సాక్షి, హైదరాబాద్: భారత దేశంలో కరోనా కేసులు రోజురోజు పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను కేంద్రప్రభుత్వం మూడోసారి కూడా పొడిగించింది. దీంతో వేరే రాష్ట్రంలో చిక్కుకుపోయిన వలస కూలీల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. రోజు పూట గడవక, ఆహారం దొరకక, విశాంత్రి తీసుకోవడానికి నివాసం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. తమ సొంత గ్రామలకు పంపించాలని ప్రభుత్వాలకి పదేపదే విజ్ఙప్తి చేస్తున్నారు. దీనిపై స్ఫందిచిన తెలంగాణ ప్రభుత్వం వలస కార్మికులను వారి సొంత గ్రామలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో చాలా మంది వలస కార్మికులు పోలీసు స్టేషన్లకు క్యూ కడుతున్నారు. పోలీసు వారి వివరాలు తీసుకొని వారిని తిప్పి పంపిస్తున్నారు. నివాసం లేని కార్మికులకు ఫంక్షన్ హాల్స్‌లో వసతి సౌకర్యం కల్పిస్తున్నారు.
ఇంత రిస్క్ అవసరమా !
రెండ్రోజుల్లో ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే వీరిని తరలించనున్నారు. బస్సులు, రైళ్ల సంఖ్య చూసుకున్న తరువాత అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వారిని సొంత ఊర్లకి తరలించనున్నారు. వీరితో పాటు సొంత వాహనం ఉంటే సాధారణ ప్రజలను కూడా రాష్ట్రం దాటి వెళ్లడానికి అనుమతించనున్నట్లు తెలుస్తోంది. అయితే తమ ఊర్లకు వెళ్లిన తర్వాత వీరు 28 రోజుల పాటు క్వారంటైన్లో ఉండటానికి ఇష్టపడితేనే తరలిస్తామని షరతు పెట్టింది. అందుకు అంగీకరించే చాలా మంది సొంత ఊర్లకి వెళ్లడానికి ఒప్పుకుంటున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణలో మే నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ను పొడిగించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. (చార్జీల బేరసారాలు)
Comments
Please login to add a commentAdd a comment