మంచిర్యాల టౌన్, న్యూస్‌లైన్ : పురపాలక సంఘాల ఎన్నికల ఫలితాలు విడుదల చేస్తే.. ఆ ప్రభావం స్థానిక, సార్వత్రిక ఎన్నికలపై పడుతుందన్న పార్టీల పిటిషన్‌తో రాష్ట్ర హైకోర్టు ఫలితాలను ఈనెల 9కి వాయిదా వేసింది.
అయితే.. అప్పుడు కూడా వెలువడకుండా సార్వత్రిక ఎన్నికల తర్వాతే ఇవ్వాలని పార్టీలు మళ్లీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ మేరకు ఆ ఫలితాలపై తీర్పు సోమవారం వెలువడనుంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల్లో అయోమయం నెలకొంది. సుప్రీం కోర్టు తీర్పు ఎలా ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలకు మార్చి 30న ఎన్నికలు జరిగాయి. అయితే.. వాటి ఫలితాలను ఈనెల 2నే ప్రకటించాల్సి ఉన్నా.. ఫలితాలు వాయిదా వేయాలని పార్టీలు హైకోర్టును ఆశ్రయించాయి.
దీంతో హైకోర్టు ఫలితాలను 9వ తేదీన వెల్లడించాలని తీర్పునిచ్చింది. అయితే.. ఈ నేపథ్యంలో ఫలితాలు విడుదల చేయొద్దని వారు మళ్లీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో ము న్సిపాలిటీల్లో ఎక్కడచూసినా ఎన్నికల ఫలితాలపై సంది గ్ధం, ఆసక్తి నెలకొంది. వాయిదాలపై రకరకాలుగా చర్చ లు జరుగుతాన్నాయి. నెలరోజులపాటు హడావిడి కని పించిన మున్సిపాలిటీల్లో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవహిం చింది.
ప్రస్తుతం ఏ అభ్యర్థిని చూసినా ఉత్కంఠతో కనిపిస్తున్నాడు. ఫలితాలు వెల్లడైతే గెలుపు ఎవరిదో.. ఓటమి ఎవరిదోనని తేలిపోతుందని అభ్యర్థులు భావిస్తున్నారు. దాదాపు ఎనిమిదేళ్ల అనంతరం వచ్చిన ఎన్నికలతో మున్సిపాలిటీల్లో రసవత్తర రాజకీయాలు చోటు చేసుకున్నాయి. ఇక మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాలను కైవసం చేసుకోవాలని పార్టీలూ తహతహలాడుతున్నాయి.
సార్వత్రికం తర్వాతేనా..?
జిల్లాలోని మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించారు. మందమర్రిలో మాత్రం ఈసారి కూడా ఎన్నికల నిర్వహించలేదు. అయితే.. అభ్యర్థుల భవిత ఈవీఎంలలో నిక్షిప్తమై భద్రంగా ఉంది. ఇదిలే ఉంటే.. సార్వత్రిక ఎన్నికల తర్వాతే ఈ ఫలితాలు వెల్లడయితాయని రాజకీయ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
ఎవరి లెక్కలు వారివే..
ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమ గెలుపుపై అంచనాలు వేస్తున్నారు. తమకు వచ్చే ఓట్లెన్నీ.. గెలిచే అవకాశాలు ఉన్నాయా.. ఈ ఓటు మనదేనా అంటూ బేరీజు వేస్తున్నారు. ఓటరు జాబితాలతో కుస్తీపడుతున్నారు. ఒకానొక దశలో తమ గెలుపు ఖాయమనే ధీమాలో ఉన్నారు.
ఆయా పార్టీలు చైర్మన్ పీఠం తమదేనన్న ఆశగా తమ నేతలతో సమాలోచనలు చేస్తూ సుదీర్ఘ చర్చలు సాగిస్తున్నారు. చాలా కాలం తర్వాత ఎన్నికలు జరగడం, కొత్త ఓటర్ల సంఖ్య భారీగా పెరగడం, కొంత పోలింగ్ శాతం కూడా మెరుగుపడటంతో ఆసక్తి పెరిగింది.
కొనసాగుతున్న ఉత్కంఠ..
Published Mon, Apr 7 2014 1:47 AM | Last Updated on Tue, Oct 16 2018 6:44 PM
Advertisement
Advertisement