16 నుంచి దరఖాస్తుల స్వీకరణ.. బీఈ, బీటెక్ అభ్యర్థులకు అవకాశం
హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తరఫున ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న తెలంగాణ ఎడ్‌సెట్-2015(టీఎస్‌ఎడ్‌సెట్) ప్రకటనను ఈ నెల 12న విడుదల చేయనున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ప్రసాద్ బుధవారం వెల్లడించారు. ఈ నెల 16 నుంచి మే 7 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుంచి (2015-16) బీఈడీ కోర్సు కాలవ్యవధిని రెండేళ్లకు పొడిగించినట్లు తెలిపారు. బీటెక్, బీఈ ఇంజినీరింగ్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు సైతం బీఈడీ చదివేందుకు అవకాశం కల్పించనున్నట్టు చెప్పారు. అర్హత గల అభ్యర్థులు (www.tsedcet.org ) వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
12న తెలంగాణ ఎడ్‌సెట్ ప్రకటన
Published Thu, Mar 5 2015 3:37 AM | Last Updated on Sat, Sep 2 2017 10:18 PM
Advertisement
Advertisement