సాక్షి, రంగారెడ్డి జిల్లా: గ్రామ పంచాయతీల రిజర్వేషన్ల కేటాయింపుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జిల్లా మొత్తంగా ఏ కేటగిరీకి ఎన్ని పంచాయతీలనేది స్పష్టం కావడంతో.. ఇక ఏ పంచాయతీ ఏ కేటగిరీకి కేటాయిస్తారోనని అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పంచాయతీలు, వార్డులకు రిజర్వేషన్ వర్తింపుపై కసరత్తు చేస్తున్న యంత్రాంగం బుధవారం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కలెక్టర్ నుంచి ఆర్డీఓలకు ప్రతిపాదనలు వెళ్లినట్లు తెలిసింది. అయితే రిజర్వేషన్లు ఎలా అమలు చేయాలన్న అంశంపై పూర్తిస్థాయిలో స్పష్టత లేదు. ప్రధానంగా ఏ ప్రాతిపదికన పంచాయతీలు, వార్డులు మహిళలకు కేటాయించాలన్న విషయమై అధికారులు దృష్టిపెట్టారు. తాజాగా దీనిపై మార్గదర్శకాలు వెలువడ్డాయి. ప్రభు త్వం నోటిఫికేషన్ విడుదల చేయగానే రిజర్వేషన్ల వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.
లాటరీ విధానమే...
స్థానిక సంస్థల్లో 50 శాతం సీట్లను మహిళలకు కేటాయించాలని కోర్టు తీర్పు మహిళా రిజర్వేషన్‌కు లాటరీ విధానం! చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాలోని 560 గ్రామ పంచాయతీల్లో 280 జీపీలు మహిళా కోటాలోకి వెళ్లాయి. అయితే ఏయే పంచాయతీలు, వార్డులు మహిళలకు కేటాయించాలన్న అంశంపై అధికారుల వద్ద నిర్ధిష్ట గైడ్‌లైన్స్ లేవు. ఇదే విషయాన్ని సర్కారు దృష్టికి తీసుకెళ్లడంతో మంగళవారం కాస్త పురోగతి లభించింది. మహిళలకు లాటరీ విధానంలో జీపీలు, వార్డులను కేటాయించాలని స్పష్టతనిచ్చింది. కలెక్టర్ నేతృత్వంలో ఆర్డీఓలు లాటరీ విధానంలో ఆయా జీపీలను మహిళలకు రిజర్వ్ చేయనున్నారు.
తుది దశలో..
పంచాయతీలకు రిజర్వేషన్ల వర్తింపుపై యంత్రాంగం వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే అన్ని మండలాలకు సంబంధించి కేటగిరీల వారీగా రిజర్వేషన్ల సంఖ్యను కలెక్టర్ ఖరారు చేయగా.. పంచాయతీల వారీగా వార్డుల రిజర్వేషన్ల సంఖ్యను ఆర్డీఓలు ఫైనల్ చేసినట్లు తెలిసింది. జీపీలకు ఆయా కేటగిరీల కింద రిజర్వ్ చేసే అంశం ఆర్డీఓల పరిధిలో ఉంది. ఇదే తరహాలో వార్డులను సంబంధిత ఎంపీడీఓలు కేటగిరీల వారీగా రిజర్వ్ చేయనున్నారు. ఆయా వార్డుల్లో ఓటర్ల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు.
బేసి సంఖ్య ఉంటే ఎలా..
ఆయా జీపీల్లో వార్డులు బేసి సంఖ్యలో ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో మహిళా కోటా కింద 50 శాతం వార్డులుపోగా అన్‌రిజర్వ్ కింద ఒక వార్డు అదనంగా మిగులుతోంది. ఈ స్థానాన్ని మహిళలకు రిజర్వ్ చేయాలా.. లేక జనరల్‌కు కేటాయించాలా? అనే అంశంపై అధికారుల వద్ద స్పష్టత లేదు. ఉదాహరణకు ఒక పంచాయతీలో 23 వార్డులు ఉంటే.. మహిళలకు 50 శాతం కోటా కింద 11.5 వార్డులను కేటాయించడం అసాధ్యం. అంటే మహిళలకు 11 లేదా 12 కేటాయించాల్సి ఉంటుంది. ఇలా బేసి అంకెగా మిగులుతున్న వార్డుని ఎవరికి కేటాయించాలని ప్రభుత్వాన్ని యంత్రాంగం కోరినట్లు తెలిసింది. దీనిపై బుధవారం స్పష్టత వచ్చే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ తర్వాత వార్డుల రిజర్వ్ ప్రక్రియ కూడా పూర్తి కానుంది.
మహిళా రిజర్వేషన్‌కు లాటరీ విధానం!
Published Wed, Dec 26 2018 12:32 PM | Last Updated on Wed, Dec 26 2018 12:32 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment