తెలంగాణ గాంధీకి కన్నీటి వీడ్కోలు | Telangana Gandhi's tearful goodbye | Sakshi
Sakshi News home page

తెలంగాణ గాంధీకి కన్నీటి వీడ్కోలు

Published Tue, Feb 17 2015 12:41 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

Telangana Gandhi's tearful goodbye

ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
జనసంద్రమైన ఓరుగల్లు
హాజరైన ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం
స్వచ్ఛందంగా విద్యాసంస్థల బంద్

 
వరంగల్ అర్బన్ : తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తి అంతిమయాత్ర కన్నీటి సంద్రంగా, ఉద్వేగభరితంగా సాగిం ది. తెలంగాణ నినాదాల నడు మ అలుపెరగని పోరాట యోధుడికి సోమవారం కన్నీటి వీడ్కోలు పలికారు. తెల్లవారక ముందే తెలంగాణ గాంధీని చివరి చూపు చూ సేందుకు వరంగల్ గిర్మాజీపేటకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తెలంగాణలో ని పది జిల్లాల నుంచి ప్రముఖులు చేరుకున్నారు. విద్యార్థి, యువత, మేధావులు, రాజకీయ ప క్షాలు, న్యాయవాదులు, డాక్టర్లు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆర్యవైశ్యులు, వివిధ కుల సంఘాలు, యూనియన్ల నాయకులు, కార్యకర్తలు, సభ్యులు తరలిరావడంతో ఓరుగల్లు జనసంద్రమైంది. భూపతి కృష్ణమూర్తి మృతికి సంతాపకంగా నగరంలోని ప్రైవేట్ విద్యా సంస్థలను స్వచ్ఛందం గా బంద్ చేశారు. భూపతి కృష్ణమూర్తితో దశాబ్దల సాన్నిహిత్యం  కలిగిన స్వాతంత్య్ర సమరయోధులు ఆయన  భౌతిక కాయం వద్ద కన్నీరుమున్నీరయ్యారు. ఉద్యమాల్లో ఎదురైన అనుభవనాలు, ఘటనలను గుర్తు చేసుకుంటూ గుండెలావిసేలా రోదించారు. 

ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి,  రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి,  జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ గద్దల పద్మ, ఎంపీ సీతారాం నాయక్, జేఏసీ చైర్మ న్ కోదండరాం, ఎమ్మెల్యేలు కొండా సురేఖ, అరూరి రమేష్, శంకర్‌నాయక్, ఎమ్మెల్సీ నాగపూరి రాజలింగ ం తదితరులు ఆయన పార్థీవదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను ప రామర్శించారు. తెలంగాణ పీసీసీ ఛీఫ్ పొన్నాల లక్ష్మయ్య, టీఆర్‌ఎస్ వ్యవస్థాపక సభ్యుడు ప్రకాశ్, పార్టీ పొలిట్ బ్యూ రో సభ్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రవీందర్ రావు, అర్బన్ అధ్యక్షుడు నన్నపనేని నరేందర్, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రె డ్డి, నగర అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్, కాంగ్రెస్ బండా ప్రకాశ్, శాప్ మాజీ డెరైక్టర్ రాజ నాల, శ్రీహరి, బీజేపీ రాష్ట్ర నాయకుడు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్ రెడ్డితోపాటు కలెక్టర్ వాకాటి కరుణ, జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పటేల్, ఎస్పీ అంబర్ కిషోర్‌జా, వివిధ పార్టీల నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, ఆర్యవైశ్య సం ఘం పట్టణ అధ్యక్షుడు గుండా ప్రకాశ్ రావు  ఘనంగా నివాళులు అర్పించారు. ఆ తర్వాత  భూపతి కృష్ణమూర్తి అంతిమ యా త్ర గిర్మాజీపేట నుంచి అశ్రునయనాల మధ్య కొనసాగింది. సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు భూపతి కృష్ణమూర్తి అంతిమయూత్ర, దహన సంస్కారాల ప్రక్రియను అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. పోలీ సు సాయుధ బలగాల డప్పు చప్పుళ్లు, సన్నాయి మేళంతో అంతిమ యాత్ర మొదలైంది. డిప్యూటీ సీయం కడియం శ్రీహ రి, ఎంపీ సీతారాం నాయక్, కలెక్టర్, ఎస్పీలు అంతిమయాత్ర ప్రారంభ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం భూపతి కష్ణమూర్తి పార్థీవ దేహాన్ని ప్రత్యేక వాహనంలోకి ఎక్కించి యాత్ర నిర్వహించారు. గిర్మాజీపేట నుంచి రాధిక థియేటర్, జేపీఎన్ రోడ్డు మీదుగా వరంగల్ చౌరస్తాకు చేరింది. అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి వరంగల్ చౌరస్తాలో భూపతి కృష్ణమూర్తి పార్థీవ దేహం పై పూలమాలాలు వేసి నివాళులర్పించారు. అ నంతరం యాత్ర హెడ్‌ఫోస్టాఫీస్ మీదుగా, అండర్ బ్రిడ్జి, హంటర్ రోడ్డు, చిన్న  బ్రిడ్జి నుంచి ఎస్‌ఆర్‌ఆర్ తోటలోని ఆర్యవైశ్య శ్మశానవాటికకు చేరింది. ఈ క్రమంలో అక్కడ ఉద్వేగ పూరితమైన వాతావరణం నెలకొంది. ఒక్కచోటకు చేరిన తెలంగాణ గొంతుకలు ‘అమర్‌హై తెలంగాణ గాంధీ’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. గుండెల విసే దు:ఖాన్ని దిగమింగుకుంటూ జై తెలంగాణ నినాదాన్ని హోరెత్తించారు.

గౌరవ వందనంతో...

అలుపెరుగని ఉద్యమనేతకు ఎస్‌ఆర్‌ఆర్ తోటలోని రుద్రభూమి సాక్షిగా శాశ్వత విశ్రాంతి లభించింది.  అశేష జనవాహిని కన్నీటితో ఆయనకు కడసారిగా వీడ్కోలు పలికారు. సాయుధ పోలీసు బలగాలు గాలిలో మూడు రౌండ్లు కాల్పులు జరిపి గౌరవ వందనం చేశారు. తెలంగాణ గాంధీ కుమారుడు భూపతి శ్యాంసుందర్ చేతుల మీదుగా భూపతి కృష్ణమూర్తి చితికి నిప్పంటించారు. కాగా,  ఫ్రభుత్వ లాంఛనాలతోపాటు టీఆర్‌ఎస్ అర్బన్ అధ్యక్షుడు నన్నపనేని నరేందర్ నేతృత్వంలో టీఆర్‌ఎస్ శ్రేణులు, తెలంగాణ ప్రజాసమితి నేతలు తిరుణగిరి శేషు, కొంతం కృష్ణ, గందె నవీన్‌కుమార్, తాటికొండ రాములు ఏర్పాట్లు చేశారు.
 
21న మార్కెట్ బంద్

కాశిబుగ్గ :  స్వాతంత్య్ర సమరయోధుడు,  సీనియర్ అడ్తి వ్యాపారవేత్త, తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తి పార్థీవ దేహాన్ని వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ ప్రతినిధులు సందర్శించి సంతాపం తెలిపారు. చాంబర్ కార్యాలయంలో సాయంత్రం సంతాప సభ ఏర్పాటు చేసి, ఘన నివాళులర్పించారు.  కృష్ణమూర్తి మృతికి సంతాప సూచకంగా ఈ నెల 21వ తేదీన వ్యవసాయమార్కెట్ బంద్ చేయాలని  ఏకగ్రీవంగా తీర్మానించారు. అనంతరం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దిడ్డి కుమారస్వామి , సాదుల దామోదర్, గౌరవ కార్యదర్శి గోరంటల యాదగిరి చాంబర్ సభ్యులు పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement