
రేపు సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 10వ తేదీన (గురువారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. 11న జరిగే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఎన్నికల్లో వెంకయ్య అభ్యర్థిత్వానికి టీఆర్‌ఎస్ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులతోనూ భేటీ అయ్యే అవకాశముంది.