
ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా వేయాలి: టి.టీడీపీ
హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా వేయాలని టీడీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు లేఖ రాసింది. తమ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరింది.
అధికార టీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని టీడీపీ ఆరోపించింది. సీఎం కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యేల ఫోన్‌లు టాప్ చేసి బ్లాక్‌మెయిలింగ్ పాల్పడుతున్నారని లేఖలో తెలిపింది. పార్టీ ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేసిన తర్వాతే ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేసింది.