![ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్ - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/71435840276_625x300_3.jpg.webp?itok=u63DJGZb)
ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గురువారం హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించారు. పాత భవనం శిధిలావస్థకు చేరుకోవడంతో ఆ ప్రాంతంలోనే నూతన భవన నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ఆస్పత్రిని సందర్శించినట్లు సమాచారం. ఆయనతో పాటు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కె. లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు.