
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్య, పోలీసు శాఖలకు సంబంధించిన ఉద్యోగులకు పూర్తి వేతనాలు అందనున్నాయి. ఈ మేరకు గతంలో జారీ చేసిన జీవో నంబర్ 27కు సవరణలు చేస్తూ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ రెండు శాఖలకు సంబంధించిన సిబ్బందికి ప్రస్తుతం చెల్లిస్తున్న పూర్తి వేతనం ఇవ్వాలని, ఈ మేరకు ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ విభాగం చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment