గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల రిజర్వేషన్లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న అభ్యర్థులు రిజర్వేషన్ల ఖరారుపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. పోటీ చేసేందుకు కొన్నేళ్లుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న నేతలకు చివరి నిమిషంలో ఖరారయ్యే రిజర్వేషన్లు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
సాక్షి, హన్మకొండ : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతోంది. విలీన గ్రామలకు ఉన్న న్యాయపరమైన చిక్కులు తొలగాయి. గతంలో ఉన్న 53 డివిజన్లు 58కి పెరిగాయి. నగర జనాభా 8.20 లక్షలకు చేరుకోగా ఓటర్ల సంఖ్య ఆరు లక్షలుగా నమోదైంది. వీరి కోసం 619 పోలింగ్ స్టేషన్లు ప్రకటించారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు మిగిలిన ప్రధానఘట్టం వార్డులవారీగా రిజర్వేషన్లు ఒక్కటే. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులు, నగర ప్రజలు రిజర్వేషన్ల ప్రక్రియపై ఆసక్తిగా ఉన్నారు. ఏ డివిజన్, ఏ సామాజిక వర్గానికి రిజర్వేషన్ కానుందనేది కీలకంగా మారింది.
అంతేకాకుండా ఈ దఫా మేయర్ స్థానం రిజర్వేషన్ ఏ వర్గానికి దక్కుతుందోననే ఉత్కంఠ నెలకొంది. కార్పొరేటర్‌గా ఎన్నికై మేయర్ పదవి దక్కించుకునేందుకు అన్ని రాజకీయపార్టీల నుంచి కీలక నేతలు వ్యూహం సిద్ధం చేసుకున్నారు. గత ఎన్నికలు ముగిసినప్పటి నుంచే రానున్న ఎన్నికలనృ దష్టిలో పెట్టుకొని డివిజన్‌లలో పట్టు, పార్టీలో పలుకుబడి, ప్రధాననేతల చుట్టూ తిరుగుతున్నవారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వీరితోపాటు కార్పొరేటర్ లక్ష్యంగా పనిచేస్తున్న ద్వితీయశ్రేణి నాయకులు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నారు. మాజీ కార్పొరేటర్‌లు, పోయిన దఫా ఎన్నికల్లో ఓడిపోయి మరోసారి తమృఅదష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధపడుతున్న వారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.
ఎవరికి ఏ డివిజన్ దక్కేనో?
వరంగల్ నగరంలో ప్రస్తుతం 58 డివిజన్‌లు ఉన్నాయి. గతంలో 53 డివిజన్లు ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల్లో 33 శాతం రిజర్వేషన్ ప్రకారం 18 డివిజన్‌లు మహిళలకు కేటాయించారు. ఇప్పుడు డివిజన్ల సంఖ్య 58కి పెరిగింది. అంతేకాకుండా మహిళలకు 50శాతం రిజర్వేషన్‌లు కల్పిస్తూ తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనితో మహిళల ప్రాతినిధ్యం పెరగనుంది. దీని వల్ల ఇంతకాలం డివిజన్‌పై కన్నేసిన నాయకులు రిజర్వేషన్లలో చిక్కులు ఎదురైతే తమకు బదులుగా తమ కుటుంబ సభ్యులను రంగంలోకి దింపేందుకు మార్గం సుగమం చేస్తుకుంటున్నారు.
మరికొందరు నాయకులు ఎందుకైనా మంచిదని రెండు, మూడు డివిజన్లపై పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి తోడు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్‌లు ఉన్నాయి. దీనితో రిజర్వేషన్లు వచ్చిన తర్వాతే ఎన్నికల పోటీ చేసే అంశంపై రాజకీయ పార్టీలు, ఆశావహులకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అందువల్ల 58 డివిజన్‌లలో రిజర్వేషన్ల కేటాయింపుల ప్రక్రియ తేలే వరకు పోటీపై ఆసక్తి ఉన్న వారికి ఉత్కంఠ నెలకొంది.
ఏ పద్ధతిన చేస్తారో?
రిజర్వేషన్లు ఖరారు చేయడానికి ఓటర్ల ప్రతిపాదిక? లాటరీ పద్ధతి పాటిస్తార? అనేది తేలాల్సి ఉంది. జనాభా ప్రతిపాదికన అయితే ఆయా డివిజన్లవారీగా మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల ప్రాతిపదికన తీసుకుంటారా? లేదా ఏకమొత్తంగా తీసుకుంటారా? అనేది నిర్ణయించాలి. రోటేషన్ పద్ధతిని ప్రతిపాదికన తీసుకుంటే ఒక దఫా రిజర్వేషన్‌లు అమలు పరిచిన డివిజన్‌లను తప్పించి ఈ దఫా రొటేషన్ పద్ధతిలో ఇతర డివిజన్‌లు కేటాయిస్తారా తేలాల్సి ఉంది.
ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఎంపిక రిజర్వేషన్ల ప్రక్రియలో అడుగు ముందుకు పడేందుకు ఆస్కారం ఉంది. అప్పటి వరకు రిజర్వేషన్ల కోసం ఎదరుచూడడం తప్పదు. తెలంగాణలో రెండో పెద్దనగరంగా వరంగల్‌కు గుర్తింపు ఉండటంతో మేయర్ పదవి దక్కించుకునేందుకు బడా నాయకులే బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే మేయర్ స్థానం ఏ సామాజిక వర్గానికి రిజర్వు అవుతుందనే అంశంపై ఆధారపడి వ్యూహలు అమలవుతాయి.
టెన్షన్
Published Sun, Aug 9 2015 2:27 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement
Advertisement