
కాళేశ్వరం/మంథని: ప్రపంచమంతా ఆశ్చర్యపడేలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని.. దీని ఫలాలు అందరికీ అందితే అత్యంత సుభిక్షమైన రాష్ట్రంగా తెలంగాణ ఉండబోతుందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అన్నారు.
ఆదివారం పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్మిస్తున్న అన్నారం పంప్‌హౌస్, సుందిళ్ల బ్యారేజీ నిర్మాణ పనులను, అలాగే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కన్నెపల్లి (మేడిగడ్డ) పంప్‌హౌస్ పనులను ఉస్మానియా, కాకతీయ, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ల బృందంతో కలసి పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ పునర్ నిర్మాణం కాళేశ్వరం నుంచి ప్రారంభమైందని చెప్పారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ ప్రజల కల సాకారం అవుతుందని, ఇంజనీర్లు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో విధులు నిర్వర్తిస్తున్నారని కితాబిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment