యాదాద్రి: మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ.. బీజేవైఎమ్ ఆధ్వర్యంలో చేపట్ట తలచిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. యాదాద్రి జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం ఆందోళన నిర్వహిస్తున్న బీజేవైఎమ్ కార్యకర్తలను అక్కడి నుంచి పక్కకు జరగాల్సిందిగా పోలీసులు కోరారు. దీనికి నిరసనకారులు ఒప్పుకోకపోవడంతో పోలీసులు వారిని బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త వాతవరణం నెలకొంది. కొందరు ఆందోళనకారులు పోలీసులపై చేయి చేసుకున్నట్లు సమాచారం.