
దమ్మపేట: అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు రాజకీయ ప్రస్థానం గ్రామ పంచాయతీల నుంచే ప్రారంభమైంది. మెచ్చా నాగేశ్వరరావు 1995లో దమ్మపేట మండలం మొద్దులగూడెం సర్పంచ్‌గా తొలిసారిగా ఎన్నికైయ్యారు. తర్వాత 2001లో జరిగిన ఎన్నికల్లో అదే పంచాయతీ నుంచి ఆయ ఏకగ్రీవమయ్యారు.
దాదాపు పదేళ్లపాటు ఆయన మొద్దులగూడెం సర్పంచ్‌గా ఆయన పనిచేశారు. 2014లో అశ్వారావుపేట ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్లతేడాతో ఓటమి పాలయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు 1981లో వేలేరుపాడు మండలం తాట్కూరుగొమ్ము పంచాయతీ నుంచి సీపీఐ బలపర్చిన అభ్యర్థిగా బరిలో దిగి సర్పంచ్‌గా విజయం సాధించారు.
1999లో తాటి టీడీపీలో చేరి.. బూర్గంపాడు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 2014లో అశ్వారావుపేట నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment