
మా సొమ్ము ఆంధ్రా విద్యార్థులకు ఎలా ఇస్తాం?
హైదరాబాద్: తెలంగాణ ప్రజలను ఏవిధంగా ఏడిపించాలా అని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు చూస్తున్నారని తెలంగాణ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చంద్రబాబుది అనవసర రాద్ధాంతమని అన్నారు. తమ సొమ్మును పక్క రాష్ట్రాల విద్యార్థులకు ఎలా ఇస్తామని ఆయన ప్రశ్నించారు.
ఏ కోర్టు కూడా వారి వాదనలను ఒప్పుకోదని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొన్ని బోగస్ కాలేజీలు ఉన్నాయని, వాటి నుంచి మా విద్యార్థులను కాపాడుకుంటామని హరీష్‌రావు తెలిపారు. తెలంగాణ విద్యార్థులకు మాత్రమే ఫీజురీయింబర్స్ ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.