్థానిక దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా కాలనీల్లోని మహిళలు ఊరేగింపుగా బోనాలు తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు. -
బోనాల ఉత్సవాలకు కంట్రోల్ రూమ్
యాకుత్‌పుర: హైదరాబాద్ నగరంలో బోనాల ఉత్సవాల సందర్భంగా ఆలయాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సర్దార్ మహల్ జీహెచ్ఎంసీ దక్షిణ మండలం కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని జోనల్ కమిషనర్ ఎం. బాలసుబ్రమణ్యం రెడ్డి తెలిపారు. ఈ కంట్రోల్ రూమ్‌లో జీహెచ్ఎంసీలోని ఆరోగ్యం, పారిశుధ్యం, ఇంజనీరింగ్, సీపీడీసీఎల్, రెవెన్యూ, జలమండలి అధికారులు అందుబాటులో ఉంటారని.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా 040-24500254లో సమాచారం అందించాలని సూచించారు. మూడు షిఫ్టులలో 24 గంటల పాటు అన్ని విభాగాలకు చెందిన సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. -
రేపటినుంచే ఘనంగా బోనాల జాతర
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆషాడ మాస బోనాల ఉత్సవాలు ఈనెల 19 ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన వివరాలనుమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఈ ఏర్పాట్లపై మంత్రులతో సమావేశాన్ని నిర్వహించామన్నారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళాకారులు కార్యక్రమాలను నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ఆగస్టు 2,3 తేదీల్లో సికింద్రాబాద్ ప్రాంతంలో, 9,10 తేదీల్లో పాతబస్తీ ఉమ్మడి దేవాయలంలోపాటు ఇతర ప్రాంతాల్లో ఈ ఉత్సవాలు నిర్వహించ నున్నట్టు తెలిపారు. లష్కర్ బోనాలుగా ప్రసిద్ధిగాంచిన సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి జాతర ఆది, సోమవారాల్లో నిర్వహించనున్నారు. ఆదివారం అమ్మవారికి బోనాలు, సాక సమర్పిస్తారు. అనంతరం రంగం ఉంటుంది. ఇందులో జోగిని భవిష్య వాణి వినిపించనుంది. అయితే ఈ సారి జంట నగరాల్లో నిర్వహించే ఉత్సవాల్లో జోగిని పలారం రాధిక సందడి చేయనుంది. హైదరాబాద్ , సికింద్రాబాద్ పరిధిలో అన్ని దేవాలయాల్లో బోనాల జాతరలో జోగిని రాధిక పాల్గొననుంది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ జాతర నిర్వహించేందుకు ఏర్పాటు ఘనంగా జరుగుతున్నాయి. . తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన లక్షలాది మంది భక్తుల ఈ జాతరలో పాలుపంచుకోనున్నారు. బోనాల పండుగ సందోహం గోల్కొండ కోట లోని గోల్కొండ ఎల్లమ్మ ఆలయం వద్ద మొదలయ్యి లష్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయము, బల్కంపేట్ లోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా ఓల్డ్‌సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జీహెచ్ఎంసీ, దేవాదాయ, పోలీసు, జలమండలి, విద్యుత్, ఆర్టీసీ, ఆర్అండ్బీ తదితర శాఖల అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో జంటనగరాల్లోని అమ్మవారి ఆలయాలన్నీ విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. మరోవైపు తెలంగాణా రాష్ట్రంలో అధికార పండుగగా నిర్వహించే బోనాల జాతరలో జోగిని వ్యవస్థను రద్దుచేయాలని, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.