దటీజ్ పాలమూరు | Tenth class results sucessful in mahabubnagar district | Sakshi
Sakshi News home page

దటీజ్ పాలమూరు

Published Fri, May 16 2014 3:35 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

Tenth class results sucessful in mahabubnagar district

కొత్త రాష్ట్ర అవతరణ చేరువలోనే ఉన్న శుభవేళ ఈ మారు టెన్త్ విద్యార్థులు తమ సత్తా చాటి పాలమూరు బిడ్డల ప్రతిభ చాటారు. ఆంధ్ర రాష్ట్రస్థాయిలో నాలుగో స్థానంలో నిలవడమే కాకుండా, తెలంగాణంలో ద్వితీయ స్థాయిలో నిలచి జిల్లా విద్యాశాఖను సంబరంలో ముంచెత్తారు.ప్రణాళికాయుత బోధన, విద్యార్థుల పడిన కష్టానికి ఫలితం దక్కిందని అధికారులు ఆనందపడుతున్నారు. తల్లిదండ్రులూ పిల్లల ప్రతిభ చూసి మురిసి పోతున్నారు. ఈ మారు ఫలితాల్లోనూ బాలికలు తామే ఫస్టని నిరూపించుకొని ప్రశంసలందుకుంటున్నారు.
 
 మహబూబ్‌నగర్ విద్యావిభాగం, న్యూస్‌లైన్:  గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో జిల్లా విద్యార్థులు తెలంగాణలో రెండో స్థానం పొంది తమ సత్తా చాటారు. గత పదేళ్లుగా లేని ఉత్తీర్ణతాశాతాన్ని  ఈ ఏడాది సా ధించి సెహభాష్ అనిపించుకున్నారు. ఇక  రాష్ట్ర స్థాయిలో కూడా 4వ స్థానంలోనిలచి ప్రశంసలందుకుంటున్నారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా బాలుర కంటే బాలికలదే పైచేయి అయ్యింది. గతేడాది 91.22 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 93.77 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గతేడాదితో పోలిస్తే పది ఫలితాల్లో 2.55 శాతం పెరిగింది.
 
జిల్లా వ్యాప్తంగా 250 పరీక్షా కేంద్రాల్లో 47వేల మంది విద్యార్థులు పది పరీక్షలు రాశారు. మొత్తం 24,672 మంది బాలురు పరీక్షలు రాయగా 23,003 మంది అంటే 93.24శాతం ఉత్తీర్ణత సాధించారు. అదే విధంగా 22, 328 మంది బాలికలు పరీక్షలు రాయగా 21,067 మంది విద్యార్థినులు  94.35 మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 47వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 44,070 మంది విద్యార్థులు ఉత్తీర్ణ సాధించారు. 93.77శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ప్రైవేటు విద్యాసంస్థల్లోనూ విద్యార్థులు తమ ప్రతిభ చాటారు. జిల్లా కేంద్రంలోని బాలాజీ , జ్ఞానభారతీ స్కూల్, రెయిన్‌బో, ఆకృతి, అపెక్స్, లిటిల్ స్కాలర్స్, సరస్వతి శిశుమందిర్ తదితర పాఠశాలల్లో విద్యార్థులు 10కి 10పాయింట్లు సాధించారు.
 
 విద్యాశాఖలో ఆనందం..
 తెలంగాణలో జిల్లా రెండో స్థా నంలో నిలవడం పట్ల జిల్లా విద్యాధికారులు సంతోషంలో మునిగిపోయారు. ఉత్తీర్ణతాశా తం మెరుగుపడటంతో డీఈఓ కార్యాలయంలో సిబ్బంది స్వీ ట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా డీఈఓ చంద్రమోహన్ మాట్లాడుతూ ఉపాద్యాయులు, హెచ్‌ఎంలు, తల్లిదండ్రులు, విద్యార్థుల కృషి ఫలితంగానే ఫలితాలు మెరుగుపడ్డాయన్నారు.  విద్యార్థులకు విద్యాశాఖ ద్వారా ప్రత్యేక ప్రేరణ తరగతులు నిర్వహించడం ఉత్తీర్ణతాశాతం పెరుగుదలకు ఉపయోగపడిందన్నారు. కలెక్టర్ ఎప్పటికప్పుడు ప్రత్యేక దృష్టి సారించి సమీక్ష చేశారని, కలెక్టర్ సూచనలకు అనుగుణంగా విద్యాధికారులు చేసిన కృషి, విద్యార్థుల కష్టం ఫలితంగా ఈ రిజల్ట్ సాధ్యమైందన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నూరు శాతం ఫలితాలు వచ్చేలా ఇప్పటినుంచే ప్రణాళికా బద్దంగా  వ్యవహరిస్తామని డీఈఓ చంద్రమోహన్ అన్నారు.
 
 గత ఐదేళ్లతో పోలిస్తే
 పెరిగిన ఉత్తీర్ణతాశాతం..:
 గత ఐదేళ్లతో పోలిస్తే ఉత్తీర్ణతాశాతం ఈ ఏడాది పెరిగింది. 2007-08లో 85శాతం, 2008-09లో 85.28శాతం, 2009-10లో 77.93శాతం, 2010-11లో 85.83శాతం, 2011-12లో 90.59శాతం, 2012-13లో 91.22శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 93.77 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో జిల్లా 4వ స్థానంలో నిలిచింది. సందర్భంగా ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను జిల్లా విద్యాధికారి చంద్రమోహన్ అభినందించారు.
 
 జూన్16 నుంచి
 సప్లిమెంటరీ పరీక్షలు...:
 10వ తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 16వ తేది నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఈఓ చంద్రమోహన్ వెల్లడించారు. ఈనెల 30వ తేదిలోపు   విద్యార్థులు పరీక్ష ఫీజులు చెల్లించాలని, జూన్  2 వతేదిలోపు పాఠశాలల యాజమాన్యాలు స్కూల్‌హెడ్స్ ఎస్‌బిహెచ్, ఎస్‌బిఐ బ్యాం కుల్లో జమచేయాలని డీఈఓ ఆదేశించారు. మార్కులు రీకౌంటింగ్ చేయించుకోవాలనుకునే విద్యార్థులు 12 రోజుల లోపు సబ్జెక్టుకు రూ.500 చెల్లించి లెక్కింపు చేయించుకోవాలని సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement