భవనం పై నుంచి పడి వ్యక్తి మృతి | The death of a man who fell from the top of the building | Sakshi
Sakshi News home page

భవనం పై నుంచి పడి వ్యక్తి మృతి

Published Thu, Oct 29 2015 4:25 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

The death of a man who fell from the top of the building

గోదాంపై రేకులు సవరిస్తున్న వ్యక్తి ప్రమాదవశాత్తూ జారిపడి మృతి చెందాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం పంచాయతి పరిధిలోని కొత్తూరులో గురువారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే..  గ్రామానికి చెందిన కృష్ణ(44) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గోదాంలో రేకులు సవరిస్తుండగా.. కాలు జారి కింద పడ్డాడు.. తీవ్రగాయాలు అయిన ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement