రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద ఉద్రిక్తత | Telangana lawyers protest over separate high court | Sakshi
Sakshi News home page

రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద ఉద్రిక్తత

Published Fri, Feb 27 2015 10:39 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

Telangana lawyers protest over separate high court

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద శుక్రవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. కోర్టులోకి న్యాయమూర్తులు వెళ్లకుండా తెలంగాణ ప్రాంత న్యాయవాదులు అడ్డుకున్నారు. కోర్టు గేటు మూసివేసి అక్కడ బైఠాయించారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

 

ఆందోళన చేస్తున్న న్యాయవాదులను పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు యత్నించగా వారిపై లాయర్లు కోడిగుడ్లు విసిరారు. దాంతో అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఎట్టకేలకు ఆందోళన చేస్తున్న న్యాయవాదులను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడనుంచి తరలించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు  మాట్లాడుతూ తెలంగాణలో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేసేవరకూ తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement