దట్టమైన నల్లమల అడవులు.. మధ్యలో కృష్ణమ్మ పరవళ్లు.. తీరప్రాంతాల్లో ప్రాచీన ఆలయాలు.. మత్స్యకారుల బతుకుచిత్రాలు.. హుషారుగా సాగే బోటు ప్రయాణాలు.. ప్రకృతి అందాలు, పక్షుల కిలకిలరావాలు, రాతికొండల కనువిందులు.. చరిత్రలో ప్రఖ్యాతిగాంచిన సురభిరాజుల కోటలు.. వీటన్నింటికి నిలయమైన కొల్లాపూర్‌కు ఇక పర్యాటకశోభ సంతరించుకోనుంది.
దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్రప్రభుత్వం స్వదేశిదర్శన్ పథకం పేరుతో ప్రగతికి శ్రీకారం చుట్టింది. ఏకో టూరిజం ప్రాజెక్టు ద్వారా మొదట రూ.100కోట్లు మంజూరు చేసేందుకు సంసిద్ధత వ్యక్తంచేసింది. ఈ నేపథ్యంలో కొల్లాపూర్ అందాలు, కోటల ప్రాముఖ్యత, ఆలయాల ప్రాశస్త్యాన్ని మరోసారి చూసొద్దాం..!
- కొల్లాపూర్