తెలంగాణ మహిళా మణులు వీరే.. | telangana government announces women's day awards | Sakshi
Sakshi News home page

తెలంగాణ మహిళా మణులు వీరే..

Published Mon, Mar 6 2017 5:56 PM | Last Updated on Tue, Sep 5 2017 5:21 AM

telangana government announces women's day awards

హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో కృషి చేసిన 24 మంది మహిళలకు అవార్డులు వరించాయి. సామాజిక సేవ, విద్య, వ్యవసాయం, సాహిత్యం, వృత్తి సేవలతో పాటు వివిధ రంగాల్లో నిర్విరామంగా కృషి చేసిన వారితో పాటు తెలంగాణ మహిళా ఉద్యమకారిణులకు ప్రభుత్వం పురస్కారాలు ప్రకటించింది.

ఉద్యమ పాటలు రాసిన ఇద్దరిని, పాత్రికేయ రంగంలో ముగ్గురిని పురస్కారాలు వరించాయి. వందశాతం నగదు రహిత లావాదేవీల్లో కృషికి 2 గ్రామ పంచాయతీల సర్పంచ్ లకు అవార్డులను ప్రకటించారు. ఈ 24 మంది మహిళలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సత్కరించనుంది.

విద్యారంగం:  డాక్టర్ విద్యావతి (వరంగల్)
సామాజిక సేవ:  జానకి (హైదరాబాద్), దేవకీదేవి (మహబూబ్‌నగర్), గాయత్రి (వనపర్తి), లక్ష్మీబాయి (ఆదిలాబాద్)
వ్యవసాయం:  సుగుణమ్మ (జనగామ), నాగమణి (నల్లగొండ)
తెలంగాణ ఉద్యమకారులు:  మణమ్మ (ఉప్పల్), డి.స్వప్న (హైదరాబాద్), ఎం.విజయారెడ్డి (పెద్దపల్లి)
వృత్తిసేవలు:  ప్రమీల, న్యాయవాది (మంచిర్యాల)
సాహిత్యం:  రజిత (వరంగల్), షాజహాన (ఖమ్మం)
నృత్యం:  వనజా ఉదయ్ (హైదరాబాద్)
చిత్రలేఖనం:  అంజనీరెడ్డి(జహీరాబాద్)
సంగీతం:  పాయల్ కొట్గరీకర్(నిజామాబాద్)
తెలంగాణ ఉద్యమ పాటలు:  చైతన్య (నల్లగొండ), స్వర్ణ (కరీంనగర్)
క్రీడలు:  ప్రియదర్శిని (వరంగల్)
పాత్రికేయ రంగం:  సత్యవతి (హైదరాబాద్), కట్టా కవిత (నల్లగొండ), జి.మల్లీశ్వరి (వరంగల్)
సర్పంచ్ లు:  ఎం.పద్మ (కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామం), కె. లక్ష్మి(సిద్ధిపేట జిల్లా)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement