దేశానికి కావల్సింది విజ్ఞానం, విద్యే కానీ ...తెల్ల కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు కాదని తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.
హైదరాబాద్ : దేశానికి కావల్సింది విజ్ఞానం, విద్యే కానీ ...తెల్ల కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు కాదని తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఆయన సోమవారం టీఆర్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యా సదస్సులో ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. కేజీ టూ పీజీ పథకానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈటెల మరోసారి స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను దశల వారీగా బలోపేతం చేస్తామని తెలిపారు.